విజయవాడ

మత సామరస్యానికి ప్రతీక గుణదల పుణ్యక్షేత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, ఫిబ్రవరి 4: మత సామరస్యానికి గుణదలమాత పుణ్యక్షేత్రం ప్రతీకగా నిలుస్తొందని విజయవాడ కతోలిక పీఠం బిషప్ తెలగతోటి జోసఫ్ రాజారావుఅన్నారు. గుణదలమాత మహోత్సవాల నవదిన ప్రార్ధనల్లో భాగంగా శనివారం సాయంత్రం ఆయన ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుణదలమాత పుణ్యక్షేత్రానికి ఒక్క క్రైస్తవులే కాకుండా అన్ని కులాలు, మతాలవారు మరియమాతను సందర్శిస్తున్నారని తెలిపారు. గౌరవ అతిధి కళాదర్శిని డైరెక్టర్ ఫా.రవీంద్రనాధ్ ఎస్.జె. మాట్లాడుతూ భక్తుల కోర్కెలు తీర్చే మాతగా మరియమాత ఘనతకెక్కిందన్నారు. అంతకుముందు విజయవాడ కతోలిక పీఠం బిషప్ జోసఫ్ రాజారావు, మోన్స్‌గ్నోర్స్ మువ్వలప్రసాద్, యం.గాబ్రియేలు, పుణ్యక్షేత్రం రెక్టర్ ఫా.యేలేటి విలియం జయరాజు, ఫా.రవీద్రనాద్ తదితర గురువులు దివ్యసత్ప్రసాద ఆరాధనతో కొండపై మరియమాత వద్దకు వెళ్ళారు. అనంతరం గురువులు కొండపై మరియమాత వద్ద ‘సమిష్టి దివ్యపూజాబలి’ సమర్పించారు. పటమట, కానూరు, పెనమలూరు విచారణల నుండి వచ్చిన భక్తులు మన రాష్ట్ర పాలకుల కోసం ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఫా. ఇంటి అంతోని, ఫా.స్వామినాధం, ఫా.క్రీస్తురాజు, ఫా.సతీష్, ఫా.ప్రతీప్ తదితరులు గురువులు పాల్గొన్నారు.

మెడికల్ హబ్‌గా అమరావతి
విజయవాడ, ఫిబ్రవరి 4: అమరావతిని మెడికల్ హబ్‌గా చేసేందుకు కృషి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. శనివారం కానూరులో నాగార్జున మెడికల్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. కేన్సర్ చికిత్స కోసం అత్యాధునిక ట్రూబీం మిషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇంగ్లాండ్ నుండి 7 మంది డాక్టర్ల బృందం ఇక్కడకు వచ్చి కేన్సర్ సెంటర్‌ను ఏర్పాటు చేయడంతోపాటు రేడియేషన్ ట్రీట్‌మెంట్ కోసం రూ. 17 కోట్లతో అత్యాధునిక మిషన్‌ను ఏర్పాటు చేసినందులకు వైద్య బృందాన్ని అభినందించారు. కేన్సర్ చికిత్స కోసం సాధారణంగా 45 నిమిషాలలో చికిత్స జరుగుతుందని అయితే ఈ మిషన్ వల్ల కేవలం 2 లేదా 3 నిమిషాల్లో చికిత్స చేయవచ్చన్నారు. బ్రిటన్ ప్రభుత్వ సహకారంతో మన దేశంలో ఏర్పాటు చేయనున్న 8 అత్యాధునిక ఆసుపత్రుల్లో మన రాష్ట్రంలో ఒక ఆసుపత్రిని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. గల్ప్ దేశాల నుండి డా బిఆర్ షెట్టి నేతృత్వంలో రాష్ట్రంలో వైద్య కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపంచ కేన్సర్ దినోత్సవం నాడు రాష్ట్రంలో మొట్టమొదటి ఆధునిక కేన్సర్ ఆసుపత్రి ఏర్పాటు కావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, బందరు పార్లమెంట్ సభ్యులు కొనకళ్ల నారాయణరావు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్, డాక్టర్ జగన్మోహనరావు, డాక్టర్ శ్రీ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.