విశాఖపట్నం

ప్రకృతి వ్యవసాయంపై రైతులకు శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 9: జిల్లాలోని వ్యవసాయాధికారులు ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కలిగించాలని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. ప్రకృతి వ్యవసాయ పితామహుడు పద్మశ్రీ సుభాష్ పాలేకర్ మహరాష్ట్ర వారితో నాలుగు రోజులపాటు తిరుపతిలో శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నారన్నారు. జిల్లాలో అనకాపల్లి, పద్మనాభం, చోడవరం, నర్సీపట్నం, నాతవరం, పాడేరు, చింతపల్లి, మాడుగుల, అరకువ్యాలీ, హుకుంపేట తొమ్మిది మండలాలకు సంబంధించి సుమారు 300 మందిని ఎంపిక చేసిన రైతులు ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన తెలిపారు. ప్రస్తుత పరిస్థితులో రైతులకు ప్రకృతి నుండి లభించే అనేక సేంద్రియ పదార్ధాలతో ఎరువులు ఆకులతో, కషాయాలు, ఆవుపేడ, మూత్రంతో అద్భుత గుణాలున్న ఘన జీవామృతం, ద్రవ్య జీవామృతం, విత్తన శుద్ధికి బీజామృతం మొదలైనవి ఈ పద్ధతిలో వాడేందుకు రైతులకు శిక్షణనిస్తారన్నారు. రానున్న ఖరీప్ రబీ సీజన్లలో రైతులు ఆయా పద్దతులు అవలంబించి సాగు ఖర్చులు తగ్గించడంతోపాటు సంపూర్ణ ఆరోగ్యానికి ఉపకరించు రసాయనరహిత వ్యవసాయ ఉత్పత్తులు సాగుచేయాలన్నారు. రైతులకు వ్యవసాయ శిక్షణా కార్యక్రమంలో అవగాహన పెంచుకుని రానున్న రోజుల్లో ప్రకృతి వ్యవసాయంపై దృష్టిసారించి ఫలితాలను అందుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ జె.నివాస్, జేసి-2 డి.వెంకటరెడ్డి, వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు సత్యనారాయణ, డిడి రాజబాబు, ఏఓ మహేశ్వరరావు, రైతులు పాల్గొన్నారు.