ఆంధ్రప్రదేశ్
వైఎస్ఆర్ సీపీ కార్పొరేటర్ల సస్పెన్షన్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 23 September 2016
విజయవాడ : విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో వైఎస్ఆర్ సీపీ కార్పొరేటర్లను సస్పెండ్ చేస్తున్నట్లు మేయర్ కోనేరు శ్రీధర్ ప్రకటించారు. శుక్రవారం ఉదయం సమావేశం ప్రారంభమైన వెంటనే కృష్ణా పుష్కర పనుల్లో చోటు చేసుకున్న అవకతవకలపై విచారణ జరపాలని వైఎస్ఆర్ సీపీ కార్పొరేటర్లు పట్టుబట్టారు. మేయర్ కోనేరు శ్రీధర్ ససేమిరా అన్నారు. దీంతో ఆగ్రహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్పొరేటర్లు మేయర్ పోడియం వద్ద బైఠాయించారు. మేయర్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో వైఎస్ఆర్ సీపీ కార్పొరేటర్లను సస్పెండ్ చేస్తున్నట్లు మేయర్ ప్రకటించారు. కౌన్సిల్ హాల్లోనే వైఎస్ఆర్ సీపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు.