బిజినెస్

అమెరికా నుంచి హాంకాంగ్‌కు సముద్ర గర్భంలో సూపర్ హైస్పీడ్ కేబుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, అక్టోబర్ 14: అమెరికాలోని లాస్ ఏంజెల్స్ నగరం నుంచి హాంకాగ్ వరకు సముద్ర అంతర్భాగంలో దాదాపు 8 వేల కిలోమీటర్ల పొడవైన సూపర్ హైస్పీడ్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్‌ను ఏర్పాటు చేసేందుకు అంతర్జాతీయ ఐటి దిగ్గజ సంస్థలు గూగుల్, ఫేస్‌బుక్ కలసికట్టుగా కృషి చేస్తున్నాయి. సెకనుకు 120 టెరాబైట్ల బ్యాండ్‌విడ్త్‌ను కలిగి ఉండే ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ అమెరికా, ఆసియా మధ్య అత్యంత అధిక సామర్ధ్యం కలిగిన కేబుల్‌గా నిలువనుందని గూగుల్ సంస్థ చెబుతోంది. ఇంటర్నెట్ వేగం పరంగా ప్రపంచంలో ప్రస్తుతం అత్యధిక సామర్ధ్యం గల కేబుల్‌ను కలిగివున్న సంస్థల్లో గూగుల్ కూడా భాగస్వామిగా ఉంది. అయితే దీనితో పోలిస్తే గూగుల్, ఫేస్‌బుక్ సంయుక్తంగా ఏర్పాటు చేయనున్న కొత్త కేబుల్ రెట్టింపు వేగంతో పనిచేస్తుంది. దీని ద్వారా గూగుల్, ఫేస్‌బుక్ పసిఫిక్ సముద్రానికి ఆవల ఉన్న తమ వినియోగదారులకు అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను అందించేందుకు వీలవుతుంది. ఈ కేబుల్ మొత్తం సామర్ధ్యంలో కొంత భాగాన్ని తమ వద్దే అట్టిపెట్టుకుని మిగిలిన దానిని లీజుకు ఇవ్వాలని గూగుల్, ఫేస్‌బుక్ భావిస్తున్నాయి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలను ఆ సంస్థలు ఇంకా ప్రకటించలేదు.