విశాఖపట్నం

నగరానికి చవితికళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 4: వినాయకుని విగ్రహాలు, పూజాసామాగ్రి కొనుగోలు చేస్తుండటంతో గత రెండు రోజులుగా మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. నగరంలోని పూర్ణామార్కెట్, అల్లిపురం, జ్ఞానాపురం, అక్కయపాలెం, మర్రిపాలెం మార్కెట్లు వినియోగదారులతో నిండాయి. నగరంలోని సీతమ్మధార, అక్కయపాలెం, ఎంవిపి కాలనీ, మర్రిపాలెం, కంచరపాలెం, మధురవాడ, గోపాలపట్నం ప్రాంతాల్లో ఉండే రైతుబజార్లు ఉదయం నుంచే వినియోగదారులతో నిండాయి. వినాయకుని విగ్రహం, పాలవెల్లి, పత్రి, పండ్లు, పలు రకాలైన పుష్పజాతులు ఎక్కువుగా కొనుగోలు చేస్తున్నారు. అయితే వీటన్నింటికీ డిమాండ్ మరింతగా పెరిగింది. యాపిల్, బత్తాయి, ద్రాక్ష, దానిమ్మ, జామి, వెలగ, సీతాఫలం, చెరకు వంటివి సామాన్యులకు ఏమాత్రం అందుబాటులో లేకుండాపోయాయి. వంద రూపాయాలకు కేవలం నాలుగు యాపిల్స్ మాత్రమే లభిస్తున్నాయి. వినాయకునికి ప్రీతి అయిన వెలగపండు ఒక్క దానికి కనీసం పది రూపాయలు చెల్లించాల్సిందే. అలాగే బత్తి, చామంతి, గులాబి, మల్లె, కనకాంబరాలు వంటి పుష్పజాతులకు డిమాండ్ నెలకొంది. ఇందులో కొన్ని లభించని పరిస్థితులున్నాయి. వినాయకచవితి పండుగతో టెంకాయలు, అరటి పండ్లు కొనుగోలు చేయలేకపోతున్న స్థాయికి వెళ్ళిపోయాయి. సాధారణ రోజుల్లో కేవలం ఎనిమిది రూపాయలకు లభించే ఒక్కో కొబ్బరికాయ ఇపుడు 12 నుంచి 15 రూపాయలకు చేరుకుంది. డజన్ అరటి పండ్లు రూ.50లు పలుకుతున్నాయి. అగరబత్తి, వత్తులు, నెయ్యి, హారతి, సాంబ్రాణి, గంధం,ఆకుచెక్క వంటి పూజాసామాగ్రి ప్రియమైంది.
నిత్యావసర సరకులకు రెక్కలు
నిత్యావసర సరుకుల సంగతి చెప్పనక్కర్లేదు. కిలో బియ్యం కనీసం రూ.50లకు చేరుకోగా, పలు రకాల నూనెలు వంద రూపాయలకు మించిపోయాయి. పెసర,కంది, శనగపప్పులు, శనగపలుకులు, సబ్బులు ధరలు విపరీతంగా పెరిగాయి. ఏమాత్రం అదుపులో లేని నిత్యావసర సరుకుల కొనుగోలు చేసేందుకు సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.
మట్టి వినాయకునికి పెరిగిన ప్రాధాన్యత
పర్యావరణ పరిక్షణలో భాగంగా విశాఖ నగరంలోని ప్రతిచోట అందుబాటలోకి వచ్చిన మట్టి వినాయకులపట్ల నగరవాసులు ఎక్కువుగా ఆసక్తి చూపుతున్నారు. వీటినే ఎక్కువశాతం మంది వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు. నగరంలోని కొన్ని స్వచ్చంధ సంస్థలు మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తుండగా వీటి వాడకంపైనే కొద్దిరోజులుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో వీటిపట్ల ఆసక్తి చూపుతున్నారు.
గృహ నిర్మాణాలు వేగవంతం కావాలి
40 శాతం ఇళ్లను ఏజెన్సీ ప్రాంతంలోనే నిర్మిస్తున్న నేపథ్యంలో అక్కడ ఇంజనీరింగ్ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఇక మీదట ప్రతి పక్షం రోజులకు ఒకసారి గృహనిర్మాణంపై ఎయి స్థాయి అధికారులతో సమీక్షిస్తానని, పురోగతి లేకపోతే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. దీనికోసం అవసరమైతే ఇంజనీరింగ్ అధికారులు గ్రామాల్లో ఉండి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. నిర్మాణం ప్రారంభించి పూర్తి చేయని వారి విషయంలో అధికారులు అవగాహన కల్పించాలని, వారు సత్వరమే పనులు ప్రారంభించేలా స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని సూచించారు. అయినప్పటికీ స్పందన రాకపోతే నిధుల రికవరీ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. లబ్దిదారుల ఆచూకీ లేని, క్రయ,విక్రయాలు జరిగిన వారి వివరాలను తెలియజేస్తే ప్రభుత్వానికి నివేదించి తదుపరి నిర్ణయం తీసుకుందామన్నారు. ఎన్‌టిఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద జిల్లాకు మంజూరైన 9000 గృహాల్లో 6,333 మంది లబ్దిదార్లను గుర్తించినప్పటికీ మిగిలిన వారికి ఈ నెల 8వ తేదీలోగా గుర్తించాలని ఆదేశించారు. పిఎంజెఎస్‌వై కింద 10,912 మంది లబ్దిదార్లను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. హుదూద్ స్పెషల్ హౌసింగ్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన 5,462 గృహాల నిర్మాణం పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. అలాగే జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం, రాజీవ్ గృహ కల్ప కాలనీల్లో వౌలిక సదుపాయాల కల్పన పూర్తి కాలేదని, సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో గృహ నిర్మాణ శాఖ డైరెక్టర్ జివి ప్రసాద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రాజెక్టుల ప్రగతిని వివరించారు. సమావేశంలో ఎగ్జిక్యుటివ్ ఇంజనీర్లు కెవి రవికుమార్, టి రమేష్, బి బాబు, రవి శంకర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

*
ఆంధ్రభూమి బ్యూరో