విజయవాడ

ప్రతి కచ్చేరిని తొలి కచ్చేరిగా భావించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కల్చరల్), జనవరి 22: కళాకారుడు ప్రతి కచ్చేరీని తొలి కచ్చేరీగా భావిస్తూ ఎదగాలని పద్మభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అన్నారు. మయూర్ ఆర్కెస్ట్రా 37వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం సాయంత్రం తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరిగాయి. ఈ వేడుకలలో ఆయనను ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కళాకారునికి సాధన అవసరమని సంగీత సాహిత్యాల పట్ల అవగాహన పెంచుకుని సాహిత్యంలోని భావాన్ని తాను తదాత్మ్యత చెందుతూ పాడగలిగితే పాటలోని భావాన్ని శ్రోతలకు అందించగలమని అన్నారు. ప్రారంభంలో మయూర్ ఆర్కెస్ట్రా సమర్పణలో బాలు గీతాల సుమమాలగా జరిగిన సినీ సంగీత విభావరి నుద్దేశించి నా పాటలు కాదని, మన పాటలని , తాను అందరిలో ఒకడినని, మీ వాడినని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ఎంసి దాస్ తదితరులు పాల్గొన్నారు. సంస్థ వ్యవస్థాపకుడు మహమ్మద్ ఖాజా పర్యవేక్షించగా సినీ సంగీత విభావరిలో గాయనీ గాయకులుగా విజయలక్ష్మి, వినోద్ బాబు, రసూల్ బాబు, అనిల్ కుమారి, మహమ్మద్ ఖాజా, కీర్తన, సాయి ప్రజ్ఞ, సుస్మితలు పాడారు.