విజయవాడ

ఇండియన్ రౌండ్ ఆర్చరి విజేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(స్పోర్ట్స్), ఫిబ్రవరి 17: జిల్లా కేంద్రం మచిలీపట్నం హిందూ కళాశాల క్రీడా మైదానంలో కృష్ణా విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అఖిల భారత అంతర్ విశ్వ విద్యాలయాల ఆర్చరి ఛాంపియన్ షిప్ పోటీల్లో భాగంగా ఇండియన్ రౌండ్ పోటీలు శుక్రవారంతో ముగిశాయి. పురుషుల విభాగంలో కేరళ రాష్ట్రానికి చెందిన యూనివర్శిటీ ఆఫ్ కాలికట్, మహిళల విభాగంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చౌదరి చరణ్ సింగ్ యూనివర్శిటీ పతకాల పంట పండించాయి. 30 మీటర్ల పురుషుల విభాగంలో శివం కేసరి (సంపూర్ణానంద సన్‌క్రీత్ యూనివర్శిటీ), ఎస్‌హెచ్ గిరీష్ (సంత్‌గాడ్జ్ బాబా అమరావతి యూనివర్శిటీ), సుతార్ ధనుంజయ్ (సావిత్రిబాయి ఫూలే పూణే యూనివర్శిటీ)లు వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు. మహిళల విభాగంలో రితికా సింగ్ (చౌదరి చరణ్ సింగ్ యూనివర్శిటీ), సందీప్ కౌర్ (గురునానక్ దేవ్ యూనివర్శిటీ), జుదీష్ మేరీ దాసన్ (యూనివర్శిటీ ఆఫ్ కాలికట్)లు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. 50 మీటర్ల పురుషుల విభాగంలో అజిత్ బాబు (యూనివర్శిటీ ఆఫ్ కాలికట్), అనీస్ యాదవ్ (వీర్ బహదూర్ సింగ్ పూర్వాంచల్ యూనివర్శిటీ), సునీల్ కుమార్ (కురుక్షేత్ర యూనివర్శిటీ), మహిళల విభాగంలో రితికా సింగ్ (చౌదరి చరణ్ సింగ్ యూనివర్శిటీ), మాన్ ప్రీత్ కౌర్ (పంజాబీ యూనివర్శిటీ), ప్రియాంక సంతోష్ (శివాజీ యూనివర్శిటీ) తొలి మూడు స్థానాల్లో నిలిచారు. ఓవరాల్ పురుషుల విభాగంలో అజిత్ బాబు (యూనివర్శిటీ ఆఫ్ కాలికట్), అనీస్ యాదవ్ (వీర్ బహుదూర్ సింగ్ పూర్వాంచల్ యూనివర్శిటీ), సుతార్ ధనుంజయ్ (సావిత్రి బాయి ఫూలే పూణే యూనివర్శిటీ), మహిళల విభాగంలో రితికా సింగ్ (చౌదరి చరణ్ సింగ్ యూనివర్శిటీ), సందీప్ కౌర్ (గురునానక్ దేవ్ యూనివర్శిటీ), కె పుష్పాభతి దేవి (మణిపూర్ యూనివర్శిటీ)లు వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధించారు. వ్యక్తిగత పురుషుల విభాగంలో బీర్ లాల్ (మహాత్మ గాంధి కాశీ విద్యాపీఠ్ యూనివర్శిటీ), అమిత్ కుమార్ సింగ్ (వినోబా బావే యూనివర్శిటీ), మహిళల విభాగంలో రితికా సింగ్ (చౌదరి చరణ్ సింగ్ యూనివర్శిటీ), సందీప్ కౌర్ (గురునానక్ దేవ్ యూనివర్శిటీ), మాన్ ప్రీత్ కౌర్ (పంజాబీ యూనివర్శిటీ)లు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను కైవసం చేసుకున్నారు. కృష్ణా విశ్వ విద్యాలయం ఉపకులపతి ఆచార్య సుంకరి రామకృష్ణారావు, రిజిస్ట్రార్ ఆచార్య డి సూర్యచంద్రరావు, రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎం శైలజ, ఎన్‌సిసి 13వ బెటాలియన్ కమాండెంట్ కల్నల్ రాజశేఖర్, సిఎం క్రీడా సలహాదారుడు రవీంద్రనాధ్, ఎల్‌ఐసి సీనియర్ డివిజనల్ మేనేజర్ పి బాలయ్య, స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి డా. ఎన్ శ్రీనివాసరావు, ఆర్చరి రాష్ట్ర సంఘ కార్యదర్శి సిహెచ్ సత్యనారాయణ తదితరులు విజేతలకు పతకాలను బహూకరించారు.