హైదరాబాద్

ఒప్పందం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 10: మహానగర పాలక సంస్థ చెత్త తరలింపునకు, అధికారుల సౌకర్యార్థం వినియోగిస్తున్న వాహనాలకు వినియోగిస్తున్న డీజిల్‌ను నేరుగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి కొనుగోలు చేసేందుకు ఎట్టకేలకు ఒప్పందం కుదిరింది. కమిషనర్‌గా డా.బి. జనార్దన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు రెండు దఫాలుగా జరిగిన చర్చలు ఎట్టకేలకు ఫలించి జిహెచ్‌ఎంసి, ఐవోసి సంస్థల అధికారుల మధ్య గురువారం ఒప్పందం కుదిరింది. ఈ మేరకు పరస్పర అంగీకార పత్రాలపై ఉభయ సంస్ధలకు చెందిన ప్రతినిధులు, అధికారులు సంతకాలు చేశారు.
జిహెచ్‌ఎంసి తరపున చీఫ్ ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్ అనీల్‌రాజ్, ఐవొసి కార్పొరేట్ సేల్ విభాగం తరపున డిజిఎం కెఎంవిఎస్.రాజు ఈ అగ్రిమెంట్లపై కమిషనర్ జనార్దన్‌రెడ్డి సమక్షంలో సంతకాలు చేశారు. అంతేగాక, ఈనెల 17 నుంచి ఐవోసి జిహెచ్‌ఎంసికి డీజిల్‌ను అందించనున్నట్లు అధికారులు వెల్లడించారు. దీని వల్ల సంవత్సరానికి రూ.కోటి 58లక్షల వరకు ఆదా అవుతుందని వెల్లడించారు. ప్రతి రోజు సుమారు 30వేల లీటర్ల డీజిల్‌ను చెత్త తరలించే వాహనాలకు వినియోగిస్తున్నారు. ప్రస్తుతం బల్దియా కూపన్ల ద్వారా పెట్రోల్‌ను బంక్‌ల నుంచి సమకూర్చుకుంటుంది. పెట్రోల్ బంకుల ద్వారా కొనుగోలు చేయటం ద్వారా రూ 1.40పైసల రూపేణా పన్నుగా చెల్లించాల్సి వస్తుంది. అదే ఐవోసి నుంచి సమకూర్చుకుంటే పన్ను మినహాయింపు లభించటంతో రోజుకి రూ. 43వేలు చొప్పున ఆదా అయ్యే అవకాశముంది. తద్వారా సంవత్సరానికి రూ. కోటి 58లక్షల వరకు గ్రేటర్ నిధులు మిగిలిపోనున్నాయి. జిహెచ్‌ఎంసి వాహనాలకు నేరుగా డజిల్ అందించేందుకు సిద్దమైన ఐవోసి ఈ నెల 17వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా ఒక ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌కు డీజిల్ అందజేయనుంది. ఈ నెలాఖరులోగా మిగిలిన మరో రెండు ట్రాన్స్‌ఫర్ స్టేషన్లకు కూడా డీజిల్‌ను అందించే సౌకర్యాలు కలుగుతాయని ఐవోసి డిజిఎం కెఎంవి రాజు తెలిపారు. ప్రస్తుతం ట్రాన్స్‌ఫర్ స్టేషన్లలో ఉన్న బంకులను ఆధునీకరించటంతో పాటు వాటి నిర్వహణ కూడా తామే చేపట్టనున్నట్లు ఆయన వివరించారు.
అభివృద్ధికి సహకరించాలి
* కమిషనర్ జనార్దన్‌రెడ్డి
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా హైదరాబాద్ నగరంలో పౌరసేవల కల్పన, మెరుగుపరిచేందుకు ఐవోసి అధికారులు తమవంతు సహకారాన్ని అందించాలని కమిషనర్ జనార్దన్‌రెడ్డి కోరారు. నగరంలోని పబ్లిక్ టాయిలెట్ల కొరత తీవ్రంగా ఉందని, ప్రధాన ప్రాంతాల్లో టాయిలెట్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని ఆయన అన్నారు. ప్రతి ప్రైవేటు కంపెనీ లేదా సంస్థ తమకు ఆదాయంలో రెండు శాతం న ఇధులను సిఎస్‌ఆర్ కింద వినియోగించాలని తెలిపారు. స్వచ్ఛ్భారత్, స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం క్రింద ఈ టాయిలెట్లను ఏర్పాటు చేయాలని కోరారు. ఐవోసి కంపెనీ ద్వారా నగరంలో నిర్వహిస్తున్న అన్ని పెట్రోల్ బంకుల్లో తక్షణమే టాయిలెట్లను ఏర్పాటు చేయాలని సూచించారు. కాగా, కమిషనర్ విజ్ఞప్తిని ఉన్నతాధికారులతో చర్చిస్తామని ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటామని డిజిఎం రాజు తెలిపారు.