మహబూబ్‌నగర్

ఎమ్మెల్సీ ఎన్నికల్లో 1262 ఓట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, డిసెంబర్ 11: జిల్లాలో ఈ నెల 27వ తేదిన జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం ఓట్లు 1262గా ఎన్నికల అధికారులు నిర్థారించారు. అయితే ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు జిల్లా వ్యాప్తంగా 1259 ఓట్లు ఉండేవి. ఇటివల మూడు ఎంపిటిసి ఎన్నికలకు పోలింగ్ జరిగి ఫలితాలు వెల్లడాయ్యాయి. అందులో నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోని బిజినేపల్లి మండలం కారుకొండ ఎంపిటిసిగా రుక్కాలి గెలుపొందారు. అదేవిధంగా వనపర్తి నియోజకవర్గం ఖిల్లాఘన్‌పూర్ మండలం ఎంపిటిసిగా దుడ్ల మణెమ్మ గెలుపొందారు. దేవరకద్ర నియోజకవర్గంలోని గురుకొండ ఎంపిటిసిగా దాసరి లక్ష్మమ్మ గెలుపొందారు. దింతో ఎన్నికల కమీషన్ ఈ ముగ్గురు ఎంపిటిసిలకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గత రెండు రోజుల క్రితమే ఓటు హక్కును కల్పిస్తూ ఎన్నికల వెబ్‌లో ఉంచారు. దింతో జిల్లా వ్యాప్తంగా 1262 మంది స్థానిక సంస్ధల ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవడానికి వీలు ఉంది. అందులో 982 ఎంపిటిసిలకు ఓటు హక్కు ఉండగా 64 మండలాల జడ్పిటిసిలకు ఓటు హక్కు ఉంది. మహబూబ్‌నగర్, షాద్‌నగర్, నారాయణపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల, అయిజ, కల్వకుర్తి మున్సిపాలిటీలలోని 206 మంది కౌన్సిలర్లకు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో మున్సిపాలిటీలకు సంబంధించిన ఎమ్మెల్యేలకు మాత్రమే ఓటు హక్కు ఉంది. ఓటు హక్కు కలిగిన ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, రాజేందర్‌రెడ్డి, అంజయ్యయాదవ్, వంశీచంద్‌రెడ్డి, మర్రిజనార్థన్‌రెడ్డి, చిన్నారెడ్డి, డికె అరుణ, సంపత్‌కుమార్లకు ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోవడానికి వీలు లేనివారిలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, రాంమోహన్‌రెడ్డి, ఆలవెంకటేశ్వర్‌రెడ్డి, గువ్వల బాలరాజులకు అవకాశం లేకుండా పోయింది. వీరు ప్రాతినిథ్యం వహించే నియోజకవర్గాల పరిధిలో మున్సిపాలిటీలు లేని కారణంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కు ఉండదని నిబంధన. కాగా మహబూబ్‌నగర్ ఎంపి జితెందర్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ ఎంపి నంది ఎల్లయ్యలకు ఈ ఎన్నికల్లో ఓటుహక్కు ఉంది. ఏది ఎమైనప్పటికిని ఎమ్మెల్సీ ఎన్నికలను సాజావుగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటి నుండే కసరత్తు చేస్తుంది.