విజయవాడ

ఇళ్ల తొలగింపునకు రంగం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, మార్చి 14: దుర్గగుడి అభివృద్ధిలో భాగంగా మూడో విడత ఇళ్లు తొలగించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. చంద్రశేఖర్ అజాద్ దుర్గగుడికి ఇన్‌చార్జ్ ఇవోగా ఉన్న సమయంలో గట్టు వెనుక, మల్లిఖార్జున పేట, విశే్వశ్వరస్వామి ఆలయం ప్రాంతాల్లోని ఇళ్ల యజమానులకు నష్టపరిహారం ఇచ్చారు. రెండు విడతలుగా తొలగించిన ఇళ్లకు అధికారులు సుమారు రూ.200కోట్ల మేరకు నష్టపరిహారం చెల్లించారు. మల్లిఖార్జునపేటలోని వాటర్ ట్యాంక్ రోడ్ నుండి అడపా రాములు నగరపాలక సంస్థ పాఠశాల వరకు ఉన్న ఇళ్లను తొలగించాలని నిర్ణయం తీసుకొని ఈమేరకు భవిష్యత్‌లో తొలగించనున్న ఇళ్లకు సంబంధించి మార్కింగ్ పెట్టారు. ఇవోగా సూర్యకుమారి వచ్చిన తర్వాత తాత్కాలికంగా ఇళ్ల తొలగింపును వాయిదా వేశారు. దీంతో వాటర్ ట్యాంక్ రోడ్, సక్కూరి గోపాలరావువారి వీధిలోని ఇళ్ల యజమానులు కొంతమేరకు ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా శ్రీ మల్లేశ్వరస్వామి దేవస్థానాన్ని అభివృద్ధి చేసేందుకు ఇవో శ్రీకారం చుట్టారు. అలాగే స్వామి సన్నిధి, మెట్లమార్గం ఆధునీకరణకు సుమారు రూ.5కోట్ల మేరకు అంచనాలు తయారుచేశారు. తాజాగా వాటర్ ట్యాంక్ రోడ్ ప్రారంభం నుండి అడపా రాములు నగర పాలక సంస్థ వరకు రోడ్‌కు ఎడమ వైపు ఉన్న ఇళ్లను తొలగించాలని నిర్ణయం తీసుకొని రెండు రోజుల నుండి మార్కింగ్ పెట్టిన ఇళ్లలకు సంబంధించిన పత్రాలను తీసుకోవటం ప్రారంభించారు. ఈమేరకు రూ.30కోట్ల వరకు నష్టపరిహారం చెల్లించేందుకు అధికారులు సిద్ధమైనట్లు తెలిసింది. ఈ ఇళ్లను తొలగిస్తే వాటర్ ట్యాంక్ రోడ్ ఎడమ వైపు మొత్తం స్థలం దుర్గగుడి స్వాధీనంలోకి వస్తుంది. ఈ తొలగింపును చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. గతంలో ఇళ్లను తొలగించి సేకరించిన స్థలాలను ఇప్పటివరకు అభివృద్ధి చేయలేదని, కొత్తగా ఇళ్లను తీసుకొని వాటిని కూడా ఇలాగే ఖాళీగా వదలిపెడతారనే విమర్శలు వినిపిస్తున్నాయి.