విజయవాడ

మైనార్టీల్లో సంపూర్ణ అక్షరాస్యతే సిఎం ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 23: మైనార్టీ వర్గాల్లో నిరక్షరాస్యతను దూరం చేయడం కోసం, సంపూర్ణ అక్షరాస్యత సాధనే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంకితభావంతో కృషి చేస్తున్నారని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎండి హిదాయత్ అన్నారు. గురువారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ తరపున ‘ఎన్టీఆర్ విద్యోన్నతి’ పథకం ద్వారా అన్నిరకాల పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తామన్నారు. ఐఎఎస్, ఐపిఎస్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నవారికి ప్రిలిమ్స్, మెయిన్స్‌లో వారు ఏ కోచింగ్ సెంటర్‌లో అడ్మిషన్ తీసుకున్నా లక్ష రూపాయల ఫీజు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ తరపున అందిస్తామని తెలిపారు. అంతేకాకుండా ‘బోర్డింగ్’ ఖర్చుల నిమిత్తం పది నెలల పాటు నెలకు రూ.12వేల స్ట్ఫైండ్ కూడా ఇవ్వటానికి నిర్ణయించామని హిదాయత్ తెలిపారు. ప్రాథమిక విద్యలో డ్రాపవుట్స్‌ను తగ్గించడం కోసం వచ్చే విద్యా సంవత్సరం నుండి 3, 5, 8వ తరగతి విద్యార్థులకు వారు కోరుకున్న కార్పొరేట్ స్థాయి పాఠశాలల్లో కూడా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ తరపున ఫీజు చెల్లిస్తామని, జిల్లాకు మొదటి దఫాగా వంద మంది చొప్పున కేటాయించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంతేకాకుండా చదువుకున్న నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించడం కోసం మార్చి 24, 25 తేదీల్లో గుంటూరులోని ఆర్‌విఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నామని, ఈ జాబ్‌మేళాకు దేశంలోనే ప్రసిద్ధిగాంచిన 50 కంపెనీలు తమ సంస్థల్లో వివిధ స్థాయిలో ఉద్యోగావకాశాలు కల్పిస్తాయని చెప్పారు. రాష్టవ్య్రాప్తంగా 25 ప్రాంతాల్లో రెసిడెన్షియల్ స్కూళ్లను మైనార్టీ వర్గాల కోసం సిఎం చంద్రబాబు నాయుడు కేటాయించారని, ఈ నూతన స్కూళ్లని రాష్టవ్య్రాప్తంగా ఏర్పాటు చేయబోతున్నామని ఆయన వివరించారు.

వర్శిటీల్లో బోధకులను నేరుగా ఎంపిక చేయాలి
బెంజిసర్కిల్, ఫిబ్రవరి 23: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేషన్ ప్రొఫెసర్లను నేరుగా ఎంపిక చేయాలని భారతీయ జనతా యువమోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు రమేష్‌నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో యువమోర్చా ఆధ్వర్యంలో గురువా రం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఉన్న బోధనా సిబ్బంది ఎంపిక పోటీ పరీక్ష ద్వారా జరపాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. గతం లో వౌఖిక పరీక్షల ద్వారా ఎంపిక చేసేవారని, ఇప్పుడు కూడా ఆ విధానంలోనే ఎంపిక జరగాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 1.40 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. వీటిలో 30వేల టీచర్ ఉద్యోగాలు, ఆరోగ్యశాఖలో 7వేల ఉద్యోగాలు, రెవెన్యూ శాఖలో 6వేల ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారు. క్లాస్ ఫోర్ ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్ ద్వారా నింపుతున్నారని, కాని ఉపాధ్యాయ, హెల్త్ ఉద్యోగులను మాత్రం కాంట్రాక్టు పద్ధతిన ఎంపిక చేయడం సరికాదని, పర్మినెంట్‌గా ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు లెక్చరర్లను పర్మనెంట్ చేస్తామని గతంలో చంద్రబాబు హామీ ఇచ్చారని, ఆ హామీని నిలబెట్టుకోవాలన్నారు. ఎలాంటి అజెండా లేని పార్టీలు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ, బిజెపి, టిడిపి ప్రభుత్వాలను విమర్శిస్తున్నాయని, ప్రజలు వాటిని నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. రాష్ట్రంలో ఉన్న రాజకీయ శూన్యతను అందిపుచ్చుకునేందుకు వైఎస్‌ఆర్ సిపి, జనసేన పార్టీలు ప్రజలను సెంటిమెంటు ఉచ్చులోకి లాగి రాజకీయం చేస్తున్నాయన్నారు. రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ ఇచ్చిన నిధులు, నెరవేర్చిన హామీలపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. విలేఖరుల సమావేశంలో యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిక్కాల రజనీకాంత్, నగర యువమోర్చా అధ్యక్షుడు రవీంద్రరెడ్డి పాల్గొన్నారు.