విశాఖపట్నం

ముద్ర రుణాలను సద్వినియోగం చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 1: ప్రధాన మంత్రి ముద్ర యోజన కింద అందచేసే రుణాలను మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ -2 డి.వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. మత్స్యకారుల ఆర్ధిక స్వావలంబనకు ఈ రుణాలు దోహపడతాయన్నారు. ముద్ర రుణాలపై చేపల వ్యాపారులకు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అవగాహన సదస్సు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో చేపల వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారులను, చేపల వ్యాపారానికి సంబంధించిన లఘు పరిశ్రమల యాజమాన్యాలను ఆర్థికంగా పరిపుష్టం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఈ పథకం కింద ఎటువంటి పూచీకత్తు లేకుండా 50 వేల నుంచి 7 లక్షల వరకూ రుణ సౌకర్యం కల్పిస్తారన్నారు. తక్కువ వడ్డీకి 60 వాయిదాల్లో చెల్లించే వీలు ఉంటుందన్నారు. ఇప్పటికే యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీల్లో, జివిఎంసి పరిధిలో 2 వేల మంది మత్స్యకారులను లబ్ధిదారులుగా మత్స్యశాఖ అధికారులు గుర్తించారని, ఇంకా ఎవరైనా ముందుకు వస్తే అర్హతను అనుసరించి రుణాలు మంజూరు చేస్తారన్నారు. ఇతర వివరాల కోసం మత్స్యశాఖ అధికారులను సంప్రదించాలని కోరారు. జిల్లాలోని మత్స్యశాఖ అధికారులను సంప్రదించాలన్నారు. ఈ సమావేశంలో మత్స్యశాఖ సహాయ సంచాలకుడు నారాయణరావు, లీడ్ డిస్ట్రిక్టు మేనేజర్ శరత్ బాబు, నాబార్డు ఎజిఎం ప్రసాదరావు, బ్యాంకుల ప్రతినిధులు యోగిని దేవి, ఇంద్రాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.