విజయవాడ

అలరించిన ఉయ్యాల, చేతిరాత నాటికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కల్చరల్), ఫిబ్రవరి 24: మూడు రోజుల వరుస సెలవుదినాల్లో ఆబాలగోపాలానికి కొంత ఊ రట కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, మహేశ్వరి ప్రసాద్ కామెడి క్లబ్, మహేశ్వరి ప్రసాద్ మెమోరియల్ నాటక కళాపరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరిగే ఆరవ జాతీయ స్థాయి ఆహ్వాన నాటిక పోటీలు శుక్రవారం రాత్రి హనుమంతరాయ గ్రంథాలయాలు ఎంతో కోలాహలంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పరిషత్ ఛైర్మన్ పిళ్లా మాధవరావు, గౌరవ సలహాదారు సుఖమంచి కోటేశ్వరరావు, కామెడీ క్లబ్ అధ్యక్షుడు గరికపాటి బాలగంగాధర తిలక్, వ్యవస్థాపక కార్యదర్శి రాంపిళ్ల మోహన కృష్ణ తమ తమ ప్రసంగాల్లో పోటీల వివరాలు తెలిపారు. గత ఆరేళ్లుగా నాటికల పోటీలు నాలుగేళ్లు ఏటా ఒకరికి పద్మశ్రీ రేలంగి వెంకట్రామయ్య అవార్డును ప్రదానం చేస్తున్నామన్నారు. ఈ నెల 26న రంగస్థల సినీ నటుడు జయప్రకాష్‌రెడ్డికి అందజేస్తున్నామన్నారు. ఉత్తమ, ద్వితీయ ప్రదర్శనలకు రూ.8 వేలు, 6 వేలు నగదు బహుమతి అందజేస్తామన్నారు. ఉత్తమ రచన, దర్శకత్వం, నటుడు, నటి, విలన్, హాస్యనటుడు, సహాయ నటు డు, నాటి ఉత్తమ రంగాలంకరణ, సం గీతం, ఆహార్యంకు ప్రత్యేక నగదు బ హుమతులు ఉంటాయన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన రాజర్షి, బ్రహ్మర్షి దైవజ్ఞ వాస్తు నిపుణుడు డాక్టర్ కె.అచ్చిరెడ్డిని గజమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన శివపూజా విధానం పుస్తకాన్ని ఆవిష్కరి స్తూ కళాకారులు కళల పట్ల తనకెంతో ప్రేమాభిమానాలు ఉన్నాయంటూ కళల ప్రోత్సాహంకు తన వంతు సహాయం అందించగలమన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహిళా విభాగం రాష్ట్ర ఛైర్మన్ మానేపల్లి లక్ష్మీకుమారి, సావిత్రి కళాపీఠం అధ్యక్షురాలు పరుచూరి విజయలక్ష్మి, తెదే నే తలు బంకా నాగమణి, కాంగ్రెస్ నాయకురాలు మరుపిళ్ల రమణమ్మ, మిమిక్రీ కళాకారుడు రాము ప్రసంగించారు. సభానంతరం పాతపాడు అభ్యుదయ ఆర్ట్స్ వారి ఉయ్యాల నాటక ప్రదర్శన జరిగింది. ఎంతకూ పిల్లలు పుట్టకపోవడంతో ఒక తల్లి మాతృప్రేమనందించానే ఆతృతతో ఉంటుంది. సరిగ్గా ఇదే సమయంలో ఆమె మామగారు వృద్ధాప్యంతో పిల్లాపాపలతో కాలక్షేపం చేయాలనే ఆశ. ఇలాంటి ఉద్విగ్వభరితమైన ఆవరణలో పిల్లలు పుట్టక ముందే ఉయ్యాల వేలాడదీస్తారు. ఇక పుట్టిన బిడ్డలు కన్నతల్లి ప్రేమానురాగాలకు దూరంగా పెరగడం ప్రమాదకరమని, ఇలాంటి వారిలో కాఠిన్యం ఎక్కువై నేర ప్రవృత్తి పెరిగే అవకాశం ఉందనే ఇతివృత్తంతో నాటిక నడుస్తుంది. రచన మత్యేంద్ర సర్వేపల్లి, దర్శకత్వం పిళ్లా నటరాజ్ కాగా వెంపటి రమేష్, అమృ త, పిల్లా నటరాజ్, కత్తి శ్యాం, ఏవి రా వు, హృదయరాజ్, శ్రీకన్య నటించారు.
ఇక వరికూటి శివ ప్రసాద్ రచించి, ఎల్.శంకర్ దర్శకత్వం వహించిన ఒంగోలు జనచైతన్య వారి చేతిరాత నాటిక ప్రధానంగా ‘‘జ్ఞానమనే కుంచెతో రాసుకుంటే జీవితం ఆనందమయం... అజ్ఞానమనే కుంచెతో రాసుకుటే ఆ జీవితం అంధకార బంధురమనే ఇతివృత్తంతో నడుస్తుంది. ఇందులో ఎల్ శంకర్, సిహెచ్ సుబ్బారావు, బి.పార్వతీశం, పి.్భద్రేశ్వరరావు, ఎల్.పద్మావతి నటించారు.