విశాఖ

బాబోయ్ ... చవితి సంబరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేపగుంట, సెప్టెంబర్ 9: చవితి సంబరాలంటేనే పోలీసు వర్గాలకు ముచ్చెమటలు పట్టేస్తున్నాయి. మొన్నటి వరకూ చవితి సంబరాల్లో జరిగే సాంస్కృతిక ప్రదర్శనలు, ఇతర కార్యక్రమాలను చూసీచూడనట్టు వదిలేసిన పోలీసు యంత్రాంగం సింహాచలం సంఘటనతో ఒక్కసారి ఉలిక్కిపడింది. చవితి సంబరాల్లో ఎక్కడ అశ్లీలత చోటుచేసుకుంటే తాము ఇరుక్కుంటామన్న భయాందోళన పోలీసు అధికారులు, సిబ్బందిని వేధిస్తోంది. సింహాచలంలో వినాయక చవితి ఉత్సవ ఊరేగింపులో అత్యుత్సాహాన్ని ప్రదర్శించిన నిర్వాహకులు అశ్లీల నృత్యాలను ఏర్పాటు చేశారు. ఈ తతంగాన్ని కొంతమంది చిత్రీకరించి, నగర పోలీసు కమిషనర్ యోగానంద్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తీవ్రంగా స్పందించిన కమిషనర్ ఏకంగా నార్త్ ఎసిపి భీమారావు, గోపాలపట్నం సర్కిల్ ఇనస్పెక్టర్ బాల సూర్యారావులను ఏకంగా విధుల నుంచి తప్పించారు. కింది స్థాయి సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో పోలీసు వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. నిర్వాహకులల్లో కొంతమందిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇక మీదట చవితి సంబరాల్లో అశ్లీలత చోటుచేసుకుంటే చర్యలు తప్పవంటూ సిపి చేసిన హెచ్చరిక ఇప్పుడు పోలీసు వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. స్థానిక రాజకీయ నాయకుల పలుకుబడికి తలొంచి కొంతమంది, నిర్వాహకుల ప్రలోభాలకు లొంగి కొంతమంది ఇప్పటి వరకూ ఈ విషయాలను సీరియస్‌గా తీసుకోలేదు. సింహాచలం సంఘటనతో తేరుకున్న పోలీసులు చవితి పందిళ్ల వద్ద పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. పందిళ్ల వద్ద, ఊరేగింపు వేడుకల్లో ఎక్కడ అశ్లీలత కన్పించినా చర్యలు తప్పవంటూ బోర్డులు పెట్టి మరీ హెచ్చరిస్తున్నారు.