విశాఖపట్నం

విశాఖ నుంచి మరింతగా కనెక్టివిటీ అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 26: విశాఖ నుంచి వివిధ ప్రాంతాలకు మరింతగా ఎయిర్ కనెక్టివిటీ అవసరమని విశాఖ ఎంపి కె.హరిబాబు అన్నారు. విమానయాన రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుని రాష్ట్భ్రావృద్ధికి సహకరించాలన్నారు. సరకు రవాణా రంగంపై కూడా విమానయాన సంస్థలు దృష్టి సారించాల్సి ఉందని తెలిపారు. ఎపి ట్రావలర్స్ అసొసియేషన్, ఎపి చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్, టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆఫ్ ఎపి ఆధ్వర్యంలో విశాఖలో ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్సు సమ్మిట్ శనివారం నిర్వహించారు. ఈ సమ్మిట్‌ను ఎంపి హరిబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వనరులు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. విభజన తరువాతే రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందేందుకు వీలు కలుగుతుందని తాను వాదించేవాడినని గుర్తు చేశారు. తెలంగాణలో ఒక విమానాశ్రయం మాత్రమే ఉందని, కానీ రాష్ట్రంలో ఆరు విమానాశ్రయలు ఉన్నాయని గుర్తు చేశారు. విశాఖను నౌకాదళ కేంద్రంగా అభివృద్ది చేసే యోచన కేంద్ర రక్షణ శాఖకు ఉందని తెలిపారు. నౌకదళ సేవల నుంచి ఉపసంహరించనున్న విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విరాట్‌ను విశాఖ తీరంలో మ్యూజియంగా మారనుందని తెలిపారు. విశాఖ నుంచి డిల్లీకి నేరుగా గంట వ్యవధిలో మూడు విమానాలు నడపటాన్ని ప్రస్తావిస్తూ వీటి సమయాలను మార్చే అంశంపై పౌర విమాన యాన శాఖ మంత్రిత్వ శాఖ దృష్టి సారించాల్సి ఉందన్నారు. విశాఖలో మరో ఆరు విమానాలు పార్క్ చేసేందకు ఎప్రాన్ నిర్మించాలన్నారు. దీని వల్ల విశాఖ నుంచి ఉదయానే్న వివిధ ప్రాంతాలకు విమాన సర్వీసులు నడిపేందుకు, పొద్దు పొయిన తరువాత విశాఖకు తరిగి చేరుకునే వీలు ఉంటుందని తెలిపారు. విమానయాన సంస్థలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ముందుకు రావాలన్నారు. ఎయిర్‌పోర్ట్సు అథారిటీ ఆఫ్ ఇండియా హెడ్ ఎయిర్‌పోర్టు మార్కెటింగ్ తారీఖ్ హుస్సేన్ భట్ మాట్లాడుతూ మధ్య ప్రాచ్య దేశాలకు వేళ్లందుకు నేరుగా విమాన సర్వీసులు లేకపోవడం వల్ల హైదరాబాద్ నుంచి 17000 మంది ప్రయాణికులు వెళ్తున్నారని తెలిపారు. డిల్లీ, కొల్‌కతాల నుంచి 60 వేల మంది వెళ్తున్నారని తెలిపారు. విశాఖ వంటి ప్రాంతాల నుంచి నేరుగా విమానాలు నడపాల్సిన అవసరం ఉందన్నారు. 2020 నాటికి విమానప్రయాణికుల సంఖ్య 2.41 మిలియన్లకు చేరుకుంటుందని తెలిపారు. ఫిలిఫ్పీన్స్, లావోస్, పాకిస్థాన్, ఆప్ఘనిస్తాన్ దేశాలకు మినహా ఎఎస్‌ఇఎఎన్, సార్క్ దేశాలకు అదనపు ట్రాఫిక్ రైట్స్‌తో సంబంధం లేకుండా అపరిమితంగా విమాన సర్వీసులు నడిపేందుకు వీలు ఉందని గుర్తు చేశారు. ఎయిర్ పోర్టు అథారిటీ సదరన్ రీజియన్ ఇడి వివిజి రాజు మాట్లాడుతూ రాష్ట్రంలోని విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వై.శివసాగరరావు మాట్లాడుతూ విమాన రంగాభివృద్ధికి చాలా అవకాశాలు ఉన్నాయన్నారు. దేశంలో రద్దీ విమానాశ్రయల్లో విశాఖ 18వ స్థానంలో ఉందని తెలిపారు. భోగాపురంలో నిర్వహణ, మరమ్మతు, ఓవర్ హ్యాలింగ్ (ఎంఆర్‌ఒ) సౌకర్యంతో పాటు ఏవియేషన్ అకాడమీ కలిగిన తొలి పూర్తి స్థాయి విమానాశ్రయం నిర్మించనున్నారని తెలిపారు. అంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ హైదరాబాద్‌కు నెలకు1000 టన్నుల బంగారం దిగుమతి అవుతుందని, దాని వలన ఆ రాష్ట్రానికి దాదాపు 100 కోట్ల రూపాయల మేరకు ఆదాయం లభిస్తున్నదని గుర్తు చేశారు. సరకు రవాణా వ్యయాన్ని తగ్గించాల్సి ఉందన్నారు. ఎపిసిసిఐఎఫ్ డైరెక్టర్ ఒ.నరేష్ కుమార్ మట్లాడుతూ బ్యాంకాక్‌కు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించాల్సి ఉందన్నారు. విమానాశ్రయ ప్రాంతంలో బడ్జెట్ హోటల్స్ ఏర్పాటు, గార్డెన్సు వంటివి ఏర్పాటు చేయాలన్నారు. జపాన్ వంటి చిన్న దేశంలో ప్రపంచంలోని మొదటి 10 అంతర్జాతీయ విమానాశ్రయాల్లో మూడు అక్కడే ఉన్నాయని గుర్తు చేశారు. రాష్ట్రంలోని ఒక విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయిలో ముందుగా తీర్చిదిద్దాలన్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఎయిర్ ట్రావలర్స్ అసోసియేషన్ ప్రతినిధి చెరువు రామకోటయ్య, టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రతినిధులు డిఎస్ వర్మ, కె.విజయమోహన్, రాష్ట్రంలోని వివిధ విమానాశ్రయాల డైరెక్టర్లు, విమానయాన సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

విశాఖను మార్కెట్ చేయడంలో విఫలం
* ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ అధ్యక్షుడు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మార్చి 26: సుందరమైన బీచ్‌లు, ప్రసిద్ధ ఆలయాలు, ప్రాచీన కట్టడాలు కలిగిన సుందర విశాఖను విదేశీ పర్యాటకులను ఆకర్షించే విధంగా మార్కెట్ చేయడంలో రాష్ట్ర పర్యాటక శాఖ విఫలమైందన్న అభిప్రాయాన్ని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ అధ్యక్షుడు సుభాష్ గోయల్ వ్యక్తం చేశారు. ఎపి ట్రావలర్స్ అసొసియేషన్, ఎపి చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్, టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆఫ్ ఎపి ఆధ్వర్యంలో విశాఖలో ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్సు సమ్మిట్ శనివారం నిర్వహించారు. సదస్సులో ఆయన మాట్లాడుతూ విదేశీ పర్యాటకులు కొత్త పర్యాటక ప్రాంతాలను సందర్శించేందకు ఆసక్తి కనబరుస్తున్న నేపథ్యంలో విశాఖ అందాలకు ప్రాచుర్యం కల్పించడంలో పర్యాటక శాఖ విఫలమైందన్నారు. తాను తొలిసారిగా ఈ సమ్మిట్‌లో పాల్గొనేందుకు విశాఖ వచ్చానని, విశాఖ అందాలకు తాను ముగ్ధుడయ్యాన్నారు. విశాఖ పర్యాటకుల స్వర్గ ధామంగా తీర్చిదిద్దాలని, ఇందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించాల్సి ఉందన్నారు. విమానయాన సంస్థలు సర్వీసుల నిర్వహణకు ముందుకు వచ్చేలా ఓపెన్ స్కై పాలసీ అవసరమన్నారు. విశాఖను తగిన విధంగా మార్కెట్ చేయాలన్నారు. శ్రీలంక ఎయిర్‌లైన్స్‌కు చెందిన లతిత్ డి సిల్వ మాట్లాడుతూ రాష్ట్రానికి మరిన్ని విమాన సర్వీసులు నడిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఎయిర్ ఇండియా ఇడి హరిహరన్ మాట్లాడుతూ తాము చిన్న తరహా విమానాలను 10 సమకూర్చుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఏడాది జూన్ నాటికి 3 అందుబాటులోకి వస్తాయన్నారు. సిల్క్ ఎయిర్ ప్రతినిధి మాట్లాడుతూ ఈ-విసా విధానం అవసరమన్నారు. సౌదీ అరేబియా ఎయిర్‌లైన్స్ ప్రతినిధి ప్రేమ్ మాట్లాడుతూ రాష్ట్రంలో విమానయాన రంగానికి చాలా అవకాశాలు ఉన్నాయన్నారు. దుబాయ్ తదితర దేశాలకు విశాఖ నుంచి నేరుగా విమానాలు నడపాల్సి ఉందన్నారు. జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన సుందరేశన్ మాట్లాడుతూ టైర్ 2,3 ప్రాంతాలకు విమాన సర్వీసులు నడపాలన్నారు. స్పైస్ జెట్ ప్రతినిధి రామకృష్ణ మాట్లాడుతూ తిరుపతికి విశాఖ నుంచి సర్వీసులు నడిపే ఆలోచన ఉందన్నారు. విశాఖకు ఎక్కువగా వ్యాపార వర్గాల వారు వస్తున్నారని తెలిపారు. కానీ పర్యాటకులు, ఇతర వర్గాల వారు రావడం లేదని తెలిపారు.