విజయవాడ

మతాలు వేరైనా మానవులంతా ఒక్కటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, ఫిబ్రవరి 5: మతాలు వేరైనా మానవులంతా ఒక్కటేనని లబ్బీపేట విచారణ కర్తలు ఫాదర్ ఐ.యం. స్వామినాధం అన్నారు. గుణదలమాత మహోత్సవాల నవదిన ప్రార్ధనలు ఆదివారం ఆరవ రోజుకు చేరుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన ఫాదర్ స్వామినాధం భక్తులకు సందేశమిస్తూ దేవుని తల్లిగా మరియమాత భక్తులచేత నీరాజనాలు అందుకుంటుందన్నారు. అమె దేవుని తల్లి అయినప్పటికీ ఏసుప్రభువు పట్ల ఎప్పడు వినియ విధేయతలతో మెలిగిందన్నారు. మరియమాత అనేక ప్రాంతాలలో భక్తులకు దర్శనమిచ్చి వేళాంకణీమాతగా, లూర్ధుమాతగా, ఆరోగ్యమాతగా, ఫాతిమామాతగా, గుణదలమాతగా భక్తులచేత గౌరవించబడుతూ తన అనుంగ బిడ్డలుగా ఆశ్రయం కల్పిస్తుందన్నారు. అంతుకుముందు గుణదలమాత ప్రధాన చర్చి నుండి విజయవాడ కతోలిక పీఠం మోన్స్‌గ్నోర్లు ప్రసాద్ మువ్వల, యం.గాబ్రియేలు, పుణ్యక్షేత్రం రెక్టర్ ఫా.యేలేటి విలియం జయరాజు, ఎస్‌ఎస్‌సి డైరెక్టర్ ఫా.పసల తోమస్, తదితర గురువులు దివ్యసత్ప్రసాద ఆరాధనతో కొండపై కొలువైన మరియమాత వద్దకు చేరుకున్నారు. అనంతరం మరియమాత పాదాల చెంత ‘సమిష్టి దివ్యపూజాబలి’ సమర్పించారు. వన్‌టౌన్ సెయింట్ పీటర్స్ కథెడ్రల్, అజిత్‌సింగ్‌నగర్, కేసరపల్లి తదితర విచారణల నుండి వచ్చిన భక్తులు అన్ని మతాల, జాతుల శ్రేయస్సు కోసం ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఆదివారం సెలవుదినం కావటంతో వివిధ ప్రాంతాల నుండి వెల్లువ తరలివచ్చిన మరియమాత భక్తులతో గుణదలమాత పుణ్యక్షేత్రం కిటకిటలాడింది. ఈ కార్యక్రమంలో ఫా. దామాల విజయకుమార్, ఫా.జి.ప్రతాప్, ఫా.డి.సతీష్, తోట మోజెస్, మందిమాల సుమన్. కోనాల కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన రాష్ట్ర స్థాయి ప్రొహిబిషన్, ఎక్సైజ్ క్రీడా పోటీలు
విజయవాడ (స్పోర్ట్స్), ఫిబ్రవరి 5: స్థానిక ఆంధ్రా లయోల కళాశాల మైదానంలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ స్పోర్ట్స్ మీట్ ఆదివారంతో ముగిసింది. 13 జిల్లాల నుండి ఉద్యోగులు ఈ స్పోర్ట్స్ మీట్‌లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆదివారం సాయంత్రం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ నాయుడు, కిషోర్ పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు. వాలీబాల్‌లో శ్రీకాకుళం ప్రథమ, చిత్తూరు ద్వితీయ, తూర్పు గోదావరి తృతీయ స్థానాలను సాధించారు. కబడ్డీలో కృష్ణా, ప్రకాశం, శ్రీకాకుళం మొదటి మూడు స్థానాలను కైవసం చేసుకున్నారు. క్యారమ్స్ పురుషుల విభాగంలో జి సందీప్ (గుంటూరు), జి బాబూరావు (శ్రీకాకుళం), ఎం బాపుజీ నాయుడు (చిత్తూరు), మహిళల విభాగంలో ఆర్ సత్యవతి, వి ఆమల (పశ్చిమ గోదావరి), కె శే్వతరాణి (కర్నూలు)లు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను దక్కించుకున్నారు. టెన్నికాయిట్ సింగిల్స్ విభాగంలో కె ధనలక్ష్మి (విశాఖపట్నం), ఎన్ వెంకటరమణ (గుంటూరు), ఎస్ శ్రావణి (చిత్తూరు)లు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. డబుల్స్ విభాగంలో ఎస్ ధనలక్ష్మి, జయసుధ (విశాఖపట్నం) ప్రథమ, ఎండి నవీన్, కె ధరతిరాణి (పశ్చిమ గోదావరి) ద్వితీయ, పి కుమారి, ఎస్ శ్రావణి (చిత్తూరు) తృతీయ స్థానం దక్కించుకున్నారు. టేబుల్ టెన్నిస్‌లో పి వలీ (అనంతపురం), ఆర్‌వి రమణ (విజయనగరం), జి రాంబాబు (తూర్పు గోదావరి)లు మొదటి మూడు స్థానాలు సాధించారు. 400 మీటర్ల పురుషుల రిలేలో చిత్తూరు, అనంతపురం, విశాఖపట్నం, మహిళల విభాగంలో కృష్ణా, పశ్చిమ గోదావరి, అనంతపురంలు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను కైవసం చేసుకున్నారు.