విజయవాడ

జిల్లాలో ఉపాధి హామీ పనులు వేగవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 13: జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ పనులు వేగవంతం చేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ బాబు ఎ ఆదేశించారు. సోమవారం నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాలో ఉన్న ఎమ్మార్వోలు, ఎంపిడివోలు పాల్గొన్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద నిర్దేశించుకున్న లక్ష్యాలను అధిగమించేందుకు అధికారులందరూ ప్రయత్నించాలని తెలిపారు. ఇటీవల పెనుగంచిప్రోలు ఏరియాలో ఉపాధి పనులు దొరక్క ప్రజలు 25 కి.మీటర్ల దూరం వెళ్ళారనే వార్తలు వచ్చాయని, అలా ఎందుకు జరిగిందని అధికారులను ప్రశ్నించారు. స్థానికంగానే పనులను కల్పించాల్సిన అవసరం స్థానిక పంచాయతీ, మండల అధికారులపై ఉందని తెలిపారు. ఆ విధంగా పనులు ప్రారంభించకపోతే ఉపేక్షించేది లేదని అధికారులకు కలెక్టర్ సూచించారు. సిఎం చంద్రబాబు ప్రాధాన్యసారం పనులు అనుకున్న విధంగా చేపట్టాలని, సోషల్ ఆడిట్ పేరుతో పనులు ప్రారంభించడాన్ని జాప్యం చేస్తే సహించేదిలేదన్నారు. జిల్లాలో చాట్రాయి మండలంలో తక్కువగా 25 శాతమే పనులు జరిగాయని, దానిని పెంచాల్సిన అవసరం ఉందని అక్కడి మండల అధికారులకు సూచించారు. సోషన్ ఆడిట్ అనేది పనులు జరగడానికి పెట్టారని, అది అవోధం కాదని తెలిపారు. ఫిల్డ్ అసిస్టెంట్స్ సకాలంలో పనిచేసేలాగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఒక ఉద్యం లాగా ఉపాధి హామీ పనులు జిల్లాలో వేగంగా జరగాలని తెలిపారు. ఫీల్డ్ అసిస్టెంట్స్ ఎవరైనా పని చేయకపోతే ఆ ప్రాంతంలో వేరే వారికి అప్పగించి పనులు వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో 66.58 శాతం పనులు చేసి మొదటి స్థానంలో నిలిచిన ఆగిరిపల్లి అధికారులతో మాట్లాడుతూ టార్గెట్‌ను అధిగమించేలా పనులు పెంచాలని వారికి సూచించారు. రాబోయే 3 నెలల కాలంలో ఉపాధి హామీ పనులు ఉద్ధృతంగా జిల్లాలో చేపట్టాలని, అధికారులు అలసత్వం వీడాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రత్యేకంగా ఉపాధి హామీ పనులపై దృష్టి పెట్టాలరన్నారు. అదే విధంగా ప్రతి వారం విధగా దీనిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారని తెలిపారు. కాలనీల్లో సిసి రోడ్లు, అంగన్‌వాడీ భవనాలు మార్చి 20 నాటికి పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
లక్కీగ్రాహక్ యోజనలో విజేత పుల్లమ్మ
ప్రధాన మంత్రి లక్కీ గ్రాహక్ యోజనలో భాగంగా దేశ వ్యాప్తంగా నిర్వహించే లక్కీడ్రాలో కృష్ణాజిల్లా వత్సవాయి మండలం తళ్ళూరు గ్రామానికి చెందిన వృద్ధాప్య పించన్‌దారు కంచర్ల పుల్లమ్మ నగదు రహిత లావాదేవీలు నిర్వహించినందుకు తన బ్యాంక్ ఖాతాలో లక్ష రూపాయలు జమ అయ్యాయని జిల్లా కలెక్టర్ బాబు ఎ అధికారుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.