విజయవాడ

మహాశివరాత్రికి శైవపీఠాలు ముస్తాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, ఫిబ్రవరి 23: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నగరంలోని శైవపీఠాలు అంగరంగ వైభవంగా ముస్తాబయ్యాయి. రానున్న భక్తులకు వౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే నగరంలోని శివాలయాల్లో వేడుకలు ప్రారంభయ్యాయి. ప్రత్యేకంగా కృష్ణా నదీతీరం వెంబడి ఉన్న శైవపీఠాలకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్న కారణంగా జిల్లా దేవాదాయ ధర్మాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ, తనిఖీ అధికారి ఎ సుజన్‌కు వెంటబెట్టుకొని గురువారం సాయంత్రం శివాలయాలను తనిఖీ చేసి సిబ్బందికి సూచనలు చేశారు. నగరతంలో అత్యంత పురాతమైన శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానం (పాతశివాలయం)లో ఇవో కెవియన్‌డికె ప్రసాద్ ఆధ్వర్యంలో సిబ్బంది ఏర్పాట్లు పూర్తిచేశారు. పవిత్ర స్నానాలు ఆచరించిన తర్వాత భక్తులు ఈ ఆలయానికే ఎక్కువగా వచ్చే అవకాశం ఉండటంతో క్యూమార్గాలను ఏర్పాటు చేయటం, మంచినీటి సౌకర్యం, భోజన సదుపాయం, చెప్పుల స్డాండ్ ఉచితంగా ఇచ్చేందుకు ఏర్పాటు చేశారు. శుక్రవారం వేకువ జామున 2గంటల నుండే భక్తులకు స్వామిని దర్శించుకునే ఏర్పాట్లు చేశారు. ప్రకాశం బ్యారేజీ ఎదుట ఉన్న శ్రీ విజయేశ్వరస్వామి దేవస్థానంలో కమిటీ చైర్మన్ వెలంపల్లి సూర్యనారాయణ ఆదేశాలతో పర్యవేక్షణాధికారి శేషు ఆధ్వర్యంలో ఏర్పాట్లు గురువారం మధ్యాహ్నానికే పూర్తి చేశారు. గవర్నపేట శ్రీకాశీవిశే్వశ్వర అన్నపూర్ణాదేవి దేవస్థానంలో ఇవో వై సీతారామయ్య ఆధ్వర్యంలో సీనియర్ గుమస్తా రమణ ఆధ్వర్యంలో క్యూమార్గాలు, ప్రసాదాలు పంపిణీ, మంచినీటి సౌకర్యం, ఆదనపుసిబ్బందిని ఏర్పాటు చేశారు. ఇదేవిధంగా పాతబస్తీ శ్రీ వసంత మల్లిఖార్జున స్వామి దేవస్థానం, గవర్నపేట కౌతావారి శివాలయం, భవానీపురం శివాలయం, కృష్ణలంక శివాలయం, ఇవో యల్ సత్యవతి ఆధ్వర్యంలో పెనమలూరు,చోడవరం, యనమలకుదురు అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో ఉన్న శివాలయం, పాతబస్తీ రాయల్ హోటల్ సెంటర్ సమీపంలో ఉన్న శ్రీ ధర్భేశ్వర శివాలయం, తదితర ఆలయాల్లో సకల పూర్తి చేశారు. దుర్గగుడి దత్తత ఆలయాలలో ఇవోఎ సూర్యకుమారి తనిఖీలు నిర్వహించి సిబ్బంది ఆదేశాలు జారీ చేశారు.

విమానాశ్రయం వద్ద నిషేధాజ్ఞలు
* 144వ సెక్షన్ విధింపు
విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 23: గన్నవరం విమానాశ్రయం, పరిసర ప్రాంతాల్లో 144వ సెక్షన్ అమలు చేస్తూ నగర పోలీసు కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా 144సెక్షన్ విధిస్తున్నట్లు సీపి తెలిపారు. గన్నవరం ఎయిర్‌పోర్టు పరిధిలో 55రోజుల పాటు ఈనెల 25వ తేదీ నుంచి ఏప్రిల్ 20వ తేదీ వరకు ఈసెక్షన్ అమల్లో ఉంటుందని, అందువల్ల 250 మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా అంతకుమించి ఎక్కువ మంది జనం గుమిగూడరాదని, కర్రలు, రాళ్ళు వంటివి పట్టుకు తిరగరాదని సూచించారు.
పరీక్ష కేంద్రాల వద్ద..
అదేవిధంగా నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో పరీక్ష కేంద్రాల వద్ద కూడా 144సెక్షన్ అమలు కానుంది. వన్‌టౌన్, కొత్తపేట, గవర్నర్‌పేట, సూర్యారావుపేట. సత్యనారాయణపురం, కృష్ణలంక, మాచవరం, పటమట, పెనమలూరు, ఉంగుటూరు, ఇబ్రహీంపట్నం, భవానీపురం, అజిత్‌సింగ్‌నగర్, నున్న పోలీస్టేషన్ల పరిధిలో మొత్తం 93 కేంద్రాల్లో ఈనెల 26వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నాం 12:30 గంటల వరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషనర్ ఆధ్వర్యాన ఏపిపిఎస్‌సి గ్రూప్-2 సర్వీస్ కమిషన్ స్క్రీనింగ్ పరీక్ష జరుగనుంది. ఈసందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా 144సెక్షన్ విధిస్తున్నట్లు సీపి తెలిపారు.