విశాఖపట్నం

దేవాదాయ భూముల స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 26: దేవాదాయ శాఖకు సంబంధించి ఆక్రమణకు గురైన విలువైన భూముల స్వాధీనానికి దేవాదాయ శాఖ ఉపక్రమించింది. దీనిలో భాగంగా నగరంలోని అల్లిపురం శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన టౌన్ సర్వే నెంబర్ 1450లోగల 600 చదరపుగజాల భూమిని చాలాకాలంగా ఆక్రమణదార్ల కబంధహస్తాల్లో చిక్కుకుంది. భూమికి సంబంధించి పూర్తి ఆధారాణలతో దేవస్థానం న్యాయస్థానంలో కేసు పెట్టగా, ఇటీవల దేవస్థానానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. న్యాయ స్థానం ఉత్తర్వల మేరకు సహాయ కమిషనర్ ఇవి పుష్పవర్ధన్ తన సిబ్బందితో ఆక్రమణకు గురైన భూమిని శనివారం స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఎప్పటి నుంచో విస్తరణకు నోచుకోకుండా ఉన్న వేంకటేశ్వర స్వామి దేవస్థానం తాజా పరిస్థితితో అభివృద్ధికి మార్గం ఏర్పడింది. స్వామి వారి ధ్వజస్తంభ ప్రతిష్టాప చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అలాగే దేవస్థానం కల్యాణ మండపాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా ఎసి పుష్పవర్ధన్ అధికారులను ఆదేశించారు.

ఎంపి హరిబాబుకు స్వాగతం
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మార్చి 26: భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపి కంభంపాటి హరిబాబుకు విశాఖ విమానాశ్రయంలో శనివారం ఘన స్వాగతం లభించింది. 134వ ఇంటర్నేషనల్ పార్లమెంటేరియన్ అసెంబ్లీలో పాల్గొనేందుకు భారత పార్లమెంట్ స్పీకర్ సుమిత్ర మహాజన్ బృందంతో కలిసి జింబాంబ్వే వెళ్లిన హరిబాబు శనివారం తిరిగి నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా హరిబాబుకు పార్టీ నగర అధ్యక్షుడు ఎం నాగేంద్ర, నాయకులు పివి నారాయణ, ఎస్‌విఎస్ ప్రకాశరెడ్డి, గుండు రఘు, తదితరులు ఘన స్వాగతం పలికారు.