విజయవాడ

గత సంఘటనలు పునరావృతం కాకూడదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), మే 20: ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన కృష్ణాపుష్కరాల సందర్భంగా గతంలో ఎదుర్కొన్న సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని రాష్ట్ర డిజిపి జాస్తి వెంకట రాముడు అధికారులను అదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో కలిసి ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ తరలివచ్చే లక్షలాది భక్తుల సౌకర్యార్థం నాణ్యతతో కూడిన సౌకర్యవంతమైన సేవలు అందించాలని, విశాలమైన స్నానఘాట్‌ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. డిజిపి ఇతర పోలీసు ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్‌తో కలిసి శుక్రవారం కృష్ణానది వద్ద పలు ప్రాంతాలు, ఘాట్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుష్కర స్నానాలకు వచ్చే భక్తులు ఘాట్లలో సులువుగా చేరుకుని, క్షేమంగా తిరిగి వెళ్లేలా చర్యలు చేపట్టాలన్నారు. గత కృష్ణా పుష్కరాల్లోనూ, అదేవిధంగా ఇటీవల గోదావరి పుష్కరాల సందర్భంలోనూ ఎదుర్కొన్న దుస్సంఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బ్యారేజీ ఇరువైపుల జరుగుతున్న పనులను పరిశీలించిన ఆయన నాణ్యత విషయంలో రాజీ పడకుండా నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ఇరిగేషన్ అధికారులు వర్షాకాలం వరదలు తదితర ప్రకృతి పరమైన వైపరిత్యాల సందర్భంలో దీటుగా ఎదుర్కొనేలా అత్యవసర ఏర్పాట్లను దృష్టిలో ఉంచుకుని అందుకు తగిన విధంగా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా కలెక్టర్ బాబు.ఎ మాట్లాడుతూ జిల్లాలో పుష్కర ఘాట్లను పూర్తి విశాలమైన ఘాట్లుగా రూపొందిస్తున్నట్లు చెప్పారు. నది తీర ప్రాంతంలో స్నానఘాట్లతోపాటు యాత్రికులు వేచి ఉండేందుకు అనువుగా ప్రాంగణాలను తీర్చి దిద్దుతున్నామన్నారు. పవిత్ర సంగంమం ప్రాంతంలో విశాలమైన ఘాట్‌లతోపాటు ప్రముఖ నమూనా దేవాలయ ఏర్పాట్లకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ పనులు జూలై నెలాఖరు నాటికి పూర్తి చేయడంతోపాటు నాలుగు లైన్ల రహదారి మార్గాలను అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. జిఐఐసి చైనా, సోమా కంపెనీల ఆధ్వర్యాన అద్భుతమైన నిర్మాణాలకు, భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతం పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. పదిమీటర్ల వెడల్పు స్నాన్‌ఘాట్‌లు, నాలుగు అడుగుల లోతుతో నిర్మించడం జరుగుతుందని అధికారులు ఈ సందర్భంగా తెలిపారు. రెండు స్క్రైబ్‌ల్‌గా ఈ ఘాట్‌లను నిర్మిస్తున్నామన్నారు. డిజిపి క్షేత్రస్థాయి పరిశీలనలో మోడల్ గెస్ట్‌హౌస్, దుర్గాఘాట్, వాటర్ హౌస్, పున్నమిఘాట్ వరకు నదితీరంలో కాలినడకన వెళ్లి పరిశీలించారు. అనంతరం ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం ప్రకాశం బ్యారేజీ ప్రాంతాలను పరిశీలించారు. ఆయనతోపాటు లా అండ్ ఆర్డర్ అదనపు డిజిపి ఆర్‌పి ఠాకూర్, గ్రే హౌండ్స్ అదనపు డిజిపి ఎన్ సురేంద్రబాబు, ఆర్టీసి ఎండి నండూరి సాంబశివరావు, పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్, మున్సిపల్ కమిషనర్ వీర పాండియన్, జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, డిసిపి అశోక్‌కుమార్, సబ్‌కలెక్టర్ జి సృజన, చీఫ్ ఇంజనీరు వైఎస్ సుధాకర్, ఎస్‌ఇ సి రామకృష్ణ పాల్గొన్నారు.