విజయవాడ

నీటిపారుదల రంగంలో.. ఏపి దేశానికే ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 20: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీటిపారుదల రంగంలో సాధించిన ప్రగతిని ఇప్పటివరకు దాదాపు 20 రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, సీనియర్ అధికారులు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు సందర్శించి వాటిని ఆదర్శంగా తీసుకోవాలని నిర్ణయించడం మనకు గర్వకారణమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. మైలవరం నియోజకవర్గ అభివృద్ధిపై, జన్మభూమి కమిటీలు, సాగునీటి సంఘాల అధ్యక్షులు, స్థానిక ప్రజాప్రతినిధులు జలవనరులశాఖ కార్యాలయంలో సోమవారం సాయంత్రం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. రైతులకు మించిన ఇంజనీర్ లేడు, శాస్తవ్రేత్త లేడు. రూ.40కోట్ల వ్యయంతో చేపట్టే లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మైలవరానికి సంబంధించిన ఒక రైతు కేవలం రూ.7కోట్ల సాంకేతిక అంచనా వ్యయంతో లిఫ్ట్ ఇరిగేషన్ చేపట్టడం జరిగిందని, ఈసందర్భంలో రైతులను మించిన అనుభవజ్ఞులు ఎవరూ లేరన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలను పరిశీలించేందుకు కర్నాటక, మహారాష్టల్రోని పుణె వంటి ప్రాంతాల నుంచి వచ్చారన్నారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు, మైనర్, మేజర్ కాలువల పనులు వారిని ఆకర్షిస్తున్నాయని చెప్పారు. గొల్లపూడిలో రూ.40 లక్షల వ్యయంతో మురుగునీటిని సాగునీటికి ఉపయోగపడే నీటిగా మలచే ప్రాజెక్టును ముఖ్యమంత్రి మెచ్చుకున్నారని, త్వరలోనే దాన్ని సందర్శించాలని ప్రాజెక్టులపై సోమవారం నిర్వహించిన సమీక్ష సందర్భంగా చెప్పారు. రాబోయే కాలంలో రాష్ట్రంలోని 15 మున్సిపాలిటీలు, 15 గ్రామ పంచాయతీల్లో ఈ ప్రాజెక్టు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పోలవరం ప్రాజెక్టు సమీక్షా సమావేశంలో జలవనరులశాఖకు చెందిన రూ.850 కోట్ల పాత బకాయిలకు సంబంధించి వారికి నివేదించగా వెనువెంటనే రూ.425 కోట్లు అప్పటికప్పుడు మంజూరు చేయడం చాలా సంతోషకరమని వారు అన్నారు. ముఖ్యమంత్రి రైతులకు సాగునీటికి సంబంధించి ఏ సమస్యను విన్నవించినా అప్పటికప్పుడు పరిష్కరించి రైతుబాంధవుడిగా పేరు తెచ్చుకున్నారన్నారు.
మైలవరం నియోజకవర్గ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధిలో ఆదర్శంగా నిలవడానికి ప్రతి ప్రజాప్రతినిధి కృషి చేయాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. రెండున్నరేళ్లలో వందల కోట్ల రూపాయలతో సాగునీటి పనులు, లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆయా గ్రామాల్లోని సిసి రోడ్లు, తారు రోడ్లు, మంచినీటి చెరువులు, గొలుసుకట్టు చెరువులు అభివృద్ధి చేసి మైలవరం నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు నియోజకవర్గ ప్రజలు మనస్ఫూర్తిగా సహకరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆదర్శంగా నిలవబోతున్నారని మంత్రి పేర్కొన్నారు. మైలవరం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై రెడ్డిగూడెం, ఆత్కూరు, వెల్లటూరు తదితర గ్రామాల నుంచి రైతులు, సర్పంచ్‌లు వారివారి అభిప్రాయాలను, జరుగుతున్న అభివృద్ధిని సమీక్షా సమావేశంలో మంత్రికి వివరించడం జరిగింది. పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని కృష్ణాడెల్టాకు తీసుకురావడం వల్ల వరి, మొక్కజొన్న లాంటి పంటల దిగుబడి అత్యధికంగా పెరిగిందని రైతులు చెప్పారు. గతంలో బుడమేరు ముంపు వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని, బుడమేరుకు మరమ్మతులు చేయడం వల్ల నేడు బుడమేరు ముంపు తప్పిందన్నారు. సాగునీటి ప్రాజెక్టుల్లో అప్పులేని ప్రభుత్వం ఏపి ఒక్కటేనని చెప్పారు. పలు రాష్ట్రాల్లో ఇప్పటికి నీటి పారుదలపై చేపట్టిన పనులకు సంబంధించి నిధుల చెల్లింపు జరగలేదని, ఏపిలో ఇప్పటివరకు రూ.22వేల కోట్లను ఖర్చుచేసి 2016 డిసెంబర్ వరకు అన్ని చెల్లింపులు పూర్తిస్థాయిలో చెల్లించడం జరిగిందన్నారు. ఈ సమీక్షా సమావేశంలో మైలవరం నియోజకవర్గ పరిధిలోని అధికారులు, రైతులు, జన్మభూమి కమిటీల సభ్యులు, నీటి సంఘాల అధ్యక్షులు తదితరులు పెద్దఎత్తున హాజరయ్యారు.

నేడు విఎంసి సాధారణ కౌన్సిల్ సమావేశం
* అస్తశ్రస్త్రాలతో అధికార, విపక్షాలు రెడీ
* వస్తల్రత, తుమ్మలపల్లి కళాక్షేత్రం అంశాలపైనే ప్రధాన చర్చ
విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 20: నగరపాలక సంస్థ సాధారణ కౌన్సిల్ సమావేశానికి అధికార, విపక్షాలు తమ అస్త్ర, శస్త్రాలతో రె‘్ఢ అవుతున్నాయి. మంగళవారం ఉదయం కౌన్సిల్ భవనంలో జరగనున్న ఈ సమావేశంలో సుమారు 120 అంశాలు చర్చకు రానున్నాయి. వీటిలో నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం అద్దె టారిఫ్ ఖరారు, వన్‌టౌన్‌లోని వస్తల్రత దుకాణ సముదాయ అద్దె బకాయిల చెల్లింపునకు గాను షాపు యజమానులకు రాయితీలిచ్చే విషయంతోపాటు భూ వినియోగ మార్పిడి అంశాలు ప్రధాన చర్చకు రానున్నాయి. వీటిపై అధికార పక్షంపై వివిధ విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్న కౌన్సిల్‌లో వారి ఆమోద చర్యలను అడ్డుకొంటామని విపక్షాలు పేర్కొంటుండంగా వీటి ఆమోద ప్రక్రియలో నగర పాలకులు భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, సిపిఎం తోపాటు బిజెపి ఫ్లోర్ లీడర్లు కూడా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో మంగళవారం జరుగునున్న కౌన్సిల్‌కు ప్రత్యేకత చాటుకుందనే చెప్పాలి. కోట్లాది రూపాయలతో వ్యాపారాలు నిర్వహించే వస్తల్రత దుకాణం దారులు విఎంసికి చెల్లించాల్సిన అద్దె బకాయిలను చెల్లించకపోగా విఎంసికి వ్యతిరేకంగా కోర్టు కేసులు దాఖలు చేసి ప్రస్తుతం విచారణలో ఉన్న నేపథ్యంలో అద్దె బకాయిల్లో రాయితీలివ్వడానికి ముందుకొచ్చిన పాలకుల చర్యల్లో అనేక సందేహాలున్నాయని, వ్యాపారులకు అనుకూలంగా టిడిపి ప్రజాప్రతినిధి చక్రం తిప్పినట్టు విపక్షాలు అరోపిస్తున్నారు. అలాగే దేశంలో మూడవ మహా నగరంగా అభివృద్ధి చెందిన హైదరాబాద్ రవీంద్ర భారతీ ఆడిటోరియం అద్దె టారిఫ్‌ను పరిగణలోకి తీసుకొని నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రానికి అద్దె ఖరారు చేసిన అధికారుల తీరుపై విపక్షాలే కాకుండా అధికార టిడిపి కార్పొరేటర్లు కూడా వ్యతిరేకిస్తున్నారు. నగర కళాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కళాక్షేత్రం టారిఫ్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా ధరల మార్పునకు కార్పొరేటర్లు పట్టుపట్టే అవకాశం కనిపిస్తోంది.