విజయవాడ

మానసికోల్లాసానికి ఈత దోహదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతబస్తీ, జనవరి 29: ప్రతి వ్యక్తి ఈతను అలవర్చుకోవాలని ఈత శారీరకంగా ఎంతో ఉపయోగపడుతుందని మానసిక ఉల్లాసాన్ని అందిస్తుందని కృష్ణాజిల్లా కలెక్టర్ బాబు ఎ అన్నారు. కృష్ణానదిలో ఆదివారం ఉదయం ఆక్వాడెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ స్థాయి 18వ కృష్ణా రివర్ క్రాస్ ఈతపోటీలను ఆయన ప్రారంభించారు. దుర్గాఘాట్ నుండి ఈ ఈతల పోటీలు 1.5 కిలో మీటర్ల మేర జరగ్గా ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రకాశం బ్యారేజీ నుండి ఫెర్రి వరకు 14 కి.లో మీటర్ల మేర నది పరివాహక ప్రాంతం ఆధునికీకరించడానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు. నది మనచెంతన ఉండడం వల్ల ప్రతి ఒక్కరూ ఈతకొట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన ఆకాంక్షించారు. దేశ వ్యాప్తంగా ఈ పోటీకి తరలివచ్చిన పిల్లలను వారి తల్లిదండ్రులను అభినందించారు. నవ్యాంధ్ర రాజధానిలో ఇలాంటి పోటీలు నిర్వహించిన ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గాన్ని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, నరసాపురం ఎంపి గోకరాజు గంగరాజు మాట్లాడుతూ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు వేలాది మందికి ఈత నేర్పించామని ముఖ్యంగా విద్యార్థులు ఈతను నేర్చుకోవాలన్నారు. విద్యార్థులు సరదాగా సముద్రంలో, నదుల్లో, వాగుల్లో, కాలువల్లో ఈతకు వెళ్లి మృత్యువాతపడిన దుర్ఘటనలు ఎన్నో ఉన్నాయని అందుకే అందరూ ఈత నేర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ రోజు ఈతల పోటీల్లో 71 సంవత్సరాల విశ్రాంత అధ్యాపకురాలు అమలాపురపు వెంకట సుబ్బలక్ష్మి పాల్గొని ఈవెంట్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నారు. ఈతల పోటీల్లో పాల్గొన్న విజేతలకు నిర్వాహకులు తమ కార్యాలయం వద్ద బహుమతులు అందించారు.
ఈత పోటీల విజేతలు వీరే
ఐదేళ్ల నుండి 15 సంవత్సరాల కేటగిరిలో ప్రథమ బహుమతి సిహెచ్ అభిలాష్‌కి టోర్నమెంట్ కప్పుతోపాటు రెండు గ్రాముల బంగారు నాణెం, ద్వితీయ స్థానంలో నిలిచిన పి సుజన్‌చౌదరికి టోర్నికప్‌తోపాటు మరో బహుమతి, తృతీయ స్థానంలో ఇద్దరు వి ఆఫిస్, ఎం తీర్దుసామదేవ్‌లు రాగా టోర్నికప్పులు అందించారు. 16 నుండి 30 సంవత్సరాల కేటగిరిలో ప్రథమ స్థానం ఎం లోహిత్, ద్వితీయ స్థానం వి రాజేష్, తృతీయ స్థానం ఎం ధనుష్‌రెడ్డి, 31 నుండి 45 సంవత్సరాల కేటగిరిలో ప్రథమ స్థానం ఇంటెలిజన్స్ సిఐ పి శివగణేష్ ప్రథమ స్థానం కైవశం చేసుకున్నారు. ద్వితీయ, తృతీయ స్థానాల్లో మంజునాథ్, సుక్‌వీర్‌సింగ్‌లు దక్కించుకున్నారు. 45 నుండి 60 సంవత్సరాల కేటగిరిలో ప్రథమ స్థానం వెంకట్రావు, ద్వితీయ, తృతీయ స్థానాల్లో శివశేఖర్, ఎన్ రామారావులు గెలుపొందారు. 61 సంవత్సరాల పైబడిన వారు ప్రథమ స్థానం ఏ కృష్ణారెడ్డి, ద్వితీయ స్థానం కె రామిరెడ్డి, తృతీయ స్థానం బి లక్ష్మణరావులు పొందారు. వీరందరికీ మొదటి కేటగిరిలో ఇచ్చిన విధంగానే బహుమతులు అందించారు. ఇదిలా ఉండగా బాలికల కోసం ప్రత్యేక విభాగం పోటీలు నిర్వహించారు. 5 నుండి 15 సంవత్సరాల గ్రూపులో ప్రథమ స్థానం సిహెచ్ జ్ఞానేశ్వరి, ద్వితీయ స్థానం ఆర్ హిమబిందు, తృతీయ స్థానం హుస్నాజైబ్‌లు పొందారు. విజేతలందరికీ అసోసియేషన్ పాలకవర్గ సభ్యుల చేతుల మీదుగా బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు కెఎస్ రామచంద్రరావు, కార్యదర్శి లింగిపిల్లి రామకృష్ణ, కోశాధికారి తెలనాకుల అనంత్, ఈవెంట్ కన్వీనర్ డాక్టర్ ఎం ఓబుల్‌రెడ్డి పాల్గొన్నారు.

హోదా పేరెత్తితే ఉలుకెందుకు?
బెంజిసర్కిల్, జనవరి 29: ఆంధ్రుల హక్కు ప్రత్యేక హోదా నినాదం ఎత్తితే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎందుకంత ఉలుకుపాటని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యన్నారయణ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా నినాదం వచ్చిన ప్రతీ సారి బాబు అండ్ టీం విపక్షాలపై విరుచుకుపడుతున్నారని విమర్శించారు. గత సిఎం హయాంలో విశాఖకు బాబు చేసింది శూన్యమన్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు పాల్పతున్న నేతలు నేడు తెదేపాలోనే ఉన్నారని, వంగవీటి రంగాను హత్యచేసింది నేడు తెదేపాలో ఉన్నావారేనని ఆయన స్పష్టంచేశారు. ఆదివారం నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. విశాఖలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సు వారి వ్యాపార సంబందీకుల ఆత్మీయ కలయికలా ఉందన్నారు. సదస్సుతో రాష్ట్ర ప్రజలకు ఒరిగేది ఎమీలేదన్నారు. ప్రతిపక్షాలను రాక్షసులతో పోల్చుతున్న బాబు, రాష్ట్ర ప్రజలను పట్టిపీడిస్తున్న అసలైన రాక్షసుడు బాబేనన్నారు. ప్రత్యేక హోదా కోసం ప్రజలు రోడ్డుపైకి వచ్చి శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సమయంలోవారిపై కక్షకట్టి వేధిస్తున్నట్లు తెలిపారు. జగన్ విశాఖలో కొవ్వోత్తుల ప్రదర్శనకు వస్తే విశాఖను తగలబేట్టాలని వచ్చాడని చెప్పడం దారుణమన్నారు. ప్రతిపక్షాలు నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తున్న తరుణంలో వారిని రాక్షసుల్లా వర్ణించడం తగదన్నారు. బాబు సొంత జిల్లా చిత్తూరులో 14 నియోజకవర్గాలకు గాను 8 స్థానాలను వైకాపా కైవసం చేసుకున్న సంగతి బాబు మరిచి విజయలక్ష్మిపై విమర్శలు చేస్తున్నట్లు తెలిపారు. బాబు పాలనపై విసుగు చెందుతున్న ప్రజలు త్వరలోనే బుద్ది చెబుతారని వివరించారు. ఈవిలేకర్ల సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వెల్లంపల్లి శ్రీనివాస్, నాయకులు బొప్పన భవకుమార్, అనీల్‌కుమార్, అంజిరెడ్డి, మనోహరనాయుడు, దుర్గరావులు ఉన్నారు.