విజయవాడ

పవిత్ర స్నానాలు ఆచరించిన భక్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, ఫిబ్రవరి 24: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శుక్రవారం వేకువ జామున దుర్గఘాట్‌లో హర హర మహాదేవ శంబోశంకర అంటూ భక్తులు గరళకంఠునికి స్మరిస్తూ పవిత్ర స్నానాలు ఆచరించారు. దుర్గాఘాట్ స్నానాలు ఆచరించేందుకు అందరికీ అనుకూలంగా ఉండటంతో జిల్లాలోని వివిధ ప్రాంత ప్రజలతో పాటు నగర భక్తుల సంఖ్య తోడయింది. దీంతో దుర్గాఘాట్ భక్తులతో పోటెత్తింది. అటు జంగమదేవరులు, అటు బ్రాహ్మణులతో ఘాట్ నిండిపోయింది. భక్తుల రాకను ముందుగా అంచనా వేసిన అధికారులు పలు ఏర్పాట్లు చేశారు. పోలీసులు వినాయకుడి వద్ద నుండే వాహనాల రాకపోకలు రథం వైపు నిషేధించారు. ఇదేవిధంగా పాతబస్తీ బ్రాహ్మణ వీధిలో ముత్యాలమ్మ గుడి వద్దనే అన్ని వాహనాలను నిలిపేశారు. దూర ప్రాంతాల భక్తులు గురువారం సాయంత్రానికే నగరానికి చేరుకొని సమీప బంధువుల ఇళ్లలో ఉండి వేకువ జామునే పవిత్ర స్నానాలు ఆచరించేందుకు దుర్గాఘాట్‌కు చేరుకుని శంకర నామస్మరణ చేస్తూ భక్తితో పవిత్ర స్నానాలు ఆచరించారు. ఆచారాల ప్రకారం కొంతమంది బ్రాహ్మణులకు స్వయం పాకం, జంగమ దేవరులకు దానాలు చేశారు. శుక్రవారం వేకువ జామున 2గంటల నుండే ఘాట్‌లో స్నానాలు ఆచరించేందుకు సిబ్బంది భక్తులను అనుమతించారు. వేకువ జామున ప్రారంభమైన భక్తుల రద్ధీ ఉదయం 12గంటలకు వరకు కొనసాగింది. పవిత్ర స్నానాలు ఆచరించటానికి వచ్చిన పలు సేవ సంస్థలకు చెందిన కార్యకర్తలు వివిధ రూపాల్లో సేవలు అందించారు.

జూపూడి కృష్ణానది ఘాట్‌వద్ద భక్తుడి మృతి
ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 24: మండలంలోని కిలీసుపురం గ్రామస్థుడు అవనిగడ్డ వెంకటేశ్వర్లు(21) స్నానాల ఘాట్‌వద్ద స్నానం చేస్తూ నీటిలో మునిగి చనిపోయిన సంఘటన శుక్రవారం జరిగింది. పోలీసుల సమాచారం ప్రకారం కిలీసుపురం గ్రామానికి చెందిన ఆర్‌టిసి డ్రైవర్ లక్ష్మణరావు కుమారుడు అవనిగడ్డ వెంకటేశ్వర్లు జూపూడి కృష్ణానది రేవులో స్నానానికి దిగి నీరు లోతుగా ఉండటంతో మునిగి మృతి చెందాడు. శవాన్ని బయటకుతీసి తహశీల్దార్ ఇంతియాజ్ బాషా సమక్షంలో శవాన్ని శవపరీక్షకై విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సిఐ చౌహన్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఎస్‌ఐ కేసు దర్యాప్తు చేస్తున్నారు.