విజయవాడ

న్యూ ట్రెండ్ క్రైమ్ !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం సినిమాలోనే చూశాం.. ఇప్పుడు నిజంగా కూడా సినిమా చూపిస్తున్నారు కొందరు అపరిచితులు. మన పక్కింటి వాళ్ళే అనుకునేలోగా మస్కా కొట్టి నగదు, నగలతో జారుకుంటున్నారు. సినీ ఫక్కీలో సిటీలో ఇప్పుడు సరికొత్త మోసాలు తెర మీదకు వస్తున్నాయి. ‘ న్యూ ట్రెండ్ క్రైమ్’తో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే ఈ తరహా వ్యక్తుల బారిన పడి నగలు, నగదు వదులించుకున్న బాధితులు ఇప్పుడు పోలీస్టేషన్లకు క్యూ కడుతున్నారు..!
విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 16: ఇప్పటి వరకు అనే రకాల నేరాల గూర్చి తెలిసిన నగర ప్రజలు ఇప్పుడు మరింత అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చింది. నగరంలో కొత్త తరహా మోసాలు వెలుగు చూస్తున్నాయి. మన చూస్తుండగానే.. ఇంటి పరిసరాల్లో మెలుగుతూ పక్కింటి వాళ్ళలా.. మరిపిస్తారు.. అంతలోనే మనవాళ్ళే అన్నట్లు నమ్మించి చాకచక్యంగా నగదు, నగలు కాజేసి జారుకుంటారు. తీరా మోసపోయిన బాధితులు మాత్రం అతను ‘మీ వాడేగా.. కాదు మీవాడే’ నంటూ బుర్ర గోక్కోవాల్సి వస్తుంది లేదా వాదనకు దిగే పరిస్ధితి. ఆనక వచ్చిన అపరిచితులు మోసగాళ్ళని గ్రహించి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదులు చేస్తున్నారు. జనం దృష్టి, రద్దీ అంతగా లేని ప్రాంతాలను ఎంచుకుంటున్న మోసగాళ్ళు ఆయా చోట్ల సంచరిస్తూ ముందుగా ఓ ఇంటి ఆవరణలో తచ్చాడుతూ.. పక్కింటి వారు గమనించే విధంగా వ్యవహరిస్తున్నారు. చిల్లర కోసమో.. చిరుమానా కోసమో.. అన్నట్లు ఆ ఇంటి వారితో మాటలు కలిపి బాతాఖానీ వేస్తారు. ఇది గమనించిన పక్కింటి వారు పొరుగువారి తాలూకా అని నమ్మేలా నటిస్తారు. కొద్దిసేపటికి పక్కింటికి వెళ్లి వారితో కూడా చనువుగా మెలుగుతూ మీ పక్కింటి వారి చుట్టాలమని చెబుతారు. చివరికి ముగ్గులోకి దించి మీ మెడలో గొలుసు, హారం బాగున్నాయి ఇదే మోడల్‌లో మా చెల్లికి కూడా చేయించాలని ఓసారి చూసి ఇస్తామంటూ తీసుకుని పక్కింట్లోకి వెళ్లినట్లు వెళ్లి అటు నుంచి ఇక జారుకుంటారు.
అదేవిధంగా 100, 500 నోట్లు కోసం మావాళ్ళు బ్యాంకుకు వెళ్తున్నారు. మీకు కూడా చిల్లర కావాలా అంటూ రెండు వేల నోట్లు ఇవ్వండని మరో తరహాలో కూడా నమ్మించి నగదు కాజేస్తున్నారు. అలాగే కొన్ని ఫోన్ నెంబర్లు సేకరించి బ్యాంకు మేనేజర్లమంటూ కాల్ చేసి ఏటిఎం కార్డు నెంబర్, పిన్ నెంబర్లను, ఓటిపి నెంబర్ల అడిగి అకౌంట్లలోని నగదు కాజేయడం మరో తరహా మోసం. ఇలా ఇప్పుడు ఈ మూడు తరహాల్లో మోసగాళ్ళు నగరంలో గడిచిన 40రోజుల్లో చెలరేగిపోయారు. గత నెలన్నర కాలంలో పరిశీలిస్తే.. పటమట, మాచవరం, పెనమలూరు పోలీస్టేషన్ల పరిధిలో మొత్తం 10కేసులు నమోదయ్యాయి. నగలు, నగదు పోగొట్టుకుని మోసపోయిన బాధితులు మాత్రం తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
* రంగంలోకి ప్రత్యేక బృందాలు: ఏసిపి సత్యానందం
కాగా.. నగరంలో సరికొత్త మోసాలతో హడలిపోతున్న ప్రజలు, బాధితులు మరింత అప్రమత్తంగా ఉండాలని సెంట్రల్ ఏసిపి సత్యానందం సూచించారు. ఇప్పటికే నమోదైన కేసులకు సంబంధించి మూడు పోలీస్టేషన్ల పరిధిలో సుమారు 25కాసుల బంగారం, 50వేల రూపాయలు వరకు నగదు కాజేశారని, నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయని ఆయన చెప్పారు. తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుర్తు తెలీని వ్యక్తులు, అపరిచితులు మీ వద్దకు వచ్చి మీ పక్కింటి చుట్టాలమంటూ నమ్మించి మోసానికి పాల్పడతారని అట్టివారి బారిన పడి మోసపోకుండా.. అనుమానితులు తారసపడగానే వెంటనే డయల్ 100కు లేదా సమీప పోలీస్టేషన్‌కు సమాచార ఇవ్వాలని సూచించారు. విలేఖరుల సమావేశంలో మాచవరం సిఐ ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.