కృష్ణ

భద్రతా విభాగం ఉద్యోగులు యూనియన్లలో ఉన్నారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (రైల్వేస్టేషన్), ఫిబ్రవరి 15: రైల్వేలో భద్రతా విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు ఎవరైనా యూనియన్లలో ఉన్నారా.. ఉంటే ఏ స్థాయి పదవుల్లో ఉన్నారు.. అనే అంశంపై ఉన్నతాధికారులు అంతర్గతంగా సర్వే జరుపుతున్నారు. భద్రతా విభాగానికి చెందిన వారు రైల్వే సంఘాల్లో ఉండకూడదంటూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఒక జిఓని విడుదల చేసింది. భద్రత విభాగంలో విధులు నిర్వహిస్తున్న వారు సంఘా ల్లో ఉండటం వల్ల విధులకు సరైన న్యాయం చేయలేరని, ఈ విభాగంలో విధులు నిర్వహిస్తున్న వారు యూనియన్‌లో నాయకత్వపు బాధ్యతల్లో అసలు ఉండకూడదంటూ ఆ జీఓలో పేర్కొన్నారు. మార్చి 31 తరువాత ఎవరినీ సంఘాల ఆఫీస్ బ్యారర్లుగాను, నాయకత్వపు హోదాల్లో చేర్చుకోరాదని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ విషయంపై స్పందించిన రైల్వేలో గుర్తింపు పొందిన సంఘాలు రైల్వే శాఖతో ఇప్పటికే సంప్రదింపులు జరిపి తాత్కాలికంగా ఆ జీఓ అమలును నిలిపి వేయించారు. దాంతో కొంత వరకు ఊపిరి పీల్చుకున్నామనుకున్న సంఘాలు వారి కార్యకలాపాల్లో వారు ఉండగా రైల్వేశాఖ భారతీయ రైల్వేలోని 16 జోన్‌లలో విధులు నిర్వహిస్తున్న వారితోపాటు వర్క్‌షాప్ జోన్‌తో కలిపి మొత్తం 17 జోన్‌ల్లో అంతర్గతంగా సర్వే నిర్వహిస్తున్నదనే విషయం వెలుగులోకి వచ్చింది. భారతీయ రైల్వేలో కార్మికులు, సిబ్బంది మొత్తం కలిపి 13 లక్షల మంది ఉన్నారు. ఇందులో సేఫ్టీ (్భద్రత) విభాగంలో ఎంత మంది పని చేస్తున్నారు. ఇప్పటికే సంఘాల్లో ఎంతమంది సభ్యత్వాలు నమోదు చేసుకుని ఉన్నారు.. అలాగే ఎంతమంది నాయకత్వపు హోదాల్లో ఉన్నారు.. అనే అంశాలపై ఉన్నతాధికారులు సర్వే చేపట్టారు. సర్వే నివేదిక రైల్వేబోర్డుకు అందిన అనంతరం దాని ఆధారంగా యూనియన్‌లో సభ్యత్వం వరకు ఉండవచ్చా.. అసలు సభ్యత్వమే ఉండకూడదా.. అనే విషయమై రైల్వేశాఖ స్పష్టమైన నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం. ఇలాఉంటే రైల్వేశాఖ అమలు పరచిన ఏడవ పే కమిషన్‌పై అసంతృప్తితో ఉన్న కార్మిక సంఘాల జెఎసి సమ్మెబాట తప్పదంటూ ముందుకు సాగుతున్న నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన ఈ అంతర్గత సర్వే వ్యవహారం యూనియన్లలో కలవరం రేపుతోంది. సమ్మెను తిప్పికొట్టాలంటే అందుకు సరైన మార్గాన్ని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. అందులో భాగమే సేఫ్టీ విభాగంలో పని చేసే వారు సంఘాల్లో ఉండకూడదంటూ జిఓ విడుదల చేశారని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. సేఫ్టీ కేటగిరిలో ఉన్న ప్రధాన విభాగాలను సంఘాల నుంచి తప్పిస్తే జెసిఎ తలపెట్టిన సమ్మె ఎట్టి పరిస్థితిలోనూ విజయవంతం కాదనేది అన్నతాధికారుల అభిప్రాయం. కార్మిక సంఘాల జెఎసి కూడా దీంతో ఏకీభవిస్తోంది. ఈ పరిస్థితిలో ప్రస్తుతం పే కమిషన్‌లో మార్పులు, చేర్పులు వంటి అంశాలను పక్కన పెట్టి సేఫ్టీ విభాగాలను ఎటువంటి పరిస్థితిలోనూ సంఘాల నుంచి తొలగించకుండా చూసేందుకు యూనియన్‌లు సిద్ధపడుతున్నాయి. సేఫ్టీ కేటగిరీని సంఘాల నుంచి తప్పిస్తే జెఎసి తలపెట్టే సమ్మెలో ఎక్కడ కూడా ఒక్క రైలు కూడా ఆగే పరిస్థితి ఉండదు. దీంతో సమ్మె నీరుగారినట్టేనని రైల్వేబోర్డు భావిస్తోంది. సర్వే అనంతరం పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాల్సి వుంది.