విజయవాడ

అందరికీ అర్థయ్యేలా విఎంసి వెబ్‌సైట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), మార్చి 9: నగర ప్రజలందరికీ అర్థమయ్యేలా విఎంసి వెబ్‌సైట్‌ను రూపొందించాలని కమిషనర్ వీరపాండియన్ సూచించారు. గురువారం ఉదయం విఎంసి ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న కమాండ్ కంట్రోల్ రూమ్ నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన రూమ్‌లోని టివి స్క్రీన్ లో విఎంసి వెబ్‌సైట్‌ను ఓపెన్ చేశారు. కనెక్ట్ అవ్వగానే విఎంసి డాష్‌బోర్డు ఓపెన్ అయ్యేలా చూడటంతోపాటు రెవెన్యూ, డి అండ్ ఓ లైసెన్స్ వివరాలను ఆకర్షనీయంగా మార్పులు చేయాలన్నారు. పన్ను వివరాలను నేరుగా వీక్షించే విధంగా మాడ్యుల్ ను రూపొందించాలన్నారు. కంట్రోల్ రూమ్‌కు వచ్చిన ఫిర్యాదులు, పరిష్కారం లతోపాటు కంట్రోల్ రూమ్ స్క్రీన్ ద్వారా నగరంలో ఏర్పాటుచేసిన సిసి కెమెరాల పుటేజీలను వీక్షించేలా ఫుల్‌స్క్రీన్, జూమింగ్ అప్షన్‌లను పొందుపర్చాలన్నారు. స్మార్ట్ నగరంగా అభివృద్ధి చేస్తున్న ప్రక్రియలో భాగంగా అమలుచేస్తున్న స్మార్ట్ లైటింగ్, స్మార్ట్ ట్రాన్స్ పోర్టేషన్, స్మార్ట్ ఎన్విరాన్‌మెంట్, స్మార్ట్ పార్కింగ్ తదితర సిసి పుటేజీలన్నీ కనిపించేలా రూపుదిద్దాలని సూచించారు. ఈకార్యక్రమంలో ఎస్‌ఇ జెవి రామకృష్ణ, ఇఇ ఉదయకుమార్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

‘ఎస్‌ఆర్‌ఎం’లో ఈ ఏడాదే అడ్మిషన్లు
విజయవాడ, మార్చి 9: ఏపి సిఆర్‌డిఏ కార్యాలయంలో గురువారం ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీ్ధర్‌తో ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం ప్రతినిధులు సమావేశమయ్యారు. తమ యూనివర్శిటీ క్యాంపస్ మాస్టర్ ప్లాన్‌పై ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ ఏడాది 6.75 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న అకడమిక్ బ్లాక్‌లు, హాస్టల్స్, ఫ్యాకల్టీ క్వార్టర్ల వివరాలను తెలియజేశారు. ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయంలో తొలిదశలో భాగంగా జూలైలో 4 బ్రాం చీల్లో 550 మంది విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చి కార్యకలాపాలు ప్రారంభిస్తామని ప్రతినిధులు తెలిపారు. ఎస్‌ఆర్‌ఎం ఆర్కిటెక్టులు క్యాంపస్ భవన నిర్మాణం వివరాలను వివరించారు. సిఆర్‌డిఏ ఎకడమిక్ డెవలప్‌మెంట్ విభాగం డైరెక్టర్ వై నాగిరెడ్డి, ఎస్‌ఆర్‌ఎం ప్రెసిడెంట్ సత్యనారాయణన్, రిజిస్ట్రార్ సేతురత్నం, ప్రో చాన్సలర్ నారాయణరావు, జానకిరామన్, తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.