విజయవాడ

హరహర మహాదేవ శంభోశంకర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, ఫిబ్రవరి 24: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శుక్రవారం జిల్లా, నగరంలోని అన్ని శైవపీఠాలకు భక్తులు తరలివచ్చి హర హర మహాదేవా శంభోశంకర అంటూ శివనామస్మరణ చేస్తూ దేవాదేవునికి అభిషేకాలు, అర్చనలు, విశేష పూజలు భక్తితో నిర్వహించుకున్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన మల్లేశ్వరస్వామి సన్నిధితోపాటు అన్ని శివాలయాలకు భక్తులు అధికంగా వచ్చారు. పాతబస్తీలోని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానం (పాతశివాలయం)కు భక్తులు వేకువ జామునే తరలి వచ్చారు. ఇవో కెవియన్‌డికె ప్రసాద్ ఆదేశాలతో ప్రధాన అర్చకుడు రాచకొండ సుమంత్‌శర్మ ఆధ్వర్యంలో స్వామికి మహాన్యాస ఏకదశ రుద్రాభిషేకాన్ని నిర్వహించి తెల్లవారుజాము 2గంటల నుంచే స్వామి దర్శనానికి భక్తులను అనుమతించారు. అర్చకులు రాచకొండ నాగరాజుశర్మ, రాఘవేంద్రశర్మ (లారా) స్వామికి మహాన్యాస ఏకదశ రుద్రాభిషేకాలు, అర్చనలు, విభూది అర్చనలు, విశేష పూజలు భక్తితో నిర్వహించారు. దేవస్థానం ఇవో కెవియన్‌డికె ప్రసాద్ ఆదేశాలతో సిబ్బంది క్యూమార్గాలను ఆలయం నుండి కెనాల్‌రోడ్ వరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయటంతో స్నానాలు ఆచరించిన భక్తులు నేరుగా స్వామివారి సన్నిధికి చేరుకున్నారు. భక్తులు స్వామికి 3గంటలపాటు అభిషేకాలు, అర్చనలు, విశేష పూజలు భక్తితో నిర్వహించుకున్నారు. వేకువజామున 2గంటటలకు ప్రారంభమైన భక్తుల రద్ధీ మధ్యాహ్నం 2గంటలకు వరకు కొనసాగింది. పలువురు విఐపిలు స్వామిని దర్శించుకున్నారు. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు ఇవో కెవిడియన్‌డికె ప్రసాద్ ఆధ్వర్యంలో ఉదయం 9గంటల నుండి సాయంత్రం 5గంటలకు భారీగా భక్తులకు అన్నదానం చేశారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన మల్లేశ్వరస్వామిని దర్శించుకోవటానికి భక్తులు పోటెత్తారు. ఉదయం 6గంటలకు ప్రారంభమైన భక్తుల రద్ధీ మధ్యాహ్నం 1గంటల కొనసాగింది. ఆలయాధికారులు ముందుగానే ఏర్పాట్లు చేయటంతో భక్తులు క్యూమార్గాల గుండా స్వామిసన్నిధికి చేరుకొని పూజలు చేశారు. అర్జునుడు స్వయంగా ప్రతిష్ఠించిన పరమేశ్వరునికి దర్శించుకోవటానికి భక్తులు వేకువజామునే వచ్చారు. దేవస్థానం కమిటీ చైర్మన్ వెలంపల్లి సూర్యనారాయణ ఆదేశాలతో పర్యవేక్షాధికారి శేషు ముందుగానే క్యూమార్గాలను ఏర్పాటు చేయటంతో పవిత్రస్నానాలు ఆచరించిన భక్తులు నేరుగా స్వామిని దర్శించుకోవటానికి వచ్చారు. తెల్లవారు జామున 5గంటలకు ప్రారంభమైన భక్తుల రద్ధీ మధ్యాహ్నం 1గంట వరకు కొనసాగింది. భారీగా ప్రసాదాలను పంపిణీ చేశారు. గవర్నపేట చల్లపల్లి బంగ్లా సెంటర్‌లోని శ్రీ కాశీ అన్నపూర్ణాదేవి దేవస్థానంలో కొలువైన స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. దేవస్థానం ఇవో వై సీతారామయ్య ఆదేశాలతో సీనియర్ గుమస్తా రమణ క్యూమార్గాలను ఏర్పాటు చేయటంతో భక్తులు స్వామిని ప్రశాంతమైన వాతావరణంలో దర్శించుకున్నారు. పాతబస్తీలోని గంగాసమేత వసంత మల్లిఖార్జున స్వామి దేవస్థానం (బుద్దావారిగుడి)లో కొలువైన స్వామిని దర్శించుకోవటానికి భక్తులు తరలి వచ్చారు. వేకువ జామున 5గంటలకు ప్రారంభమైన భక్తుల రద్ధీ మధ్యాహ్నం 1గంట వరకు కొనసాగింది. మాజీ ధర్మకర్తలు పొట్నూరి దుర్గాప్రసాద్, అడ్డూరి లక్ష్మణరావు, వ్యాపారవేత్త పొట్నూరి చిన్నా, యన్‌యస్‌ఆర్ స్వామిని దర్శించుకున్నారు. ఇవో యల్ సత్యవతి పర్యవేక్షణలో ఉన్న పెనుమలూరు శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానం, చోడవరం సోమేశ్వరస్వామివారి దేవస్థానం, యనమలకుదురు శ్రీకనకదుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో ఉన్న శివాలయం, తదితర శివాలయాలకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి భక్తితో అభిషేకాలు నిర్వహించుకున్నారు. వేకువ జామున ప్రారంభమైన భక్తుల రద్ధీ మధ్యాహ్నం 1గంట వరకు కొనసాగింది. పాతబస్తీ రాయల్ హోటల్ సెంటర్ సమీపంలోనా శ్రీ ధర్భేశ్వరస్వామి దేవస్థానంలోకొలువైన స్వామిని దర్శించుకోవటానికి భక్తులు భారీగా వచ్చారు. పాతబస్తీ కెనాల్‌రోడ్‌లోని శ్రీ బ్రహ్మచారి బావాజీ మఠం ప్రాంగణంలోకొలువైన పరమేశ్వర దర్శనానికి భక్తులు భారీగా వచ్చారు. మఠం ఫిట్‌పర్సన్ యద్ధనపూడి శివరామయ్యనాయుడు ఆదేశాలతో సిబ్బంది గోగినేని కృష్ణ, భాస్కర్‌నాయుడు, నాగరాజు కార్యక్రమాలను పర్యవేక్షించి భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. స్వామి దర్శనానికి అధిక సంఖ్యలో మార్వాడీ భక్తులు వచ్చారు. కృష్ణలంక శివాలయాలకు సైతం భక్తులు వచ్చి స్వామిని దర్శించుకున్నారు.

శివభక్తులతో పోటెత్తిన యనమలకుదురు కొండ
పెనమలూరు, ఫిబ్రవరి 24: ప్రముఖ శైవక్షేత్రమైన యనమలకుదురు శ్రీపార్వతి రామలింగేశ్వరస్వామి వారి ఆలయం శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా భక్తులతో పోటెత్తింది. కొండపైన వున్న ఆలయ ప్రాంగణంతో వేకువజాము నుంచే వేలాది భక్తుల శివనామ స్మరణతో మర్మోగింది. కొంత కింది ప్రాంతం నుండి బారికేడ్లు ఏర్పాటు చేసి క్యూలైన్ల ద్వారా దేవాలయంలోకి భక్తులను అనుమతించారు. రాష్ట్ర జలవనరులశాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఉదయం 11 గంటలకు యనమలకుదురు వచ్చారు. ఆలయ కార్యనిర్వహణాధికారి యన్.్భవాని మంత్రిని ఆలయ సంప్రదాయాలతో లోనికి తీసుకువెళ్ళి ప్రత్యేక పూజలు చేయించారు. గ్రామంలో ఉదయం 11 గంటలకు మండపం వద్ద దేవస్థాన ప్రభకు నిర్వహించిన వేలం పాటలో పెద్దఎత్తున భక్తుల పాల్గొనగా గ్రామానికి చెందిన సుబ్బారావు 2.6 లక్షలకు చేజిక్కించుకున్నారు. సాయంత్రం నుండి గ్రామంలో భక్తులు ఏర్పాటు చేసిన 50 ప్రభలు కొండచుట్టు చేపట్టిన ప్రదక్షిణ కార్యక్రమం వైభవంగా జరిగింది. రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించిన ప్రభల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శివరాత్రి సందర్భంగా కృష్ణా నదీతీర ప్రాంతాలైన యనమలకుదురు, పెదపులిపాక, చోడవరం ఘాట్లతో ఆయా గ్రామ పంచాయతీ అధికారులు పిండ ప్రదానానికి ఏర్పాటు చేశారు. గజ ఈతగాళ్ళు పడవలను సైతం సిద్ధం చేసి ఉంచగా పెద్దఎత్తున భక్తులు తమ పూర్వీకులకు కార్యక్రమాలను నిర్వహించారు. శాంతిభద్రతల పర్యవేక్షణలో ముగ్గురు డిఎస్‌పిలు, ఆరుగురు సిఐలు, 26 మంది ఎస్‌ఐలు, 300 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.