విశాఖపట్నం

రెండు రోజుల పాటు ఢిల్లీలోనే జివిఎంసి కమిషనర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 12: మహా విశాఖ నగరపాలక సంస్థ (జివిఎంసి) కమిషనర్ ప్రవీణ్‌కుమార్ రెండు రోజుల పాటు దేశ రాజధాని ఢిల్లీలో గడపనున్నారు. ఈ నెల 14,15 తేదీల్లో ఢిల్లీలో జరిగే రెండు కీలక కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ సంస్థ నివేదిక మేరకు ఎనర్జీ కన్సర్వేషన్ అవార్డు 2015ను జివిఎంసి దక్కించుకుంది. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకూ విద్యుత్ ఆదా, ఖర్చు నియంత్రణకు సంబంధించి దేశ వ్యాప్తంగా జివిఎంసి అగ్రస్థానంలో నిలిచింది. పలు అంశాలు పరిగణలోకి తీసుకున్న సంస్థ జివిఎంసికి ఎనర్జీ ఎఫిషియెన్సీ అవార్డును ప్రకటించింది. హుదూద్ తుపాను అనంతరం విశాఖ నగర పరిధిలో ఎల్‌ఇడి లైట్లను ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ పొదుపునకు జివిఎంసి శ్రీకారం చుట్టింది. దాదాపు 45 నుంచి 50 శాతం వరకూ ఇంధన పొదుపుతో పాటు ఖర్చును నియంత్రించుకోగలిగింది. ఈ అవార్డును కేంద్ర ఇంధన శాఖ మంత్రి చేతుల మీదుగా కమిషనర్ ప్రవీణ్‌కుమార్ సోమవారం ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో అందుకోనున్నారు.
అలాగే స్మార్ట్‌సిటీల ప్రకటనకు సంబంధించి కేంద్రం ప్రకటించే తొలి 20 పట్టణాల జాబితాలో స్థానం దక్కించుకునేందుకు విస్తృత ప్రయత్నాలు చేస్తున్న జివిఎంసి అందుకు సంబంధించిన ప్రతిపాదనలు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు సమర్పించనుంది. దేశ వ్యాప్తంగా 100 పట్టణాలు స్మార్ట్‌సిటీ ఎంపికలో పాల్గొననున్నాయి. వీటిలో సరైన ప్రతిపాదనలతో వచ్చిన 20 పట్టణాలను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఎంపిక చేయనుంది. తొలి విడత 20 పట్టణాల్లో ఎంపికయ్యేందుకు అవసరమైన ప్రతిపాదనలతో జివిఎంసి కమిషనర్ ఇప్పటికే సిద్ధ మయ్యారు. గత రెండున్నర నెలల కాలంగా జివిఎంసి పరిధిలో స్మార్ట్ ప్రణాళికల తయారీ బాధ్యతను ఐబిఎం, అయికాం సంస్థలు చేపట్టాయి. కేంద్రం నిర్ధేశించిన నిబంధనల మేరకు నగరంలోని ఒక ప్రాంతాన్ని స్మార్ట్‌సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఆర్‌కె బీచ్ పరిసర ప్రాంతాల్లో సుమారు 1500 ఎకరాల పరిధిలో స్మార్ట్‌సిటీ రూపకల్పనకు సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే తయారు చేశారు. అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని, ఓటింగ్, సామాజిక మాధ్యమాల ద్వారా ఆర్‌కె బీచ్ ప్రాంతాన్ని ఎంపిక చేసిన జివిఎంసి యంత్రాంగం అందుకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్రానికి సమర్పించనుంది. ఈ ప్రతిపాదనలకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం లభించింది. రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉండి ఎనర్టీ ఎక్సలెన్సీ అవార్డును తీసుకోవడంతో పాటు, స్మార్ట్‌సిటీ ప్రతిపాదనలను కేంద్రానికి సమర్పించడంలో కమిషనర్ బిజీగా ఉన్నారు.