విశాఖపట్నం

రూ.10,340 కోట్లతో జిల్లా వార్షిక రుణ ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 22: 2016-17 ఆర్ధిక సంవత్సరానికి రూ.10,340 కోట్లతో జిల్లా వార్షిక ప్రణాళిక ఖరారైంది. ప్రాధాన్యతా రంగానికి రూ.7,840 కోట్లు, ప్రాధానే్వతర రంగానికి రూ.2500 కోట్లను కేటాయిస్తూ రూపొందించిన ఈ ప్రణాళికను కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ మంగళవారం విడుదల చేశారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన బ్యాంకర్ల (డిస్ట్రిక్టు కన్సల్‌టేటివ్ కమిటీ) సమావేశంలో గత ఏడాది వార్షిక రుణ ప్రణాళిక అమలుతీరును, సాదించిన లక్ష్యాలను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది కంటే 26 శాతం ఎదుగుదలతో ప్రస్తుత వార్షిక రుణప్రణాళికను రూపొందించడమైందన్నారు. ప్రాధాన్యతా రంగానికి రూ.7,840 కోట్లు, ప్రాధానే్యతర రంగానికి రూ.2500 కోట్లను కేటాయించామన్నారు. ఇందులో వ్యవసాయ రంగానికి రూ.2,553 కోట్లు, పారిశ్రామిక రంగానికి రూ.2,150 కోట్లు, గృహ నిర్మాణానికి రూ.1330 కోట్లు, విద్యారంగానికి రూ.490 కోట్లు ఎగుమతి రంగానికి రూ.700 కోట్లను కేటాయించామన్నారు. వ్యవసాయ రంగానికి కేటాయించిన రూ.2553 కోట్లలో పంట రుణాలకు రూ.1450 కోట్లుగా నిర్ణయించడమైందన్నారు. నాబార్డు పాటెన్షియల్ క్రెడిట్ ప్లాన్ ఆధారంగా రూపొందించిన ఈ రుణ ప్రణాళికను సమర్ధవంతంగా అమలు చేసేందుకు బ్యాంకర్లు సంపూర్ణంగా సహకరించాలన్నారు. శాఖలవారీగా నిర్దేశించిన లక్ష్యాలకే పరిమితం కాకుండా బ్యాంకుల ద్వారా ప్రజలకు మరింత మేలు చేకూర్చేందుకు కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో బ్యాంకర్లు కూడా అధికారులకు పూర్తిస్థాయిలో మద్దతునివ్వాలన్నారు. గత ఏడాది వార్షిక రుణ ప్రణాళిక అమలుతీరును, సాధించిన లక్ష్యాలను ఆయన సమీక్షిస్తూ ప్రభుత్వం పలు రాయితీలపై మంజూరు చేసే యూనిట్లు పరిమితంగానే ఉంటాయని, అయితే లబ్దిదారులు పెద్దమొత్తంలో ఉంటారన్నారు. ఈ రెండింటి మద్య వ్యత్యాసాన్ని పూడ్చేందుకు లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా పెద్దఎత్తున రుణ సౌకర్యాలు కల్పించాలన్నారు. వ్యవసాయ యాంత్రీకరణకు రైతుల నుండి పెద్దఎత్తున డిమాండ్ ఉన్నప్పటికీ లక్ష్యంగా నిర్దేశించిన రూ.75 కోట్లలో కేవలం ఇప్పటి వరకు మూడు కోట్ల మేర రుణాలు మంజూరు చేయడంపై ఆయన అసంతృప్తిని వ్యక్తంచేస్తూ అందుకు కారణాలేమిటని అధికారులను నిలదీశారు. నిర్ణీత లక్ష్యాలను ఈ నెలాఖరులోపు సాదించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. డైరీ, పౌల్ట్రీ, గొర్రెలు, మేకలు పెంపకం యూనిట్లకు మార్కెట్‌లో పెద్దఎత్తున డిమాండ్ ఉందని, ఆయా యూనిట్ల మంజూరు అధిక ప్రాధాన్యతనివ్వాలన్నారు. అధికారులను, బ్యాంకర్లను ఆయన కోరారు. ఎస్సీ,ఎస్టీ, బిసి మైనారిటీస్ తదితర సంస్థల ద్వారా పలు రాయితీలపై మంజూరు చేసే యూనిట్లకు బ్యాంకర్ల సహకారం కొరవడం వలన సకాలంలో గ్రౌండ్ కావడంలేదని ఆయా సంస్థల అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్పందిస్తూ ఎస్‌ఎల్‌బిసి గైడ్‌లైన్లకు విరుద్ధంగా బ్యాంకర్లు ప్రవర్తించవద్దని, యూనిట్ల స్థాపనలో బ్యాంకర్లు అలక్ష్యం వహిస్తే క్రిమినల్ కేసులు పెట్టేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. ఐటిడిఏ పిఓ హరినారాయణన్ మాట్లాడుతూ మైదాన ప్రాంతాలతో పోల్చుకుంటే తమ ఏజేన్సీ ప్రాంతంలో రుణాల మంజూరుకు బ్యాంకర్లు అంతగా శ్రద్ధ చూపడం లేదని, లబ్ధిదారులు పలుమార్లు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ విసిగి వేసారిపోతున్నారని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. పలు యూనిట్ల మంజూరుకై రాయితీ సొమ్ముగా సుమారు ఆరు కోట్ల వరుకూ పలు బ్యాంకుల్లో జమ చేశామన్నారు. అయితే ఆయా బ్యాంకర్లు సకాలంలో స్పందించకపోవడం యూనిట్లు గ్రౌండ్ కావడం లేదన్నారు. అలాగే అనవసరంగా పలు బ్యాంకర్లు నోటరీ, ఎఫడవిట్ తదితర ధృవీకరణ పత్రాలను పొందుపర్చాలని లబ్ధిదారులను విసగిస్తూ పలుమార్లు బ్యాంకుల చుట్టూ తిప్పుకుంటున్నారన్నారు. కలెక్టర్ స్పందిస్తూ బ్యాంకు రుణఆల మంజూరు ఆలస్యం వలన యూనిట్లు సకాలంలో గ్రౌండ్ కాకపోతే అందుకు బ్యాంకర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని, అవసరమైతే క్రిమినల్ కేసుల కూడా పెట్టేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. మైదాన ప్రాంతాలతో సమానంగా ఏజెన్సీలో రుణాలు మంజూరు చేయాలని, అందుకు ఏజెన్సీ ప్రాంతానికి ప్రత్యేక లక్ష్యాలను నిర్ణయించి, శత శాతం అమలుపర్చాలని అధికారులను బ్యాంకర్లను ఆయన ఆదేశించారు. లీడ్ డిస్ట్రిక్టు మేనేజర్ డి.శరత్‌బాబు మాట్లాడుతూ గత ఏడాది వార్షిక రుణ ప్రణాళిక రూ.8.198 కోట్ల లక్ష్యంతో రూ.78880 కోట్ల మేర రుణాలు మజూరు చేసి 96 శాతం లక్ష్యాలను సాధించామన్నారు. వచ్చే ఏడాది వార్షిక రుణ ప్రణాళికను సమర్ధవంతం అమలుపర్చేందుకు బ్యాంకర్లు, అధికారులు పూర్తిస్థాయిలో సహకరించాలన్నారు. జెసి-2 డివి రెడ్డి, నాబార్డు ఏజిఎం కె.ప్రసాదరావు, ఆర్‌బిఐ ఎల్‌డిఓ డిఆర్‌డిఏ సత్యసాయి శ్రీనివాస్, యుసిడి పిడి శ్రీనివాస్, గృహనిర్మాణ సంస్థ పిడి ప్రజాస్ డిఐసి బి.గోపాలకృష్ణ, వ్యవసాయశాఖ, ఉద్యానవన శాఖ సంయుక్త సంచాలకులు తదితరులు పాల్గొన్నారు.