విజయవాడ

సిగరెట్లపై వివక్షాపూరిత పన్నుల విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 23: పొగాకు పరంగా ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఉత్పత్తిదారులు, 3వ అతిపెద్ద ఎగుమతిదారులు ఇండియా. కాగా ప్రతి సంవత్సరం దాదాపు 6వేల కోట్ల రూపాయ ల విదేశీ మారకద్రవ్యం దీని ద్వారానే లభిస్తున్నది. అత్యధిక స్థాయిలో 4.6 కోట్ల మంది రైతులు, వ్యవసాయ కూలీ లు, రిటైలర్లు, బీడీ వర్కర్లు మొదలైన వారికి జీవనోపాధిని అందిస్తుంది. అయితే కొనే్నళ్లుగా అధిక, వివక్షపూరిత పన్నుల కారణంగా వీరి జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతుంది.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో వాణిజ్య పంటలను పండిస్తున్న లక్షలాది మంది రైతులు, రైతు కూలీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న లాభాపేక్షలేని స్వచ్ఛంద సంస్థ ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ఫార్మర్ అసోసియేషన్స్ (ఫైఫా) సోమవారం కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీని కలిసి భారత ప్రభుత్వానికి చట్టబద్ధమైన సిగిరెట్ పరిశ్రమపై అధిక పన్నులను సవరించడంతో పాటుగా వ్యవసాయ ధరల్లో స్థిరత్వం తీసుకురావడంలో సహాయపడాల్సిందిగా అభ్యర్థించింది.
ఈ అభ్యర్థనను పలు మంత్రిత్వశాఖలకు సైతం సమర్పించారు. వీటిలో పీఎంఓ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ, వ్యవసాయ మంత్రిత్వశాఖ, వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ, కార్మిక మంత్రిత్వశాఖ మొదలైనవి వున్నాయి.
ఈ సందర్భంగా ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ఫార్మర్ అసోసియేషన్స్ (ఫైఫా) జనరల్ సెక్రటరీ మురళీబాబు మాట్లాడుతూ దేశీయ తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గిపోవడం పట్ల తామంతా చాలా ఆందోళనగా వున్నామన్నారు. భారతీయ పొగాకు ఎగుమతులు సైతం అదే బాటలో వుండటంతో రైతుల ఆదాయంలో 22 శాతం తరుగుదల కనిపిస్తుందన్నారు. నియంత్రణలు అధికం కావడంతో భయానక వాతావరణం సృష్టించబడటంతో పాటుగా ఎఫ్‌సీవీ టుబాకో రైతుల జీవితాలపై తీవ్ర ప్రభావం పడింది. స్వాతంత్య్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా 22 మంది ఎఫ్‌సివి రైతులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, కర్నాటకలలో ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. మొత్తంమీద 2012-13 నుంచి 118 శాతం పన్నులు పెంచారు. ఈ ఫలితంగానే చట్టబద్ధమైన సిగిరెట్ వాల్యూమ్స్‌లో 22 శాతం తరుగుదల కన్పించింది. స్మగుల్డ్ సిగిరెట్లు భారీ స్థాయిలో పట్టుబడుతుండటం ఈ విషయాన్ని నిర్థారిస్తున్నాయి. భారతీయ సిగిరెట్ పరిశ్రమలో 1/5 వంతు ఇప్పు అక్రమ సిగిరెట్ వాణిజ్యం ఆక్రమించడంతో పాటుగా ప్రపంచంలో అతి పెద్ద నాలుగవ, వేగంగా వృద్ధి చెందుతున్న అక్రమ మార్కెట్‌గా నిలుస్తుంది. ఈ ఫలితంగానే సాలీనా 9వేల కోట్ల రూపాయల రెవెన్యూ నష్టపోవడమే కాకుండా ఇది మరింత పెరుగుతుంది.
ఇప్పటికే చట్టబద్ధమైన పొగాకు పరిశ్రమపై అధికంగా వున్న పన్నులను మరింత పెంచితే, అక్రమ పొగాకు వినియోగం వైపు వినియోగదారులను అది మళ్లించడంతో పాటుగా అసంఘటిత రంగంలోని పొగాకు వినియోగాన్ని కూడా గణనీయంగా పెంచనుంది. ఇది రెవెన్యూ కలెక్షన్‌పై అతి తీవ్రమైన ప్రభావం చూపడంతో పాటుగా పొగా కు నియంత్రణ పరంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై తీవ్ర ప్రభావం చూపుతూనే రైతుల జీవనోపాధిపై కూడా ప్రభావం చూపుతుంది.
ఇండియా తరహాలో ప్రపంచంలో మరే దేశంలోనూ జీవనోపాధి కోసం ఎక్కువ మంది పొగాకు పంటపై ఆధారపడుతున్న దాఖలాలు లేవు. ఎఫ్‌సివీ పొగాకు రైతుల ప్రస్తుత ఆందోళనతో పాటుగా ఈ రంగంపై ఆధారపడిన ఇతర వర్గాల జీవనోపాధిని కూడా దృష్టిలో పెట్టుకుని భారతదేశంలోని విధాన నిర్ణేతలు దేశంలో సిగిరెట్లపై అధికంగా పన్నులు, నిబంధనలు, ప్రజల జీవనోపాధి నడుమ సమతుల్యతను నిర్వహించాల్సి వుంది. పొగాకు పంట సామాజిక, ఆర్థిక ప్రాధాన్యత మరియు అది సృష్టించే ఉపాధి సామర్ధ్యం దృష్టిలో వుంచుకోవాలి. పొగాకు సాగుపై వేసే పన్నులు, నియంత్రిత విధానాల రూపకల్పన సమయంలో ఈ అంశాలను సైతం పరిగణలోకి తీసుకోవాల్సి వుంది.

లంచం తీసుకుంటూ ఏసిబికి
దొరికిన విఆర్‌ఓ
విజయవాడ (క్రైం), జనవరి 23: లంచం తీసుకుంటూ కంకిపాడు విఆర్‌ఓ ఏసిబి అధికారులకు దొరికిపోయాడు. ఏసిబి డిఎస్పీ వి గోపాలకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణాజిల్లా కంకిపాడు మండలం కుందేరు గ్రామానికి చెందిన దాసరి బాలప్రకాష్ అనే వ్యక్తి తన ఆధార్ కార్డు బ్లాక్ కావడంతో పునరుద్ధరించుకునేందుకు అధార్ అధికారిక కేంద్ర కార్యాలయాన్ని సంప్రదించాడు. ఇక్క డి అధికారులు ఆధార్‌లోని కొన్ని తప్పులను సరి చేసి వాటిని విలేజ్ రెవి న్యూ అధికారిచే ధృవీకరించి సంతకం చేయించుకు రావాల్సిందిగా సూచించారు. దీంతో కుందూరు విలేజ్ రెవె న్యూ అధికారి చౌటపల్లి శ్రీను (38)ని సంప్రదించాడు. ఇందుకుగాను ధృవీకరించి సంతకం చేయాలంటే నాలుగువేలు లంచం ఇవ్వాలని డిమాండు చేయడంతో ఫిర్యాది అవినీతి నిరోధక శాఖాధికారులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన అధికారులు సోమవారం గ్రామంలోని విఆర్‌ఓ కా ర్యాలయంలో దాసరి బాలప్రకాష్ నుంచి లంచం తీసుకుంటున్న విఆర్‌ఓ శ్రీనును వలపన్ని పట్టుకున్నారు. వెంట్రప్రగడకు చెందిన చౌటపల్లి శ్రీను 1998లో ఉద్యోగంలో చేరాడు. విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్‌గా పని చేస్తూ 20 14లో పదోన్నతిపై విఆర్‌ఓ అయ్యాడు. కాగా.. లంచం తీసుకుంటూ దొరికిపోయిన విఆర్‌ఓను అరెస్టు చేసినట్లు డిఎస్పీ తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తున్నామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.