విజయవాడ

నేటి నుంచి శ్రీలక్ష్మీ పౌండరీక యజ్ఞం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కల్చరల్), జనవరి 21: శ్రీ లక్ష్మీ శ్రీనివాస వాసవీ సేవా సమితి ఆధ్వర్యంలో పిడబ్ల్యుడి గ్రౌండ్స్ (స్వరాజ్ మైదానం)లో వారం రోజులపాటు అతి వైభవంగా జరగే శ్రీ లక్ష్మీ పౌండరీక మహాయజ్ఞం, శ్రీవారి నిత్యోత్సవాలు ఈ నెల 22న ఆదివారం నుంచి 28 శనివారం వరకు జరుగుతాయని పాలకవర్గ అధ్యక్షుడు దూపుగుంట్ల శ్రీనివాసరావు తెలిపారు. శనివారం మధ్యాహ్నం అదే ప్రాంగణంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుమలలో శ్రీవారికి నిర్వహించే సేవలు, కైంకర్యాలు అన్నీ యథావిధిగా జరుగుతాయని తెలిపారు. 15 హోమగుండాలతో యజ్ఞ క్రతువులను వందమంది వేద పండితులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రతిరోజూ శ్రీవారి కల్యాణానికి పీటలపై 200మంది దంపతులు కూర్చొనవచ్చని ముందుగా పేరు నమోదు చేయించుకోవాలన్నారు. మధ్యాహ్నం దాదాపు పదివేల మందికి అన్న ప్రసాద వితరణ జరుగుతుందని తెలిపారు. గౌరవాధ్యక్షురాలు మానేపల్లి లక్ష్మీకుమారి మాట్లాడుతూ విశ్వకల్యాణం కోసం దేశం, రాష్ట్రంలోని ప్రజలు సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని ఈ భగవత్కార్యక్రమాలు, యజ్ఞాలు, హోమాలు చేస్తున్నామని తెలిపారు. ప్రతిరోజూ ఒక్కొక్క పీఠాధిపతి విచ్చేసి ఆశీస్సులు అందిస్తారని తెలిపారు. కళావేదికపై ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. గరిమెళ్ల నానయ్య చౌదరి మాట్లాడుతూ భక్తి వికాసం కోసం, శ్రేయస్సును ప్రజలందరూ పొందాలనే దివ్యమైన ఆలోచనతో ఇటువంటి దైవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నగర, నగరేతర భక్తులందరూ విచ్చేసి భగవంతుని అనుగ్రహానికి పాత్రులవ్వాలని కోరారు. విలేఖరుల సమావేశంలో కార్యదర్శి మామిడి లక్ష్మీ వెంకట కృష్ణారావు, కోశాధికారి ఉదయగిరి శ్రీనివాసబాబు, సభ్యులు రెడ్డి ఉమామహేశ్వరగుప్త పాల్గొన్నారు.
గ్రామీణ జీవితానికి అద్దంపట్టిన ‘శీలావి’ చిత్రాలు

విజయవాడ, జనవరి 21: శీలా వీర్రాజు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన తెలుగు చిత్రకారుడనీ, ఆయన చిత్రాలు గ్రామీణ జీవన విధానానికి అద్దం పడుతున్నాయని అంతర్జాతీయ నైరూప్య చిత్రకారుడు పద్మశ్రీ ఎస్వీ రామారావు అన్నారు. మొగల్రాజపురంలోని మధుమాలక్ష్మి ఛాంబర్స్‌లో కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ - అమరావతిలో ‘శీలావి’గా ప్రసిద్ధి చెందిన శీలా వీర్రాజు రెండురోజుల చిత్ర కళాప్రదర్శనను శనివారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా రామారావు ప్రసంగిస్తూ వీర్రాజు శైలి, నైపణ్యం ఈతరం చిత్రాకారులకు మార్గదర్శకాలన్నారు. ఆయన చిత్రాల్లో పల్లెటూరి వాతావరణం వెల్లి విరుస్తోందనీ, పెళ్లి, ముగ్గు వేయటం, మొక్కలు పెంచటం, ఏటి నుంచి నీటిని తేవటం, జాలర్లు చేపలు పట్టడం, రైతుల పొలం పనులు, ఇంటి పనుల్లో స్ర్తిలు, పిల్లలకు జడ వేయటం, కథలు చెప్పటం, వడ్లు దంచటం, పిండి ఆడించటం, బుట్టలల్లటం, రాట్నం వడకటం, చలిమంటలు కాగటం లాంటి మరచిపోతున్న దృశ్యాలను రంగులను మేళవించి హృద్యంగా చిత్రించారనీ వివరించారు. కల్చరల్ సెంటర్ సీఈవో డా. ఈమని శివనాగిరెడ్డి మాట్లాడుతూ శీలావి వేసిన ప్రతి చిత్రమూ ఒక దృశ్య కావ్యమని కొనియాడారు. చిత్రకళా ప్రదర్శన నిర్వాహకులు, ప్రజాసాహితి సంపాదకులు కొత్తపల్లి రవిబాబు మాట్లాడుతూ శీలా వీర్రాజు చిత్రాలు ఒక చక్కటి సందేశంతో పాటు సంప్రదాయాలు, సంస్కృతితో నిండి ఉంటాయన్నారు. క్రియేటివ్ ఆర్ట్ అకాడమీ అధ్యక్షుడు, ప్రముఖ వ్యంగ్య చిత్రకారుడు టివి, చిత్రకారుడు కళాసాగర్, సాహితీ వేత్త సశ్రీ, జనసాహితి అరుణ, మాలక్ష్మి ప్రాపర్టీ వెంచర్స్ సీఈవో సందీప్ మండవ, నగర చిత్రకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిత్రకారుడు శీలావి స్పందిస్తూ నవ్యాంధ్ర రాజధానిలో తన ప్రదర్శన ఏర్పాటు చేసిన కొత్తపల్లి రవిబాబు, అరుణలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం సాయంత్రం శీలా వీర్రాజు సాహితీ గోష్టితో చిత్రకళా ప్రదర్శన ముగుస్తుందని రవిబాబు తెలిపారు.