విశాఖపట్నం

నేడు రోజంతా విద్యుత్‌కు అంతరాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 26: విశాఖ జిల్లా కశింకోట సమీపానున్న నరసింగబిల్లి సబ్‌స్టేషన్ పరిధిలో మరమ్మతులు చేపడుతున్నందున ఏపీట్రాన్స్‌కోకు చెందిన టవర్స్ వర్క్ చేపట్టిన నేపధ్యంలో ఆదివారం ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు దీని పరిధిలోకి వచ్చే పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. ఈ మేరకు శనివారం అనకాపల్లి డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ జి.రాజ్‌కుమార్ శుక్రవారం ప్రకటనలో విడుదల చేశారు. యలమంచిలి, ఎస్.రాయవరం, నర్సీపట్నం, నక్కపల్లి, పాయకరావుపేట మండలంలోని ప్రాంతాల్లోని విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందన్నారు. విద్యుత్ వినియోగదారులు దీనిని గమనించి తమతో సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

బాలిక ప్రాణబిక్షకు సిఆర్‌పిఎఫ్ విరాళాల సేకరణ
విశాఖపట్నం, మార్చి 25: పేదరికంతో ఉన్న పాత నగరానికి చెందిన వి.హేమలత అనే 16 ఏళ్ళ బాలిక వ్యాధి తీవ్రతతో వెల్లూరు క్రిష్టియన్ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈమెకు వైద్య పరీక్షలన్నీ దాదాపు పూర్తి అయి శస్తచ్రికిత్సకు సిద్ధంగా ఉన్న ఈమె తల్లిదండ్రులకు మొదటి నుండి చైల్డ్ రైట్స్ ప్రొటక్షెన్ ఫోరం నగర కన్వీనర్ గొండు శీతారాం ప్రోత్సాహంతోపాటు 3మేము సైతం2 స్వచ్ఛంద సేవా సంస్థ, వ్యాపార, వాణిజ్య సంస్థలు నగరానికి చెందిన అనేక ప్రైవేటు పాఠశాలల ప్రతినిధులు, దాతల సహకారంతో దాదాపు 18 లక్షలు అందించడంతో వైద్యపరీక్షలు పూర్తికావడంతో శస్తచ్రికిత్స చేయించేందుకు ఆసన్నవౌతున్న తరుణంలో మరో పది లక్షలు వ్యయం ఉంటే తప్ప శస్తచ్రికిత్స జరుపలేమని అక్కడి వైద్యులు సూచించారు. అన్ని రకాల ప్రయత్నాలు చేసి అమ్మాయి ప్రాణాలు గాలిలో కలిసిపోకుండా ఉండాలనే తపనతో మరింత వ్యయం దాతల నుండి సమకూర్చుకోవాలనే ఆశయంతో శనివారం ఆర్‌కె బీచ్ రోడ్‌లోచైల్డ్ రైట్స్ ప్రొటక్షన్ ఫోరం వివిధ స్వచ్చంధ సేవా సంస్థలు, 3పేద బాలిగకను ఆర్ధికంగా ఆదుకొందాం, ప్రాణాన్ని కాపాడుదాం అనే పేరుతో బ్యానర్లను ప్రదర్శిస్తూ కరపత్రాలను పంపిణీ చేస్తూ జోలెయాత్ర నిర్వహించారు. దీనికి స్పందించిన దాతలు ముందుకొచ్చి జోలెలో కొంత మొత్తాలను విరాళాలుగా వేయడమే కాకుండా ఆ బాలికను కాపాడేందుకు మేము సైతం అంటు స్వచ్చంధంగా ముందుకొచ్చి సహకరించారు. ఫోరం నగర కన్వీనర్ గొండు శీతారాం మాట్లాడుతూ బాలికకు సంక్రమించిన వ్యాది ప్రాణంతో చెలగాట మాడడమే కాకుండా తల్లిదండ్రుల ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని దాతలు ముందుకొచ్చి త్వరితగతిన ఆర్ధిక సహాయం అందించాలన్నారు. తమ ఫోరం వెన్నంటి ఉండి బాలికకు అన్నివిధాలా సహకరిస్తున్న సృష్టి వీడియోస్ అధినేత దక్షిణామూర్తి, మేము సైతం మీ వెంట స్వచ్చంద సంస్థ నిర్వాహక అధ్యక్షులు రమేష్ ఇతర దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. బాలికను ఆదుకునే దాతలు విరాళాలు పంపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. సిఆర్‌పిఎఫ్ ప్రతినిధులు గంట్యాడ శంకరావు, జివి కుమార్, ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

అంబేద్కర్ మెమోరియల్ సొసై ఎన్నికల వాయిదా
విశాఖపట్నం, (కల్చరల్) మార్చి 26: బాబాసాహెబ్ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ (అంబేద్కర్ భవన్) నూతన కార్యవర్గం (2016-18) ఎన్నికలపై విశాఖపట్నం 2వ అదనపు జిల్లా కోర్టు స్టే విధించిన కారణంగా 27న జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడ్డాయని సంస్థ అధ్యక్షులు వి.రాఘవేంద్రరావు పేర్కొన్నారు. శనివారం విజెఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కొందరు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం కోర్టు ఉత్తర్వులను వక్రీకరిస్తూ భాష్యం చెబుతున్నారని, ఇది సత్యదూరమన్నారు. ప్రముఖ న్యాయవాది బైపా అరుణ్‌కుమార్ మాట్లాడుతూ ఎన్నికల అధికారి ఎన్నికల్ని వాయిదా వేసారని, తదుపరి ఎన్నిలక తేదీ తరువాత ప్రకటిస్తారన్నారు. నూతన కార్యవర్గం ఏర్పడకుడా ప్రస్తుత కోర్ కమిటి సభ్యులు మాజీలు కాబోరని, దీనిపై కొంత రగడ జరగడం విచారకరమన్నారు. అవాస్తవ వ్యాఖ్యాలు చేస్తూ ప్రతిష్టకు మచ్చతెచ్చే వారిపై దావా వేసేందుకు వెనుకాడబోమన్నారు. ఈ సమావేశంలో సొసైటి తరపు న్యాయవాది జి.సుబ్బారావు, కె.రాము తదితరులు పాల్గొన్నారు.