విజయవాడ

వేసవిలో నీటి ఎద్దడి రానివ్వొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 2: రానున్న ఐదారు మాసాల్లో పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని జలవనుల శాఖామంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అధికారులను ఆదేశించారు. కాల్వల మీద జరిగే పనులను పర్యవేక్షించాలని ఇంజనీరింగ్ అధికారులు, డిసిలు, ప్రాజెక్టు కమిటి చైర్మన్‌కు సూచించారు. ఇరిగేషన్ క్యాంపు కార్యాలయంలో గురువారం జరిగిన తూర్పు, పశ్చిమ డెల్టా సాగునీటి వినియోగదారుల సంఘాల అధ్యక్షులు, రైతు సోదరుల సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఖరీఫ్, రబీ సీజన్‌లో సకాలంలో నీళ్లు అందించేందుకు కాల్వల మరమ్మతులు చేపట్టాలన్నారు. దీనివల్ల కాలువ చివరి ప్రాంతాల భూములకు కూడా నీళ్లు ఇవ్వగలుగుతామని చెప్పారు. ఈ ఖరీఫ్, రబీలో పట్టిసీమ నుంచి గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాకు 55టిఎంసిలు అందించడం వల్ల దిగుబడి బాగా పెరిగిందని రైతులు ముఖ్యమంత్రితో స్వయంగా చెప్పారన్నారు. ఒక్కో ఎకరాకు 45 నుంచి 50 బస్తాల దిగుబడి వచ్చినట్లు కృష్ణా, పశ్చిమగోదావరి ఆయుకట్టు రైతులు తెలిపినందున రాష్ట్రంలో మిగిలిన చోట్ల కూడా పెండింగ్ ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారన్నారు. కాలువలో పెరిగిపోయిన నాచు, గుర్రపు డెక్కలను తొలగిస్తే రైతుకు సకాలంలో పంటలు పండించేందుకు వీలు ఏర్పడుతుందని, దాని వల్ల పంట దిగుబడి పెరిగే అవకాశం ఉందన్నారు. ముఖ్యమంత్రి దూరదృష్టితో గోదావరి నీటిని తీసుకురావడం వల్ల పంట దిగుబడి పెరిగిందన్నారు. ఫిబ్రవరి నుంచి జూన్ నెల వరకు అధికారులు కాలువ గట్లకు మరమ్మతులు పెండింగ్ పనులు పూర్తి చేస్తే రైతులను నీటి ఎద్దడి నుంచి రక్షించవచ్చన్నారు. కృష్ణాజిల్లా పశ్చిమ ప్రాంత రైతులకు నీటి సౌకర్యం కల్పించేందుకు చింతలపూడి ఎత్తిపోతల పథకం తీసుకువస్తున్నారని, దీనివల్ల కంచకచర్ల నుంచి గోపాలపురం (ఏలూరు) వరకు ఏడు లక్షల ఎకరాలకు ఏడు నియోజకవర్గాల్లో నీటిని అందిస్తామన్నారు. విజయవాడలో ఉన్న కెఇ డివిజన్ అధికారులు, సిబ్బంది గుడివాడకు షిఫ్ట్ కావాలని దీని వల్ల పనుల పర్యవేక్షణ మెరుగై రైతులకు అందుబాటులో ఉండేందుకు ఆస్కారం ఉందన్నారు. సమీక్ష సమావేశంలో కాకులపాడు గ్రామం నుంచి రైతులు శ్యామ్‌బాబు, సుంకర వెంకట బుచ్చిబాబు, అవనిగడ్డ, పెదపారుపూడి, దోసపాడు, గోల్వేపల్లి తదితర ఫ్రాంతాల నుంచి రైతులు, ఈస్ట్, వెస్ట్ డెల్టా సాగునీటి వినియోగదారుల సంఘాల చైర్మన్లు, డిసి సంఘాల ప్రతినిధులు, ఏఈలు, డిఈలు, ఇరిగేషన్‌శాఖ సిఇ సుధాకర్ పాల్గొన్నారు.

సాయినాథునికి పల్లకిసేవ
ఇంద్రకీలాద్రి, ఫిబ్రవరి 2: పాతబస్తీ శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానం ప్రాంగణంలో కొలువైన సాయినాథునికి ప్రధాన అర్చకుడు రాచకొండ సుమంత్‌శర్మ వేకువ జామున పల్లకిసేవ నిర్వహించారు. గురుదేవుడైన సాయినాథునికి గురువారం ప్రీతిపాత్రమైన రోజుకావటంతో వేకువజామునే భక్తులు తరలి వచ్చారు. పుష్పాలతో బాబా పల్లకిని అలకరించి భక్తులు జై సాయినాథ మహారాజుజై అంటూ నినాదాలు చేస్తుండగా పల్లకిని సంప్రదాయ ప్రకారం 3సార్లు ఊరేగించారు. తర్వాత బాబాకు అభిషేకాలు, అర్చనలు, విశేష పూజలు నిర్వహించారు. ఉదయం దేవాదాయ ధర్మాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ, తనిఖీ అధికారి ఎ సుజన్‌కుమార్, విజయవాడ అర్బన్ బిసి సంక్షేమ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు పొట్నూరి కార్తీక్, బొట్టా వాసుయాదవ్, కోశాధికారి పి సునీల్, దేవస్థానం కమిటీ మాజీ ధర్మకర్తలు విచ్చేసి బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు.