విజయవాడ

పాలకపక్షం పైచేయి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 21: నగరపాలక సంస్థ కౌన్సిల్ సాధారణ సమావేశంలో పాలక పక్షానిదే పైచేయిగా మారింది. మంగళవారం నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో మొత్తం 121 అంశాలపై చర్చ జరిగింది. పలు వివాదాస్పద అంశాలనూ పాలకపక్షం ఆమోదింపచేసుకుంది. ఆయా అంశాలపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్, సిపిఎం, బిజెపి ప్రతిపాదించిన సవరణలను కనీసం పరిగణనలోకి తీసుకోకుండానే ఆమోదిస్తున్నట్టు ప్రకటించడంపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ప్రధానంగా కృష్ణలంక ఫీడర్ రోడ్డుకు తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రోడ్డుగా నామకరణం చేయాల్సిందిగా 23వ డివిజన్ కార్పొరేటర్ జివి నరసింహరావు ప్రతిపాదించిన అంశానికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు చందన సురేష్, కావటి దామోదర్, పల్లెం రవికుమార్, మద్దా శివశంకర్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. కృష్ణలంక అభివృద్ధిలో గతంలో మహనీయులైన డాక్టర్ కెఎల్ రావు, వంగవీటి మోహనరంగా వంటి ప్రజాప్రతినిధులతో పాటు నాటి కమిషనర్‌గా పనిచేసిన అజిత్‌సింగ్ ఎంతో సహకరించారని, స్ఫూర్తిప్రదాతలైన వారి పేర్లను కాదని ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న గద్దె పేరున నామకరణం చేయడం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనంటూ మేయర్ పోడియం వద్ద బైఠాయించి నిరసన నినాదాలు చేశారు. మేయర్ స్థానంలో ఉన్న డెప్యూటీ మేయర్ గోగుల రమణారావు సురేష్, దామోదర్, రవికుమార్‌లను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయినా వారు ఆందోళన విరమించకపోవడంతో కౌన్సిల్ మార్షల్స్ సాయంతో బయటకు తరలించారు. ఈ చర్యను నిరసిస్తూ వైకాపా ఫ్లోర్ లీడర్ బండి నాగేంద్ర పుణ్యశీల నేతృత్వంలో సభ్యులు వాకౌట్ చేశారు. ఈవిషయంలో టిడిపి పాలకులు అనుసరించిన అప్రజాస్వామిక చర్యలను నిరసిస్తూ సస్పెన్షన్‌కు గురైన కార్పొరేటర్లు కౌన్సిల్ భవనంలోనే బైఠాయించారు. కౌన్సిల్ సమావేశం ముగిసినా భవనంలోనే వీరు ఆందోళన కొనసాగించారు. గద్దె పేరు ఆమోద అంశాన్ని రద్దుచేయడమే కాకుండా కృష్ణలంకకు బందరు లాకులు, అమెరికన్ హాస్పటల్, ఫైర్‌స్టేషన్‌ల వద్ద జాతీయ రహదారి కింద సబ్‌వేలు ఏర్పాటు చేసేందుకు పాలకులు చర్యలు తీసుకోవాలంటూ 24గంటల నిరసన ఆందోళన చేపట్టారు. వస్తల్రత తీర్మాన అంశంలో కూడా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడమే కాకుండా విఎంసి ఖజానాకు నష్టం జరిగేలా టిడిపి పాలకులు ఆమోదించటంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నిస్తూ ఆ అంశాన్ని తిరస్కరిస్తూ వైకాపా, సిపిఎం డిసెంట్ నోట్ ఇచ్చాయి. బిజెపి ఫ్లోర్ లీడర్ ఉత్తమ్‌చంద్ భండారీ, సిపిఎం ఫ్లోర్ లీడర్ గాదె ఆదిలక్ష్మి కూడా సవరణ తీర్మానం ప్రతిపాదించారు. అయినా వాటిని పరిగణనలోకి తీసుకోవడం లేదని ఫ్లోర్ లీడర్ హరిబాబు ప్రకటించారు. అలాగే తుమ్మలపల్లి కళాక్షేత్రం అద్దె విషయంపై అధికారులు ప్రతిపాదించిన అంశాన్ని పాలకపక్షం వాయిదా వేసింది. ప్రజాప్రతినిధులను కూడా కమిటీలో నియమించి అద్దె ఖరారు చేయాలని నిర్ణయించారు. మేయర్, డెప్యూటీ మేయర్, కార్పొరేటర్ల గౌరవ వేతనాల పెంపు అంశాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. నగర సుందరీకరణలో భాగంగా సెంట్రల్ డివైడర్లు, స్క్రాబ్ పార్కు, ఇతర గ్రీన్ బెల్టులోని మొక్కలకు నీరు పోయడానికి ట్యాంకర్ల సరఫరా కాంట్రాక్ట్‌కు ఆమోదం లభించింది. మెట్రో కారిడార్ పనుల నిర్వహణకు బందర్‌రోడ్డు, ఏలూరురోడ్డుపై అడ్డంగా ఉన్న విద్యుత్ స్తంభాల తొలగింపు, మళ్లీ వాటిని రోడ్డుకిరువైపులా ఏర్పాటుచేసే అంశం ఆమోదం పొందింది. సింగ్‌నగర్ పైపుల రోడ్డు సెంటర్‌కు ఎన్టీఆర్ సెంటర్‌గా నామకరణం చేస్తూ తీర్మానంతో పాటు ఇప్పటివరకూ స్పోర్ట్స్ అండ్ ట్రాఫిక్ కమిటీకి వీధి పేర్లపై వచ్చిన తీర్మాన అంశాలకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఇదిలావుండగా స్థల వినియోగ మార్పుపై వచ్చిన పలు అంశాలను కౌన్సిల్ వాయిదా వేసింది. మొత్తం 121 అంశాల కౌన్సిల్ సమావేశం ఉదయం సెషన్‌కు నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ అధ్యక్షత వహించి నడిపించారు. మధ్యాహ్నం భోజన విరామ సమయం నుంచి డెప్యూటీ మేయర్ గోగుల రమణారావు మేయర్ స్థానంలో ఆశీనులై కౌన్సిల్‌ను నడిపించారు. టిడిపి పాలక పగ్గాలు చేపట్టిన రెండున్నరేళ్ళ తరువాత తొలిసారిగా మేయర్ స్థానాన్ని అలంకరించిన డెప్యూటీ మేయర్ గోగుల రమణారావును అధికార, విపక్ష కార్పొరేటర్లంతా పుష్పగుచ్ఛాలతో అభినందనలు తెలిపారు. అంతేకాకుండా కౌన్సిల్ సమావేశం కాకముందు నగర కార్పొరేటర్లంతా మేయర్, కమిషనర్‌తో కలిసి గ్రూప్‌ఫొటో తీయించుకున్నారు.

ఆరోగ్యకరమైన సమాజం కోసం
స్వచ్ఛంద సంస్థలు కృషిచేయాలి
* పొగాకు వల్ల ఏటా ఐదు మిలియన్ల మంది మృతి
* పొగాకు నియంత్రణ సదస్సులో చక్రపాణి, బుద్ధప్రసాద్

విజయవాడ, ఫిబ్రవరి 21: ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించేందుకు ప్రభుత్వంతో పాటు, స్వచ్ఛంద సంస్థలు కృషిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని శాసనమండలి చైర్మన్ ఎ చక్రపాణి అన్నారు. స్టార్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘పొగాకు నియంత్రణ-దాని పర్యవసానాలు, ప్రజల్లో అవగాహన’పై రూపొందించిన యూత్ ప్రాజెక్టును విజయవాడలోని ఒక హోటల్‌లో మంగళవారం ఉదయం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం చక్రపాణి మాట్లాడుతూ సమాజాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య పొగాకు అన్నారు. యువత సిగరెట్ తాగడం, మద్యం సేవించడం ఫ్యాషన్‌గా మారిపోయిందని, ఇవి అనేక అనర్థాలకు మూలమవుతుందని తెలిపారు. పొగాకు నియంత్రణపై ప్రభుత్వం అనేక విధాలుగా ప్రజల్లో అవగాహన కల్పిస్తుందన్నారు. ప్రధానంగా సినిమాల్లోనూ, ప్రజా చైతన్య వేదికలపై అవగాహన కల్పిస్తోందన్నారు. పొగాకు నిర్మూలనకు పెద్దఎత్తున అవగాహనా కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ఇటువంటి ప్రధానమైన కార్యక్రమాన్ని స్టార్ యూత్ అసోసియేషన్ నిర్వహించడం అభినందనీయమని, పొగాకు నియంత్రణపై అసోసియేషన్ ఎటువంటి కార్యక్రమం నిర్వహించినా తాము ముందుండి సహకరిస్తామని తెలిపారు. ప్రత్యేక అతిధిగా పాల్గొన్న శాసనసభ ఉప సభాపతి మండలి బుద్దప్రసాద్ మాట్లాడుతూ పొగాకు వాడకం అనేది నేడు దేశ వ్యాప్తంగా, రాష్ట్రంలోనూ విపరీతంగా పెరిగిపోయిందన్నారు. పొగాకు నియంత్రణకు సంబంధించి చట్టాలు ఉన్నాయని, అయితే వాటి అమలుతో పాటు ప్రజల్లో, యువతలో మార్పు రావడంతోపాటు చైతన్యం పెరగాలని కోరారు. ముఖ్యంగా కళాశాల విద్యార్థుల్లో పొగాకు వాడకం వలన వచ్చే దుష్ఫలితాలపై సెమినార్లు, సదస్సులను నిర్వహించడం వలన కొంత వరకు ఫలితం ఉంటుందని తెలిపారు. రాష్ట్ర శాసనసభ విప్ కోనా రవికుమార్ మాట్లాడుతూ దేశం, ప్రాంతం అభివృద్ధి చెందాలంటే యువత భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. కాని నేడు యువత పొగాకు, మద్యం, ఇతర దురలవాట్లకు లోనై తమ జీవితాన్ని దుర్లభం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. స్టార్ యూత్ అసోసియేషన్ పొగాకు నియంత్రణ పట్ల యువతలో అవగాహన కల్పించడానికి 9 నెలల ప్రాజెక్టును రూపొందించిందని, ఇది విజయవంతం కావాలని, ఆరోగ్యకరమైన సమాజం తప్పకుండా సాధ్యమవుతుందని అన్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా మగవారితోపాటు మహిళలు కూడా పొగాకు వాడుతున్నారని, దీనివలన అనేక వ్యాధుల బారినపడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం స్టార్ యూత్ అసోసియేషన్ (ఎస్‌వైఎ) సిఇవో అండ్ అధ్యక్షులు హసన్ సయ్యద్‌సి ఆధ్వర్యంలో జరగ్గా, కార్యక్రమానికి అకాడమీ ఆఫ్ గాంధియన్ స్టడీస్ తిరుపతి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి.గోపాలకృష్ణ అధ్యక్షత వహించారు.