విజయవాడ

ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జనవరి 21: ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప నేత స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరు తారక రామారావు అని సమాచార పౌర సంబంధాలు, ఐటి, మైనార్టీ శాఖల మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. ఆయన శనివారం మంత్రులు కొల్లు రవీంద్ర, పరిటాల సునీతతో కలిసి ఉదయం సిద్ధార్థ ఫార్మాస్యూటికల్ సైన్స్ కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ మ్యూజియంను సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ ఎన్టీఆర్ జీవిత విశేషాలను నాలుగు దశలుగా చూపించినందుకు ఎన్టీఆర్ ట్రస్ట్‌కు అభినందనలు తెలిపారు. ఎన్టీఆర్ దీక్షా దక్షతలతో ఎవరి సాయం లేకుండా సినిమాల్లో, రాజకీయాల్లో రాణించారన్నారు. అంతేకాకుండా తెలుగువారి విశిష్టతలను ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప వ్యక్తి అని చెప్పారు. ఏ పాత్ర పోషించినా దానికి న్యాయం చేయడంతో పాటు ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచేలా రాముడిగా, శ్రీకృష్ణుడిగా, రావణాసురుడిగా నటనకే భాష్యం చెప్పారన్నారు. దివిసీమలో తుపాను వచ్చి ప్రజలు ఇబ్బందులు పడినప్పుడు వారికి ఇతోధికంగా సాయం చేశారన్నారు. ఆయన పరిపాలనా కాలంలో పేదలకు కిలో రెండు రూపాయలకే బియ్యం, ఇళ్ల నిర్మాణం చేపట్టారన్నారు. ఎంతోమంది కొత్త వ్యక్తులను రాజకీయాల్లోకి తెచ్చిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందని, ఇందులో సింహభాగం ఎస్సీ, ఎస్టీ, బిసిలకే చెందుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడంలో అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ తెలుగుజాతి ముద్దుబిడ్డ, తెలుగుజాతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహా నాయకుడు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని చెప్పారు. ఎన్టీఆర్ మ్యూజియం ఒక నమూనా మాత్రమేనని, రాజధాని అమరావతిలో 15 ఎకరాల సువిశాల ప్రాంతంలో పెద్దఎత్తున ఏర్పాటు చేయటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. తెలుగుజాతి అభివృద్ధి, సంక్షేమం ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ పనిచేసిన కాలంలోనే చూశామన్నారు. ఆయన జీవితంలో సాధించిన విజయాలు, పట్టుదల నుంచి ఈనాటి యువతరం నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్నారు. నేటితరానికి ఎన్టీఆర్ గురించి తెలియజెప్పేలా మ్యూజియం ఏర్పాటు చేసిన ట్రస్ట్‌కి ధన్యవాదాలు తెలిపారు. తన భర్త పరిటాల రవి లాంటి ఎందరికో రాజకీయ భిక్ష పెట్టారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనలాంటి వారికి ఎమ్మెల్యేగా అవకాశాలు ఇవ్వడంతో పాటు మంత్రిగా కొనసాగే అవకాశం కల్పించారని, దీన్ని తమ కుటుంబం ఎన్నటికీ మర్చిపోదన్నారు. ఎన్టీఆర్ చనిపోయిన లోటును ఎవరూ తీర్చలేరని, కానీ తెలుగు ప్రజలకు ఒక గుర్తింపు తెచ్చిన ఘనత మహానేత ఎన్టీఆర్‌కే దక్కుతుందని వివరించారు. రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు శనివారం సాయంత్రం ఎన్టీఆర్ మ్యూజియంను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ జ్ఞాపకాలను ప్రజలు చూసే విధంగా విజయవాడలో ఏర్పాటు చేయడం మంచి పరిణామమన్నారు. బాల్యం నుంచి ఎన్టీఆర్ కష్టపడి ఏవిధంగా పైకొచ్చారో లఘుచిత్రాల ద్వారా చూపించడం సంతోషంగా వుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ముఖ్యమంత్రులను తరచూ మార్చడం నచ్చక ఎన్టీఆర్ పార్టీని స్థాపించారన్నారు. తన పాలనలో ప్రజలకు ఉపయోగపడేలా అనేక సంస్కరణలు, కార్యక్రమాలు చేపట్టారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సమయస్ఫూర్తితో ప్రజలకు మేలుచేయడానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. శనివారం విద్యార్థినీ, విద్యార్థులు ఎన్టీఆర్ మ్యూజియం చూడటానికి తరలివచ్చారని నిర్వాహకులు తెలిపారు.
అంబేద్కర్ ఆలోచనా విధానంతోనే సామాజిక హక్కుల సాధన
బెంజిసర్కిల్, జనవరి 21: అణగారిన వర్గాల హక్కుల కోసం, కులాల అంతరాలు తొలగించడం కోసం తన జీవితానే్న పణంగా పెట్టిన అంబేద్కర్ ఆలోచనా విధానంతో ముందుకెళ్లిన నాడే సామాజిక హక్కుల సాధన అనేది సాధ్యమవుతుందని పలువు వక్తలు అభిప్రాయపడ్డారు. సామాజిక హక్కుల వేదిక ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం శనివారం నగరంలోని ఎంబీవీకే భవన్‌లో నిర్వహించారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సునీల్‌కుమార్ మాట్లాడుతూ అణగారిన వర్గాలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు నేడు వారికి లభించడం లేదన్నారు. హక్కుల వేదిక కన్వీనర్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ ఈదేశంలో కులం మనుషుల మధ్య అంతరాలను పంచిందన్నారు. అనంతరం బిసి జనసభ వ్యవస్థాపకుడు గంగాధర్, సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సుబ్బారావు, ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్ షారోన్‌రాజు, ఏఐటీయుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు తదితరులు ప్రసంగించారు.