విశాఖపట్నం

మన గ్రామం-మన విశాఖను విజయవంతం చేయాలి : కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 3: మన గ్రామం-మన విశాఖ కార్యక్రమానికి ప్రజల నుండి మంచి స్పందన లభిస్తోందని, అధికారులు మరింత ఉత్సాహంగా చిత్తశుద్ధితో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ పిలుపునిచ్చారు. గురువారం నిర్వహించిన మన గ్రామం-మన విశాఖ కార్యక్రమంపై కలెక్టర్ శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్షించారు. గ్రామాల్లో గుర్తించిన సమస్యలు పరిష్కారం చేసిన అంశాలు, ప్రజాస్పందన తదితర అంశాలపై అధికారులు ఫీడ్ బ్యాక్ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిఒక్క అధికారి, ప్రజాప్రతినిధి సొంతంగా భావించి భాగస్వాములు కావాలన్నారు. వచ్చేనెల రెండవ తేదీలోపు 70 గ్రామాలను బహిరంగ మలవిసర్జన లేని గ్రామాలుగా వెల్లడించేలా లక్ష్యంగా చేసుకున్నామని, దీనిని సాధించడానికి గ్రామస్థాయిలో సర్పంచ్, విఆర్‌ఒ, సెక్రటరీ, స్వయం సహాయక సభ్యుల సహకారంతో పనిచేయాలని, మండల అధికారులు ఇతర అధికారులతో సమన్వయంగా ఉండాలన్నారు. ఈ నెలలో మన గ్రామం-మన విశాఖ కార్యక్రమంతో సంబంధం లేకుండా ప్రతిరోజు గ్రామాల్లో పర్యటించాలన్నారు. ఈ నెలలో ఎంత తక్కువ వీలైతే అంత ఎక్కువుగా పర్యటించి, గ్రామాల్లో ప్రజాప్రతినిధులను కూడా భాగస్వాములను చేయాలన్నారు. అన్ని పంచాయిత్లీ పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్ తీసుకోవాలని డిపిఓ కృష్ణకుమారికి సూచించారు. వచ్చే గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తానని, క్షేత్రం నుండే మండల బృందాలు అక్కడి సమస్యలను, కార్యాచరణ ప్రణాళికలను, ప్రగతిని తెలియజేయాలన్నారు. ఈ సమావేశంలో జెసి-2 వెంకటరెడ్డి, నోడల్ అధికారులు హాజరయ్యారు.
మట్టి వినాయక ప్రతిమలకు పెరుగుతున్న ఆదరణ
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, సెప్టెంబర్ 3: ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పిఒపి)తో చేసిన వినాయక విగ్రహాల వల్ల పర్యావరణానికి కలిగుతున్న ముప్పుపై వివిధ సంస్థలు చేస్తున్న కృషి ఫలితాలను ఇస్తున్నది. మట్టితో చేసిన వినాయక ప్రతిమలకు ఆదరణ పెరుగుతుండటం పర్యావరణ ప్రేమికులకు మరింత ఉత్సాహాన్ని ఇస్తున్నది. పిఒపితో చేసిన వినాయక విగ్రహాలను కొద్ది సంవత్సరాల క్రితం వరకూ ఎక్కువగా ఉపయోగించేవారు. వీటి ధర తక్కువగా ఉండటమే కాకుండా ఆకర్షణీయంగా ఉండటంతో ఎక్కువ మంది కొనుగోలు చేసేవారు. విగ్రహాలు అందంగా ఉన్నప్పటికీ ఇందులో ప్రమాదకరమైన రసాయనాలు, రంగులు ఉపయోగిస్తారు. విగ్రహాల తయారీలో వాడే వాటిలో జిప్సం, లెడ్, కాడ్మియం, పాదరసం, తదితర లోహాలు ఉంటాయి. విహ్రాలను చెరువులు, నదుల్లో నిమజ్జనం చేసినప్పుడు ఈ ప్రమాదకరమైన రసాయనాలు నీటిని కలుషితం చేస్తున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. నిమజ్జనం చేసే ప్రాంతాలపై కొన్ని ఆంక్షలు విధించింది. మహారాష్టల్రోని పూనెలో నిమజ్జనం చేసేందుకు వీలుగా కొన్ని ట్యాంక్‌లను అక్కడి అధికారులు నిర్మించి, అందులో నిమజ్జానికి 2006 నుంచి ఏర్పాట్లు చేస్తున్నారు. దీని వల్ల చాలా వరకూ నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. వివిధ పర్యావరణ పరిరక్షణకు పని చేస్తున్న సంస్థలు, అధికార యంత్రాంగం గత కొంత కాలంగా తీసుకున్న చర్యలతో ఇటీవల కాలంలో మట్టి వినాయక ప్రతిమల వాడకం గణనీయంగా పెరిగింది. మరింతగా ఈ విగ్రహాల వాడకాన్ని పెంచేందుకు విద్యార్థులకు మట్టి విగ్రహాల తయారీపై శిక్షణ ఇస్తున్నాయి. మట్టితో చేసిన విగ్రహాలను వివిధ సంస్థలు భారీ సంఖ్యలో ఉచితంగా పంపిణీ చేస్తున్నాయి. దీంతో పిఒపి విగ్రహాలకు డిమాండ్ తగ్గడంతో పాటు మృత్తికతో చేసిన విగ్రహాలు కూడా మార్కెట్‌లో దర్శనమిస్తున్నాయి.
విగ్రహాల పంపిణీ
మృత్తికతో చేసిన విగ్రహాలను వివిధ సంస్థలు ఉచితంగా పంపిణీ చేశారు. విజెఎఫ్ ఆధ్వర్యంలో నార్ల భవన్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో విగ్రహాల పంపిణీని జెసి-2 వెంకటరెడ్డి, ఎయు మాజీ వీసీ జిఎస్‌ఎన్ రాజు లాంఛనంగా ప్రారంభించారు. మొక్కలను కూడా పంపిణీ చేశారు. మైల్‌స్టోన్ సంస్థ ఆధ్వర్యంలో ఎన్‌జిజిఒ కాలనీలో రహీమున్నీసా బేగం ఆధ్వర్యంలో విగ్రహాలు పంపిణీ చేశారు. ఈజీ ఆన్‌లైన్ డాట్‌కామ్ సంస్థ, దేవాదాయ శాఖ, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో కూడా వినాయక విగ్రహాలను ఉచితంగా అందచేశారు. కప్పరాడ వైభవ వేకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, ఎంవిపికాలనీలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పంపిణీ చేశారు. దీనికి మృత్తికతో విగ్రహాల తయారీపై విద్యార్థులకు శిక్షణా కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఎవిఎన్ స్కూల్‌లో తదితర చోట్ల శిక్షణ ఇచ్చారు.