విజయవాడ

జాతీయ మహిళా పార్లమెంట్‌కు భద్రతా చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 6: దేశంలోనే ప్రప్రథమంగా జరుగుతున్న జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు జరగనున్న నేధ్యంలో నగరంలో పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారని విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ చెప్పారు. సోమవారం ఆయన జాయింట్ కమిషనర్ పి.హరికుమార్, డిసిపిలు జి.బాలరాజ్, జివిజి అశోక్‌కుమార్, ట్రాఫిక్ డిసిపి క్రాంతిరాణా టాటాతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశానికి దేశ, విదేశాల నుండి రాజకీయ, వివిధ రంగాల్లో విజయవంతమైన, ఆదర్శవంతమైన మహిళా ప్రతినిధులు పాల్గొననున్నారు. దేశం నలుమూలల నుండి సుమారు 8వేల నుండి 10వేల మంది వరకు మహిళలు, విద్యార్థులు పాల్గొంటున్న ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని, మహిళల భద్రతలను దృష్టిలో వుంచుకుని నగర పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. రైల్వేస్టేషన్, బస్టాండ్, విమానాశ్రయం వద్ద, అక్కడి నుండి సమావేశం జరిగే స్థలానికి వెళ్ళే మార్గంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, సభాస్థలి దగ్గరకు వెళ్లే ముందు అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీచేసి పంపడం జరుగుతుందన్నారు. సభాస్థలం, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసు జాగిలాలను, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, ప్రత్యేక భద్రతా బృందాలు, మెటల్ డిటెక్టర్లు, డోర్‌ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు ఉపయోగించి కట్టుదిట్టమైన నిఘాతో పూర్తి భద్రతా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రతి వ్యక్తిని క్షుణ్ణంగా తనిఖీచేసిన అనంతరం మాత్రమే లోనికి అనుమతించడం జరుగుతుందన్నారు. సభాస్థలం దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసు జాగిలాలను, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, ప్రత్యేక భద్రతా బృందాలు, మెటల్ డిటెక్టర్లు, డోర్‌ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు ఉపయోగించి కట్టుదిట్టమైన నిఘాతో పూర్తి భద్రతా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మహిళా ప్రతినిధులు, విద్యార్థుల భద్రతను దృష్టిలో వుంచుకుని 16 మంది మహిళా పోలీస్ అధికారులు 500 మంది మహిళా సిబ్బందిని ప్రత్యేకంగా ఉపయోగించడం జరిగిందని చెప్పారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సిసి కెమెరాలను, డ్రోన్‌లతో నిఘా ఏర్పాటు చేశామని, ప్రతినిధులు, విద్యార్థులకు కేటాయించిన విడిది ప్రదేశాల వద్ద కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. సురక్షితమైన, సువిశాలమైన పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటుచేయడం జరుగుతుందని, సభాస్థలి, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో విస్తృతమైన పోలీస్ పెట్రోలింగ్ 24 గంటలు ఏర్పాటుచేయడం జరుగుతుందని వివరించారు. పోలీస్ సిబ్బంది, అధికారులకు ముందుగానే శిక్షణ ఇవ్వడం ద్వారా భద్రతా ఏర్పాట్లపై పూర్తి అవగాహన కల్పించామని, రద్దీని దృష్టిలో వుంచుకుని కనకదుర్గ మల్లేశ్వరస్వామి వార్ల దేవాలయం, ఇతర పర్యాటక ప్రదేశాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని చెప్పారు. మహిళల భద్రత కొరకు ప్రత్యేకంగా మహిళా రక్షక్ దళాలను ఉపయోగించడం జరుగుతుందన్నారు. దొంగతనాలు, వివిధ నేరాలను అరికట్టేందుకు, నేరస్థులను గుర్తించేందుకు ప్రత్యేక క్రైమ్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని, క్రైమ్ బృందాలను పిలిపించి వివిధ జిల్లాల నుండి నేరస్థులను గుర్తించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. సత్వర పోలీస్ స్పందన, సమాచారం కొరకు ప్రత్యేకంగా పోలీస్ కంట్రోల్ రూంను సభాస్థలం వద్ద ఏర్పాటు చేశామని, అసాంఘిక శక్తులు, విద్రోహ చర్యలకు పాల్పడకుండా విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేశామని, ప్రతినిధులు, ఆహుతుల సహాయార్ధం వీలైనన్ని హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేయడం జరుగుతుందని సవాంగ్ వెల్లడించారు.