విజయవాడ

ఒకే రోజులో రైతుల ప్లాట్ల రిజిస్ట్రేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 17: రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ప్రభుత్వ తిరిగి ఇచ్చిన ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు సంబంధించి అన్ని ఖర్చులు సిఆర్‌డిఎ భరాయిస్తుందని సిఆర్‌డిఎ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్ పేర్కొన్నారు. ఈసందర్భంగా హాయ్‌ల్యాండ్ సమావేశ మందిరంలో శుక్రవారం ఈవిషయంపై అధికారులకు నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిఎం చంద్రబాబు నాయుడు అథారిటీ సమావేశంలో తీసుకొన్న నిర్ణయం మేరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో రైతులు చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలతోపాటు ఇతర ఖర్చులు కూడా సిఆర్‌డిఎ భరాయిస్తుందని తెలిపారు. ఇందునిమిత్తం మొత్తం కోటి 25 లక్షల రూపాయలు ఖర్చవుతుందన్నారు. రిజిస్ట్రేషన్ నిమిత్తం పలుమార్లు కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. 9.14 నమూనా ఫారం సమర్పించగానే రిజిస్ట్రేషన్ సంఖ్య జనరేట్ అయ్యేలా ఏర్పాటుచేసి సప్లెంటరనీ అగ్రిమెంట్, ప్లాట్ రిజిస్ట్రేషన్ మొత్తం ప్రక్రియ అంతా ఒకే రోజున పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అదనపు సమాచారం కోసం రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సిఆర్‌డిఎ తరఫున హెల్ప్‌డెస్క్ ఏర్పాటుచేయలన్నారు. వారానికొకసారి గ్రామ స్థాయి సమావేశం నిర్వహించి రైతుల ప్లాట్లలో జరుగుతున్న పెగ్ మార్కింగ్, సర్వే, జంగిల్ క్లియరెన్స్ వంటి పనులపై పనుల ప్రగతిని వివరించాలన్నారు. వీటితోపాటు ప్రభుత్వం రైతులకిచ్చిన వాగ్ధానం మేరకు విద్య, వైద్యం వంటి సామాజిక అభివృద్ధి అంశాలపై కూడా చర్యలను వేగవంతం చేయాలన్నారు. రైతుల హెల్త్ కార్డుల వినియోగంలో రైతులకు అవగాహన కల్పించాలని, ఇంకా కార్డులురాని వివరాలను సేకరించాలని తెలిపారు. రాజధాని ప్రాంతంలో మంజూరైన మొత్తం 5వేల గృహ నిర్మాణాలకు త్వరలోనే పనులు ప్రారంభమవుతాయన్నారు. గత రెండేళ్లలో సిఆర్‌డిఎ కు ఎదురైన సవాళ్లు, సాధించిన విజయాలపై కమిషనర్ సెన్సిటైజేషన్ పై సమీక్షించిన శ్రీ్ధర్ విన్నూత్నంగా సమీకరించిన భూ సమీకరణ విధానాన్ని ఇప్పుడు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అమలుచేసేందుకు దృష్టి సారిస్తున్నాయన్నారు. గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ భూ సమీకరణకు రాని భూములను 2013 భూ సేకరణ చట్టం ప్రకారం సేకరించేందుకు ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. నేలపాడు డిక్లెరేషన్ పూర్తయిందని, నెలలో అవార్డు అవుతుందని తెలుపుతూ భూ సేకరణ సమయంలోనొ ఎవరైన రైతు సమీకరణకు ముందుకు వస్తే తీసుకొంటామని తెలిపారు. ఈ సమావేశంలో సిఆర్‌డిఎ డైరెక్టర్లు బి ఎల్ చెన్నకేశవరావు, మోహనరావు, సిఇ కాశీవిశే్శశ్వరరావు, ఏడిసి సిఇ రామమూర్తి, ప్లానింగ్ డైరెక్టర్ ఆర్ రామకృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు.