విజయవాడ

రాజధాని అమరావతికి త్వరలోనే పూర్వ వైభవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 20: నవ్యాంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి త్వరలోనే పూర్వ వైభవం చాటుకోగలదంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. వేల సంవత్సరాల క్రితమే అమరావతిలో విలసిల్లిన బౌద్ధమతం ఆపై ప్రపంచ దేశాలకు విస్తరించడం వలన జపాన్, చైనా వంటి ఏ దేశానికి వెళ్లినా అమరావతి ప్రస్తావన రాకుండా ఉండదన్నారు. అందుకే ఆశించినంత త్వరగా విదేశీ పెట్టుబడులు పుష్కలంగా రాబోతున్నాయన్నారు. అందుకే ప్రపంచ బౌద్ధ అధ్యయన కేంద్రంగా, పర్యాటక కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దుతానన్నారు. అంతేగాకుండా చెన్నై, లండన్ మ్యూజియంలలో ఉన్న అమరావతి కళా ఖండాలను తెప్పించి దేశంలోనే గర్వించే స్థాయిలో మ్యూజియం నెలకొల్పుతామన్నారు.
ప్రముఖ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు రచించిన ‘అమరావతి ప్రభువు వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు’ పుస్తకాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య పొత్తూరి తన గ్రంథాన్ని చంద్రబాబుకి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్భ్రావృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న బాబుకు తాను ఇంతకంటే ఏమివ్వగలనన్నారు. రాష్ట్ర నూతన రాజధానికి అమరావతిగా నామకరణం చేసిన చంద్రబాబుకు రాజధాని ఏర్పాటు విషయంలో అన్ని పార్టీలు సహకరించాలని కోరారు.
సభకు అధ్యక్షత వహించిన శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు తన ప్రసంగంలో అమరావతి ప్రభువు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడి వ్యక్తిత్వాన్ని, ఆయన గాధను వివరించారు. తానీ పుస్తకాన్ని ఆమూలాగ్రం చదివానని చెప్పారు. ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ పొత్తూరి వెంకటేశ్వరరావు తెలుగు పత్రికారంగ విలువలను కాపాడారని కొనియాడారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా రాష్ట్రం గురించి ఆవేదన చెందారన్నారు. చరిత్ర తెలుసుకోనందు వల్లనే ఇంకా అనేక ఇక్కట్లు వస్తున్నాయన్నారు. రాష్ట్రంలో భవిష్యత్తు తరాల గురించి ఆలోచన చేసిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు షృష్టికర్త అమరావతి కావ్యకన్యను నేటి అమరావతి సృష్టికర్తకు ఇవ్వటం సబబుగా ఉందన్నారు.
చింతపల్లి, అమరావతిలో తమ వంశానికి భూములున్నాయని, స్మృతి చిహ్నాల ఏర్పాటుకు, అభివృద్ధికి ప్రభుత్వానికి ఇస్తామని అమరావతిని చివరగా పరిపాలించిన వాసిరెడ్డి వేంకటాద్రినాయుడు బంధువులు ప్రకటించారు. శ్రీనంద్ రాజా యార్లగడ్డ గోపాల భాస్కర వెంకట రామలింగ ప్రసాద్, కుమారుడు, ఆయన కుమారుడు దేవీ ప్రసాద్, మనవడు కుందన ప్రసాద్ ముఖ్యమంత్రిని కలిశారు. ఎమెస్కో అధిపతి విజయకుమార్, చంద్రశేఖర రెడ్డి మాట్లాడారు. జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు, జడ్పీ ఛైర్ పర్సన్ గద్దె అనూరాధ పాల్గొన్నారు.