విశాఖ

గోదావరి జలాలు విశాఖకు తరలింపులో వివక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి, సెప్టెంబర్ 4: గోదావరి జలాలను విశాఖకు తరలించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివక్ష ధోరణిని విడనాడాలని ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాజెక్టుల సాధన సమితి కన్వీనర్ మాజీమంత్రి కొణతాల రామకృష్ణ హెచ్చరించారు. తన క్యాంప్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా విశాఖపట్నంకు నీరు తరలించే ప్రక్రియ త్వరలోనే అమలులోకి వస్తుందని, ఇందుకు సంబంధిం చి పెద్దమొత్తంలో నిధులు మంజూరు చేశామని, రాష్ట్రంలోని పాలకులు పలు పర్యాయాలు ప్రకటనలు చేశారన్నారు. తాజాగా పురుషోత్తపట్నం ఎత్తిపోతలకు ఎఫ్‌ఆర్‌ఎంబి నిబంధనలు అనుకూలంగా లేవని ప్రాజెక్టు రెగ్యులేషన్ కమిటీ ప్రకటించడం అన్యాయమన్నారు. ఒకవైపు పోలవరం ఎడమకాలు వ ద్వారా ఇప్పటికే పట్టిసీమకు నీటిని తరలించడంతోపాటు చింతలపూడి ఎత్తిపోతలకు సైతం రూ. 4,700కోట్ల నిధులు మంజూరు చేస్తూ రూ. 1,600 కోట్ల వ్యయం కలిగిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం మంజూరుకు ప్రతిబంధకంగా ప్రకటనలు చేయడం అన్యాయమన్నారు. పోలవరం కుడికాలువ ద్వారా ఉభయ గోదావరి జిల్లాలకు సాగు, తాగునీటిని అందించడం పట్ల పాలకులు చూపిస్తున్న ఆసక్తిని విశాఖజిల్లాకు పోలవరం కుడికాలువ ద్వారా నీటిని అందించేందుకు చూపించడంలో వివక్ష చూపడం అన్యాయమన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలోని మంత్రు లు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులంతా పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ఏర్పడిన ఆటంకా లు తొలగించి తక్షణమే సంబంధిత పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుని ఈ ప్రాంత సాగు, తాగునీటి సమస్యలకు పరిష్కారానికి మార్గం సుగమం చేయాలని మాజీమంత్రి కొణతాల డిమాండ్ చేశారు.ఇప్పటికే విశాఖ రైల్వేజోన్ అమలు కాలేదని, నిమ్స్ ఆసుపత్రి నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోయిందని, ఈ ప్రాంతానికి రావాల్సిన విద్యాసంస్థలు సైతం ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.తొలుత విశాఖపట్నంకు మెట్రో రైలు ప్రాజెక్టు మంజూరు కావా ల్సి ఉండగా ప్రతిపాధనలో లేని విజయవాడకు మెట్రో రైలు మంజూరు చేసి విశాఖపట్నంకు ఆ ప్రాజెక్టు మంజూరు ప్రతిపాధనే తెరమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాలు నీటిపారుదల, విద్య, వైద్యం తదితర అన్ని రంగాల్లోను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురికావాల్సి వస్తుందని వాపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు లో మార్పురాకపోతే తగు రీతిలో స్పందించాల్సి వస్తుందని మాజీమంత్రి కొణతాల హెచ్చరించారు. ఈ సమావేశంలో నూకాంబిక దేవస్థానం మాజీ చైర్మన్ నాగశ్రీను, మునగపాక రైతు సంఘం నాయకుడు గణపతి అచ్చింనాయుడు, ఎంపీటీసీ నాగరాజు, కాండ్రేగు ల చందు, బుద్ద రాజేష్ పాల్గొన్నారు.