విజయవాడ

ఓపెన్ ఫోరంలో 12 దరఖాస్తులకు అనుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 3: భవన నిర్మాణ దారులకు మెరుగైన సేవలందించే క్రమంలో ఎపి సిఆర్‌డిఎ నిర్వహిస్తున్న ఓపెన్ ఫోరం కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. దరఖాస్తుదారులు స్వయంగా పాల్గొని తమ దరఖాస్తుల స్థితిగతులు తెలుసుకొనడమే కాకుండా అన్ని సక్రమంగా ఉన్న వాటికి అప్పటికప్పుడు అనుమతులు మంజూరు చేస్తున్న చర్యలపై సర్వత్రా హర్షం వ్యక్తం మవుతోంది. ఈసందర్భంగా శుక్రవారం ఉదయం నగరంలోని సిఆర్‌డిఎ కార్యాలయంలో జరిగిన ఓపెన్ ఫోరానికి మొత్తం 17 దరఖాస్తులు రాగా వీటిలో 12 దరఖాస్తులకు అనుమతులు మంజూరు కాగా 5 దరఖాస్తులను అదనపు సమాచారాన్ని కోరడమైంది. భవన నిర్మాణ అనుమతుల కోసం 4 రాగా 3 దరఖాస్తులను పరిశీలించిన అనంతరం అప్పటికప్పుడు అనుమతులు మంజూరు చేసారు. ఆక్యుపెన్సీ సర్ట్ఫికేట్ కోసం 4 రాగా అన్ని పత్రాలు సక్రమంగా ఉన్న 3 దరఖాస్తులకు మంజూరు చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో సిఆర్‌డిఎ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్, డైరెక్టర్ వి రాముడు, జాయింట్ డైరెక్టర్ వి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

చిన్న పొరపాటుకు పెద్ద రాద్దాంతమా!?
విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 3: విఎంసి డ్రాఫ్ట్ బడ్జెట్‌లో జరిగిన పొరపాట్లపై విపక్షాలు చేస్తున్న రాజకీయ రాద్ధాంతం గర్హినీయమని నగర డెప్యూటీ మేయర్ గోగుల రమణారావు, ఫ్లోర్ లీడర్ జి హరిబాబు పేర్కొన్నార. ఈ సందర్భంగా శుక్రవారం కౌన్సిల్ భవనంలోని టిడిపి ఛాంబర్లో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ అన్ని పొరపాట్లను సరిచేసుకొని ఈనెలాఖరులో జరుగనున్న కౌన్సిల్ సమావేశానికి బడ్జెట్ తీసుకురానున్నట్టు తెలిపారు. బడ్జెట్ పొరపాట్లలో నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ ప్రమేయం ఏదీ లేదని వారు ఉద్ఘాటించారు. కౌన్సిల్ ఆమోదం లోపు స్థారుూ సంఘంలో సమగ్రంగా చర్చించనున్నట్టు తెలిపారు. నగర సమగ్రాభివృద్ధికి నిరంతరం సహకరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలను చూసి సహించలేకే ఇటువంటి విమర్శలకు పాల్పడుతున్నారని ఎద్దేవా చేసారు. అధికారులు కొన్ని జాగ్రత్తలు తీసుకొంటే ఈ పొరపాట్లు తలెత్తేవి కాదన్నారు. ఈసమావేశంలో మాజీ కార్పొరేటర్ కొట్టేటి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.