విజయవాడ

విజయవాడ రైల్వేస్టేషన్ మీదుగా వెళ్లిన హమ్‌సఫర్ అధునాతన రైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (రైల్వేస్టేషన్), జనవరి 21: కపుర్తల రైల్‌కోచ్ ఫ్యాక్టరీలో రూపుదిద్దుకున్న భారతీయ రైల్వేలోనే మరో అధునాత రైలుగా ఇటీవల గత కొద్ది నెలల క్రితం రూపుదిద్దుకున్న రైలు శనివారం నగరానికి చేరుకుంది. సరికొత్త రంగులతో రూపుదిద్దుకుని వచ్చిన ఈ రైలు ప్లాట్‌ఫారం మీద ఆగగానే ప్రయాణికులు ఎగ్జిబిషన్ తరహాలో రైలుబోగీల వద్దకు చేరుకుని చూడసాగారు. ఈ నెల 18వ తేదీన ఆంధ్రభూమి దినపత్రికలో ప్రచురించబడిన ‘త్వరలో రైలుపట్టాలపై అధునాత రైలు’ అనే శీర్షిక పాఠకులకు విదితమే. ఈ రైలుని 20వ తేదీన హౌరా నుంచి యశ్వంత్‌పూర్‌కు వెళ్ళే ట్రైన్ నెంబర్ 02287గా హౌరాలో వీడియో రిమోట్ లింక్ సిస్టిమ్ ద్వారా డార్జిలింగ్ నుంచి కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభాకర్ ప్రభు ప్రారంభించారు. ఈ రైలు 21వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు విజయవాడ రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. ప్రస్తుతం ట్రైల్ రన్‌గా నడుపుతున్న వారంతపు రైలు యశ్వంత్‌పూర్ నుంచి 02888కి బదులు 228888 నెంబర్‌గా 26వ తేదీన తిరిగి బయలుదేరుతుంది. తిరిగి ఈ నెల 31వ తేదీన ట్రైన్ నెంబర్ 22887గా హౌరా నుంచి యశ్వంత్‌పూర్‌కు బయలుదేరుతుంది. అధునాతన పరిజ్ఞానంతో కూడిన ఈ రైలులో మొత్తం 19 బోగీలు ఉండగా మొదట చివర రెండు జనరేటర్ బోగిలు ఉండగా మిగిలిన 20 బోగీలు త్రీటైర్ తరహాలో స్లీపర్ సెంట్రల్ ఎసి బోగిలు రెగ్యులర్ రైలుగా యశ్వంత్‌పూర్ నుంచి 26వ తేదీన బయలుదేరి మార్గమధ్యలో ఇరువైపుల బాలసోరి, బాద్రాక్, కటక్, భువనేశ్వర్, ఖుర్ధారోడ్, బరంపూర్, ఫలాస, శ్రీకాకుళం రోడ్డు, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, రేణిగుంట, కాట్పాడి స్టేషన్‌ల మీదుగా నడవనుంది. ఈ రైలు ట్రైన్ నెంబర్ 22887గా హౌరాలో ప్రతి మంగళవారం జయలుదేరుతుంది. అలాగే తిరుగు ప్రయాణంలో ప్రతి గురువారం యశ్వంత్‌పూర్‌లో ట్రైన్ నెంబర్ 22888గా బయలుదేరుతుంది. అయితే ప్రస్తుతం ట్రైల్ రన్‌గా బయలుదేరిన రైలు ఏ సమయంలో రైల్వేశాఖ ప్రకటించిన రైల్వే స్టేషన్‌లకు చేరుతుంది. అలాగే రైలు ఇరువైపుల బయలుదేరే సమయాలను మరో రెండు మూడు రోజుల్లో ప్రకటించనున్నారు. గతంలో ఉన్న యుపిఏ ప్రభుత్వం హయాంలో అధునాతన రైలు పేరుతో రైలు బోగిలపై బయటవైపు దురంతోని రంగురంగుల హరివిల్లు తరహాలో ప్రచురించిన సంగతి తెలిసిందే. అదే హమ్‌సఫర్ రైలు బోగీలకు ఇరువైపుల లేతనీలం రంగు పూలను పై నుంచి జారవిడిచినట్లుగా వేసిన పెయింటింగ్ ప్లాట్‌ఫారం మీద ఉన్న ప్రయాణికులు చూసి ఆశ్చర్యపోవడమే కాకుండా కొంత మంది ప్రయాణికులు పెయింటింగ్‌లను తాకి మరీ చూశారు.