రాష్ట్రీయం

ఓల్గాకు కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 17: ప్రముఖ స్ర్తివాద రచయిత్రి ఓల్గాకు కేంద్ర సాహిత్య అకాడమి ప్రధాన పురస్కారాన్ని ప్రకటించింది. ప్రతి ఏటా కేంద్ర సాహిత్య అకాడమి ప్రధాన పురస్కారంతో పాటు భాషా సమ్మాన్ అవార్డు, అనువాద అవార్డు, బాలసాహిత్య అవార్డు, యువ పురస్కారాలను అందజేస్తోంది. మిగిలిన అవార్డులను ఇప్పటికే ప్రకటించిన కేంద్ర సాహిత్య అకాడమి గురువారం నాడు ప్రధాన అవార్డును ప్రకటించింది. 23 భాషల్లో 23 మంది భారతీయ రచయిత, రచయిత్రులకు పురస్కారాలను ప్రకటించింది. తెలుగులో చిన్నకథల సంపుటి -విముక్తకు గానూ ఓల్గాకు ఈ పురస్కారాన్ని ప్రకటించినట్టు అకాడమి కార్యదర్శి డాక్టర్ కె. శ్రీనివాసరావు తెలిపారు.
ఓల్గా అసలు పేరు పోపూరి లలిత కుమారి. ఓల్గా 1950 నవంబర్ 27న గుంటూరులో జన్మించారు. 1972లో ఆంధ్రాయూనివర్శిటీలో తెలుగు సాహిత్యంలో ఎంఏ పూర్తిచేశారు. అనంతరం తెనాలి విఎస్‌ఆర్ ఎన్‌వీఆర్ కాలేజీలో 1973 నుండి 86 వరకూ అధ్యాపకురాలిగా పనిచేశారు. 1986 నుండి 1995 వరకూ ఉషాకిరణ్ మూవీస్‌లో ఆమె దాదాపు 15 సినిమాలకు పనిచేశారు. అనంతరం అస్మిత అనే పేరుతో స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి మహిళా హక్కులపై పోరాడారు. నేషనల్ బుక్ ట్రస్టు తెలుగు ప్యానల్‌లో సలహాదారుగా ఆమె సేవలు అందించారు. ఆమె రచించిన స్వేచ్ఛ , ఆకాశంలో సగం నవలలకు 1987, 1990లలో ఉత్తమ నవలా అవార్డులు దక్కాయి. స్ర్తిల సమస్యలపై పనిచేసినందుకు 1993లో ఆమె తెలుగు విశ్వవిద్యాలయం నుండి పురస్కారం అందుకున్నారు. ఆమె రచించిన ‘తోడు’ అనే సినిమా కథకు 1997లో నంది అవార్డు దక్కింది. 1999లో తెలుగు యూనివర్శిటీ నుండి ఉత్తమ రచయిత్రి అవార్డు కూడా పొందారు. ఆమె కలం నుండి జాలువారిన అనేక పుస్తకాల్లో ‘ఆకాశంలో సగం’ ప్రసిద్ధి చెందింది. ఈ ఏడాది పురస్కారాలు పొందిన వారిలో బ్రజేంద్ర కుమార్ బ్రహ్మ, ధీయన్ సింగ్, రాందర్శ మిశ్రా, కెవి తిరుమలేష్, క్షేత్రి రాజన్, రాం శంకర్ అవస్థి తదితర లబ్దప్రతిష్టులున్నారని శ్రీనివాసరావు తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు
స్ర్తివాద రచయిత్రి ఓల్గాకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపిక కావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.