తెలంగాణ

ఓటుకు నోటు కేసులో హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తనపై ఏసీబీ విచారణను నిలిపివేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గురువారం ఉమ్మడి హైకోర్టులో క్వాష్ పిటిషన్ ను దాఖలు చేశారు. ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబుపై దర్యాప్తు చేయాలంటూ వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు చేయాలంటూ ప్రత్యేక కోర్టు ఆదేశించిందని, ఇప్పటికే ఈ కేసు దర్యాప్తులో ఉన్న నేపథ్యంలో మరో ఎఫ్‌ఐఆర్ జారీచేయాల్సిన అవసరం లేదని ఏసీబీ నివేదించింది. దర్యాప్తు పురోగతిని మెమో ద్వారా కోర్టు దృష్టికి ఏసీబీ తెచ్చింది.