విజయవాడ

చురుగ్గా గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జనవరి 23: ఈనెల 26వ తేదీన నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భారత గణతంత్ర దినోత్సవం ఏర్పాట్లను నగర పోలీసు కమిషనర్ దామోదర్ గౌతం సవాంగ్ సోమవారం పర్యవేక్షించారు. స్టేడియంకు వచ్చిన ఆయన ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లు, పనుల గూర్చి ఆరా తీశారు. కార్యక్రమానికి హాజరయ్యే గవర్నర్, ముఖ్యమంత్రితో పాటు ముఖ్య అతిధులు, ప్రముఖుల భద్రతపై అధికారులతో సమీక్షించారు. మరోవైపు వాహనాల పార్కింగ్ ప్రదేశాలకు సంబంధించి ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. శకటాల ప్రదర్శన, విఐపిలు స్టేడియం లోపలకు వచ్చి వెళ్ళే మార్గం, ఆదేవిధంగా సామాన్య ప్రజలకు నిర్ధేశించిన మార్గం, కూర్చొనే స్థలాలకు సంబంధించి పలు సూచనలు చేశారు. ప్రధానంగా భద్రత, బందోబస్తుకు సంబంధించి తగిన పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్టేడియంలో సీపి సమావేశానికి హాజరైన వారిలో జాయింట్ పోలీసు కమిషనర్ హరికుమార్, డిసిపిలు అశోక్‌కుమార్, కోయ ప్రవీణ్, ట్రాఫిక్ డిసిపి కాంతి రానా టాటా తదితరులు పాల్గొన్నారు.
రిపబ్లిక్ డే ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈనెల 26వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రిపబ్లిక్ డే దినోత్సవ వేడుకల ఏర్పాట్లను సోమవారం జిల్లా కలెక్టర్ బాబు ఏ పరిశీలించారు. వివిధ విద్యాసంస్థల నుంచి వచ్చే విద్యార్థులకు సూచించిన సమయానికే లోనికి వచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారిని ఆదేశించారు. అదేవిధంగా నగర పాలక సంస్థ చేపట్టాల్సిన కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ జి వీరపాండ్యన్‌ను కలెక్టర్ సూచించారు. స్టేడియంలో తయారవుతున్న శకటాల పనులను సమాచార శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.