విజయవాడ

పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జనవరి 26: నగర పోలీసు కమిషనర్ కార్యాలయంలో 68వ గణతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. కార్యాలయంలో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని అడ్మిన్ డిసిపి జివి అశోక్‌కుమార్ ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా ఆయన కమిషనరేట్ అధికారులు, సిబ్బందినుద్ధేశించి మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంగా గణతంత్ర వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. దేశసమగ్రత, జాతీయ భావాన్ని పెంపొందించుకుని ప్రతి ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తితో పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచి ఏసిపి ఎస్ రమేష్‌బాబు, సిసిఆర్‌బి ఏసిపి వెంకటరత్నం, పరిపాలనా విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

గణతంత్ర వేడుకల్లో కనువిందు చేసిన పరేడ్
విజయవాడ (క్రైం), జనవరి 26: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన గణతంత్ర దినోత్సవంలో ప్రదర్శించిన ప్రభుత్వ శాఖల శకటాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అంతకుముందు నిర్వహించిన పరేడ్‌లో వివిధ విభాగాల నుంచి సెల్యూట్ చేసిన కంటింజెంట్ బృందాల విన్యాసాలు అబ్బురపరిచాయి. పరేడ్‌కు సంబంధించి ఇండియన్ ఆర్మీ మొదటి స్థానంలో నిలిచింది. ఇక రాష్ట్ర ప్రభుత్వ శాఖ శకటాల్లో అటవీశాఖకు ప్రధమ స్థానం లభించింది. అదేవిధంగా ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఉత్తమ సేవలు కనపరిచినందుకు ఎంపికైన ఏపిఎస్పీడిసిఎల్ మొదటి ఉత్తమ సేవా సర్ట్ఫికెట్ అందుకుంది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 68వ గణతంత్ర దినోత్సవ వేడుకలు వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రారంభానికి తొలుత గ్రౌండ్‌కు వద్దకు రాష్ట్ర డిజిపి నండూరి సాంబశివరావు చేరుకుని వేదిక నుంచి సెల్యూట్ చేశారు. ఆతర్వాత ఇక్కడకు చేరుకున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్‌తో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు ఘనస్వాగతం పలికారు. కొద్దిసేపటికి చేరుకున్న గవర్నర్ నరసింహన్‌కు ముఖ్యమంత్రితో సహా డిజిపి, చీఫ్ సెక్రటరీ, ప్రభుత్వ యంత్రాంగం సెల్యూట్ చేసి స్వాగతం పలకగా.. గవర్నర్, డిజిపి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వేదికపై అశీనులయ్యారు. ముఖ్య అతిధికి పరేడ్ సెల్యూట్ చేయడం ద్వారా కార్యక్రమం ప్రారంభమైంది. ప్రత్యేక వాహనంలో ముందుకు సాగుతూ గవర్నర్ సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆతర్వాత మొదటిగా ఇండియన్ ఆర్మీతో ప్రదర్శనతో పరేడ్ విన్యాసాలు ప్రారంభమయ్యాయి. సెంట్రల్ రిజర్వు పోలీసు దళం, చత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి చెందిన ప్రత్యేక పోలీసు దళం, ఆంధ్రప్రదేశ్ నుంచి కాకినాడు మూడో బెటాలియన్, ఏపి ప్రొహిబిహన్ అండ్ ఎక్సైజ్ శాఖ, ఎన్‌సిసి బాలికల విభాగం, ఎన్‌సిసి బాలుర బృందం, భారత స్కౌట్స్ బృందం, తూర్పుగోదావరి జిల్లా నుంచి ఏపి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ బృందం, చివరికి యూత్ రెడ్‌క్రాస్ బృందాలు పరేడ్‌లో పాల్గొని డ్రిల్ నిర్వహించాయి. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించి శకటాల సెషన్స్ ప్రారంభమైంది. తొలిగా అగ్నిమాపక శాఖ, ఆతర్వాత ఎన్‌డిఆర్‌ఎఫ్, వ్యవసాయ శాఖ, పౌర సంబంధాల శాఖ, ఏపి సిఆర్‌డిఏ, సర్వశిక్ష అభియాన్, అటవీశాఖ, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ, ప్రణాళికశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, మహిళా సాధికారిక సంస్థ, సాంఘిక సంక్షేమశాఖ, పర్యాటక శాఖ, జలవనరులశాఖ, చివరికి ఆరోగ్యశాఖలకు సంబంధించిన శకటాల ప్రదర్శన అబ్బురపరిచాయి. వేడుకల్లో ఇండియన్ ఆర్మీ, కర్నూలు నుంచి రెండో ఏపిఎస్‌పి బెటాలియన్, కాకినాడ నుంచి మూడో ఏపిఎస్‌పి బెటాలియన్, విజయనగరం నుంచి ఐదో ఏపిఎస్‌పి బెటాలియన్, మంగళగిరి నుంచి ఆరో ఏపిఎస్‌పి బెటాలియన్, నెల్లూరు జిల్లా నుంచి 9వ ఏపిఎస్‌పి బెటాలియన్, వైఎస్సార్ కడప జిల్లా నుంచి 11వ ఏపిఎస్‌పి బెటాలియన్, అనంతపురం నుంచి 14వ ఏపిఎస్‌పి బెటాలియన్, విజయవాడకు చెందిన సిటి ఆర్మ్‌డ్ రిజర్వు దళం, స్పెషల్ ఆర్మ్‌డ్ రిజర్వు పోలీసు లైన్స్ విభాగాలు పైప్, బ్రాస్ బ్యాండ్ అటెండెన్స్ నిర్వహణ అద్భుతంగా కొనసాగింది. సాయుధ దళాల పరేడ్ విన్యాసాలు, ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన అనంతరం విజేతలకు గవర్నర్ చేతుల మీదుగా మెమొంటోలు, సర్ట్ఫికెట్లు అందచేశారు. మొదటి స్థానం అటవీశాఖ శకటానికి లభించగా, ఉత్తమ ద్వితీయ స్థానం ఏపి సిఆర్‌డిఏ, తృతీయ స్థానం ఆరోగ్యశాఖ అందుకుంది. ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఉత్తమ సేవలందించిన ప్రభుత్వశాఖల్లో ఏపిఎస్పీడిసిఎల్ చైర్మన్ హెచ్‌వై దొర తొలి ఉత్తమ సర్ట్ఫికెట్ అందుకున్నారు. రెండోస్థానంలో ఎన్టీఆర్ జలసిరి నుంచి కెఎస్ వరప్రసాద్, చిత్తూరు జిల్లా వాటర్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్ వేణుగోపాలరెడ్డి, విజయవాడ నుంచి ఆర్మ్‌డ్ రిజర్వు ఎస్‌ఐ ఎన్ శ్రీనివాసరావులు వరుసగా గవర్నర్ నుంచి సర్ట్ఫికెట్లు అందుకున్నారు. ఎన్‌సిసి విభాగంలో బాలుర పరేడ్ మొదటి బహుమతి అందుకోగా, రెండో బహుమతి ఎన్‌సిసి బాలికల విభాగం అందుకుంది. పరేడ్ కమాండర్‌గా గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్ అమిత్ బర్దార్ వ్యవహరించగా నగర పోలీసు కమిషనర్ దామోదర్ గౌతం సవాంగ్‌తోపాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.