విజయవాడ

25న రాష్టవ్య్రాప్తంగా కాగడా ప్రదర్శనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 23: విభజన హామీల అమలుతోపాటు, ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర ప్రభుత్వ ద్రోహాన్ని నిరసిస్తూ ఈనెల 25న రాష్టవ్య్రాప్తంగా సిపిఐ నిర్వహిస్తున్న కాగడా ప్రదర్శనల్లో ప్రజలు వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. స్థానిక దాసరి భవన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యు లు పి.హరినాథరెడ్డితో కల్సి మాట్లాడారు. ప్రత్యేక హోదాపై రాష్ట్రంలో తొలి నుండి సిపిఐ సుదీర్ఘ పోరాటం నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. దీనిపై గత ఏడాది ఆగస్టు 11న తొలుత రాష్ట్ర బంద్ చేపట్టింది కూడా తామేనన్నారు. ప్రస్తుతం తమిళనాడు జల్లికట్టు ఉద్యమం స్ఫూర్తితో రాష్ట్ర ప్రజలు కూడా సామాజిక మీడియాల్లో ప్రత్యేక హోదాపై స్పందించడం శుభపరిణామమన్నారు. విభజన అంశాల అమలు, ప్రత్యేక హోదా సాధన కోసం ఎవరు ఉద్యమించినా తాము స్వాగతిస్తామని, సహకరిస్తామని చెప్పారు. ఈనెల 26న వైజాగ్ ఆర్కే బీచ్‌లో నిర్వహించే ఆందోళనకు తాము సంఘీభావం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరాన్ని కేంద్ర ప్రభుత్వమే పూర్తిస్థాయిలో నిధులు వెచ్చించి నిర్మించాల్సి ఉండగా, దానికోసమే ప్రత్యేక హోదాను పక్కనబెట్టి ప్యాకేజీకి అంగీకరించాల్సి వచ్చిందని చంద్రబాబు చెప్పడం ప్రజలను వంచించడమేనన్నారు. విద్యా, వైద్య సంస్థలు, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ, విశాఖ రైల్వేజోన్, వెనుకబడ్డ రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీ, రెవెన్యూ లోటు, రాజధాని నిర్మాణం, ప్రత్యేక హోదా తదితర విభజన అంశాల్లో ఏ ఒక్కటే కేంద్రం సక్రమంగా అమలు చేయలేదన్నారు. ఈ నేపధ్యంలో కేంద్ర వైఖరిని నిరసిస్తూ ఈనెల 25న రాష్టవ్య్రాప్తంగా కాగడా ప్రదర్శనలు పెద్దఎత్తున చేపడుతున్నట్లు రామకృష్ణ తెలిపారు. అలాగే 5కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే పోలవరం ప్రాజెక్టు కోసం త్యాగం చేస్తున్న నిర్వాసితుల సమస్యల విషయంలో సిఎం చంద్రబాబు నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వంశధార ప్రాజెక్టు విషయంలో కూడా కార్మికమంత్రి అచ్చెన్నాయుడు సమస్య పరిష్కారానికి చర్యలు గైకొనకుండా రైతులను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారు. బందరు పోర్టుకు సైతం 4వేల ఎకరాలు అవసరం కాగా లక్ష ఎకరాలకు పైబడి సేకరించి పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టేందుకు యత్నిస్తున్నారు. ఇప్పటికైనా భూదాహానికి స్వస్తి పలికి ఈ ధోరణి మార్చుకోకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదన్నారు. పోలవరం, వంశధార ప్రాజెక్టుల నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలి. ప్రత్యామ్నాయ భూములు కేటాయించాలి. వారి ఇతర సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో మార్చి 2వ వారంలో వామపక్షాల ఆధ్వర్యాన ఢిల్లీలో పార్లమెంటు ఎదుట ఆందోళన చేపట్టాల్సి వస్తుందని రామకృష్ణ హెచ్చరించారు.

ఉత్సాహంగా ఐటా టెన్నిస్ టోర్నీ ప్రారంభం
విజయవాడ (స్పోర్ట్స్), జనవరి 23: కృష్ణాజిల్లా టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పోరేషన్ స్టేడియంలో సోమవారం ఎస్‌వి రామయ్య మెమోరియల్ ఐటా టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్‌ను ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ పిఆర్ మోహన్ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు. ఈ టోర్నమెంట్‌లో పలు ప్రాంతాల నుండి క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంఘ కార్యదర్శి కె.రాధాకృష్ణమూర్తి, ఉపాధ్యక్షులు డా.రామకృష్ణ, తెలంగాణా టెన్నిస్ అసోసియేషన్ కార్యదర్శి అశోక్‌రావు, మాజీ మేయర్ డాక్టర్ జంధ్యాల శంకర్ పాల్గొన్నారు.