విజయవాడ

మూలిగే నక్కపై పన్ను భారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, ఫిబ్రవరి 7: రవాణారంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఉదయం లారీ యజమానులు ర్యాలీ నిర్వహించి, బెంజసర్కిల్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపాల నాయుడు మాట్లాడుతూ అసలే రవాణా రంగంలో సంక్షోభంలో కొట్టుమిట్లాడుతుంటే ములిగే నక్కపై తాటికాయపడ్డ చందంగా ప్రభుత్వ వివిధ రూపాలలో పన్నులు భారం మోపుతుందన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా డీజిల్‌పై లీటర్‌కు నాలుగు రూపాయల వ్యాట్ విధిస్తుందన్నారు. వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. రవాణా శాఖ అధికారులు వివిధ చలాన ఫీజులు పెంచటమేకాక, ఫెనాల్టీలు విధిస్తుందన్నారు. అన్ని వాహనాల డ్రైవర్లకు 8వ తరగతి వరకు చదువు ఉండాలని వుండాలని నిబంధన విధించటం సరైందికాదన్నారు. నిబంధనలను సడలించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎపి లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి వైవి ఈశ్వరరావు, జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కెవి.రమేష్, సుంకర రమేష్‌బాబు, ఐలా చైర్మన్ సుంకర దుర్గాప్రసాద్ వివిధ అసోసియేషన్ల సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్ నుండి బెంజిసర్కిల్ వరకు లారీ యజమానులు భారీ ర్యాలీ నిర్వహించారు.
గుణదల తిరునాళ్లకు సర్వం సిద్ధం
పటమట, ఫిబ్రవరి 7: ఈ నెల 9,10,11 తేదిలలో మూడు రోజులపాటు జరగనున్న గుణదలమాత తిరునాళ్లకు ఏర్పాట్లు సర్వసిద్ధం చేసినట్లు విజయవాడ కతోలిక పీఠం బిషప్ తెలగతోటి జోసఫ్ రాజారావు తెలిపారు. మంగళవారం సాయంత్రం గుణదల సోసల్ సర్వీస్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దక్షణ భారతదేశంలో రెండో అతిపెద్ద క్రైస్తవ పుణ్యక్షేత్రంగా పేరోందిన గుణదలమాత పుణ్యక్షేత్రం తిరునాళ్లకు సుమారు 10 నుంచి 15 లక్షల మంది యాత్రికులు రావచ్చని అన్నారు. అందుకు తగిన విధంగా ఇప్పటికే ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయంతో గుణదలమాత ఉత్సవ కమిటీ భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. విజయవాడ కతోలిక పీఠం మోన్స్‌గ్నోర్ మువ్వలప్రసాద్ మాట్లాడుతూ అమరావతి రాజధాని విజయవాడ నగరంలో జరుగుతున్న గుణదలమాత మహోత్సవాలకు వచ్చే భక్తుల కోసం ఈ సంవత్సరం వివిధ అభివృద్థి పనులు చేపట్టి పూర్తి చేసినట్లు తెలిపారు. కొండ దిగువ నుండి మధ్యలో మరియమాత గుహ వరకు మెట్ల మార్గానికి ఇరువైపుల సేఫ్టీవాల్ నిర్మించటం జరిగిందన్నారు వృద్ధులు, చిన్నపిల్లలు సునాయాసంగా కొండ ఎక్కేందుకు రోడ్డును వెడల్పు చేయటం జరిగిందన్నారు. కడియం నుంచి తీసుకొచ్చిన వివిధ రకాల మొక్కలతో గుణదల ఏలూరు రోడ్డు నుండి ప్రధాన దేవాలయం వరకు విశాలమైన రోడ్డును అభివృద్ధి చేసి ఇరువైపుల గ్రీనరీ ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. అలాగే కొండపై మెట్లమార్గంకు ఇరువైపుల కూడా మొక్కలు ఏర్పాటు చేసి గ్రీనరిని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. కొండపై మరియమాతను దర్శించుకునే ప్రాంగణంను ఆధునిక టైల్స్‌తో అందంగా తీర్చిదిద్దం జరిగిందన్నారు. ఈ సమావేశంలో గుణదలమాత పుణ్యక్షేత్రం రెక్టర్ ఫా.యేలేటి విలియం జయరాజు, మోన్స్‌గ్నోర్ యం.గాబ్రియేలు, ఎస్‌ఎస్‌సి డైరెక్టర్ ఫా.పసల తోమస్ తదితరులు పాల్గొన్నారు.