విజయవాడ

సోలార్ పంప్ సెట్ల వినియోగంలో జిల్లా దేశంలోనే ఫస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 21: సోలార్ పంప్ సెట్ల వినియోగంలో కృష్ణాజిల్లా దేశంలోనే మొదటి స్థానంలో ఉందని జిల్లా కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. కంకిపాడు మండలం, గోసాల గ్రామంలో శనివారం వ్యవసాయ రైతు ధనేకుల నిత్య తన రెండు ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసుకున్న 5 హెచ్‌పి ఎసి సోలార్ సబ్ మెర్సిబుల్ పంప్ సెట్టును జిల్లా కలెక్టర్ బాబు.ఎ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ బాబు.ఎ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో నూతన సాంకేతిక పద్ధతులను వినియోగిస్తూ తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించేలా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతుందన్నారు. దేశ వ్యాప్తంగా 678 జిల్లాల్లో మన జిల్లా మొదటి స్థానంలో ఉందని, మన జిల్లాలో ఈ ఏడాది 1110 సోలార్ పంప్ సెట్లను ఏర్పాటు చేసుకున్నామని కలెక్టర్ తెలిపారు. సౌరశక్తి పంపుల ద్వారా సాగునీరు అందించే కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర నూతన మరియు పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ చేపట్టి పెద్దఎత్తున సోలార్ పంప్ సెట్టును ఏర్పాటు చేసిందన్నారు. 3లక్షల 69వేల 300 రూపాయలు విలువ కలిగిన 5 హెచ్‌పి సోలార్ సబ్ మెర్సిబుల్ పంప్ సెట్టును రైతు వాటాగా రూ.55వేలు చెల్లిస్తే సరిపోతుందని, మిగిలిన మొత్తం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ఈనెల 24న ఢిల్లీలో ఏర్పాటు చేయనున్న కార్యక్రమంలో దేశంలోనే తొలి స్థానంలో ఉన్న మన జిల్లాకు అవార్డు తీసుకోవటం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. మెట్ట ప్రాంతంలో రైతులు పెద్దస్థాయిలో సోలార్ పంప్ సెట్లను వినియోగించుకుని పంట విస్తీర్ణాన్ని పెంచుకోవాలని కలెక్టర్ కోరారు. విద్యుత్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ అనుకూల సోలార్ పంప్ సెట్లు వినియోగించుకుని ప్రభుత్వం అందించే సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రైతులకు విజ్ఞప్తి చేశారు.
పెనమలూరు శాసనసభ్యుడు బోడే ప్రసాద్ మాట్లాడుతూ దేశంలోనే మన కృష్ణాజిల్లా సోలార్ పంప్ సెట్ల వినియోగంలో ప్రథమ స్థానంలో ఉండటం గర్వకారణమని, దీన్ని స్ఫూర్తిగా తీసుకుని మరింతమంది రైతులు ముందుకు రావాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సబ్సిడీలను రైతులు ఉపయోగించుకుని తమ పొలాల్లో వీటిని ఏర్పాటు చేసుకోవాలని శాసనసభ్యులు అన్నారు.
కార్యక్రమంలో ఆదర్శ రైతులు ధనేకుల నిత్య, సిహెచ్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గతంలో డీజిల్ ఇంజన్లతో నీటిని తోడటానికి ఎకరాకు 20వేల రూపాయలు ఖర్చు అయ్యేదని, ప్రస్తుతం సోలార్ పంప్ సెట్ల వలన ఖర్చు ఆదా అవుతుందని వివరించారు. పర్యటనలో డిస్కం ఎస్‌ఇ విజయకుమార్, ఎన్‌ఆర్‌ఇడి సిఎపి జిల్లా మేనేజర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

స్ట్రామ్ వాటర్ ప్రాజెక్టు పనులకు
ప్రణాళికలు సిద్ధం
* పనుల ప్రారంభమే తరువాయి ..
* విఎంసి కమిషనర్ వీరపాండియన్
విజయవాడ (కార్పొరేషన్), జనవరి 21: నగరంలో ప్రతిష్ఠాత్మకమైన స్ట్రామ్ వాటర్ ప్రాజెక్టు పనుల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధమయ్యాయని, ఇక పనులను ప్రారంభించడమే తరువాయని విఎంసి కమిషనర్ వీరపాండియన్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.461కోట్ల స్ట్రామ్ వాటర్ ప్రాజెక్టు పనుల నిర్వహణపై శనివారం కౌన్సిల్‌హాల్ నగర కార్పొరేటర్ల అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నగరాన్ని వర్షం నీటి ముంపు నుంచి విముక్తి కలిగించనున్న ఈపథకం అమలుకు కార్పొరేటర్లు సహకరించాలని కోరారు. స్ట్రామ్ వాటర్ ప్రాజెక్టుకు సంబంధించి నగరాన్ని 7 బెసిన్లుగా విభజించడం జరిగిందని, వీటిలో 3,5 బేసిన్లకు సంబంధించిన డిజైన్లు పూర్తి చేసిన తరువాత ఆయా ప్రాంతాల కార్పొరేటర్లకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రస్తుతం ఉన్న డ్రైయిన్లకు ఎటువంటి నష్టం కలుగకుండా ఈ నిర్మాణాలు జరుగుతాయన్నారు. నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ మాట్లాడుతూ స్ట్రామ్ వాటర్ ప్రాజెక్టుపై ఎటువంటి సందేహాలున్నా సంబంధిత అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలన్నారు ఈసమావేశంలో నగర డెప్యూటీ మేయర్ గోగుల రమణారావు, సిఇ ఆర్ అంకయ్య, పబ్లిక్ హెల్త్ ఎస్‌ఇ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.