విజయవాడ

రైల్వే స్టేషన్‌లో జిఎం తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (రైల్వేస్టేషన్), జనవరి 30: దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ సోమవారం నగరంలోని రైల్వే స్టేషన్‌లో ఒకటి, ఆరు ప్లాట్‌ఫారాలను తనిఖీ చేశారు. ఒకటో నెంబర్ ప్లాట్‌ఫారంపై తూర్పు ప్రధాన ద్వారానికి దగ్గరలో జ్యూస్‌స్టాల్ ఉన్న వద్ద వాటర్ బాటిళ్లతో పాటు లస్సీ కప్‌లను పరిశీలించారు. వాటిపై ఉన్న ముద్రణలను చూసి ఏరోజుకు ఆరోజు స్టాక్‌ని ఏర్పాటు చేసుకుంటారా? ఎంతకు అమ్ముతున్నారని స్టాల్‌లోని హాకర్లను అడిగి తెలుసుకున్నారు. సాధారణ ప్రయాణికులు వేచివుండే ప్రదేశంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ఇటీవల అధునాతనంగా నూతన భవన సముదాయంలో ఏర్పాటు చేసిన రూట్ రిలే ఇంటర్ లాకింగ్ (ఆర్‌ఆర్‌ఐ సిస్టం)కు చెందిన ఫొటోల గురించి డిఆర్‌ఎం అశోక్‌కుమార్ యాదవ్‌కు వివరించారు. ఆరో నెంబర్ ప్లాట్‌ఫారం మీదకు వెళ్లగా అక్కడున్న రైలు గార్డు, డ్రైవర్ (లోకోపైలట్), అసిస్టెంట్ డ్రైవర్లకు చెందిన క్రూ కంట్రోల్ కార్యాలయాన్ని సందర్శించారు. డైవర్, అసిస్టెంట్ డ్రైవర్, గార్డుగా డ్యూటీలు ఎక్కుతున్న సిబ్బంది మద్యం తాగి ఉన్నారా, లేదా అనే విషయాన్ని పసిగట్టే ఎలక్ట్రానిక్ మిషన్ పనిచేసే విధానాన్ని క్రూ చీఫ్ కంట్రోలర్ ఆయనకు చూపించారు. అనంతరం ఆయన పక్కనే డ్రైవర్, గార్డుల కోసం ఏర్పాటు చేసిన లాబీలో రికార్డులను పరిశీలించారు. అనంతరం సెల్ కిచెన్‌లో పార్శిల్ చేసి ఉన్న వెజిటబుల్ బిర్యానీ ప్యాకెట్లను పరిశీలించారు. అదనపు డివిజనల్ మేనేజర్ వేణుగోపాలరావు, సీనియర్ డిసిఎం షఫాలీ, సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎస్‌ఆర్ గాంధీ, స్టేషన్ గజిటెడ్ మేనేజర్ సురేష్, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.